For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Anchor Ravi: పర్సనల్ వీడియో వైరల్: పెళ్లి తర్వాత నీ మొగుడు కూడా అదే చేస్తాడంటూ వర్షిణిపై కామెంట్

  |

  తెలుగు బుల్లితెరపై లేడీ యాంకర్లదే హవా ఎక్కువగా కనిపిస్తుంది. అయినప్పటికీ దాదాపు పదేళ్లుగా తనలోని అద్భుతమైన టాలెంట్‌తో వాళ్ల పోటీని తట్టుకుని నిలబడగలిగాడు రవి. అదిరిపోయే టైమింగ్‌ ఉన్న ఈ యాంకర్‌.. వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. కేవలం టీవీ షోలలోనే కాకుండా ఇతరత్రా కార్యక్రమాల్లో కూడా ఉంటూ ఎక్కడ చూసినా కనిపిస్తున్నాడు. అదే సమయంలో తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ పర్సనల్ వీడియోను వదిలాడు. అదే సమయంలో వర్షిణిపై కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

  కెమెరాకు చిక్కిన ప్రిన్స్ నరులా, యువిక.. ఫొటోస్ వైరల్

   అలా మొదలైన యాంకర్ రవి కెరీర్

  అలా మొదలైన యాంకర్ రవి కెరీర్

  చాలా కాలం క్రితమే బుల్లితెరపైకి యాంకర్‌గా ప్రవేశించాడు రవి. ఆరంభంలోనే అదరొట్టిన అతడు.. బెస్ట్ హోస్టుగా అప్పుడే పేరు సంపాదించుకున్నాడు. తద్వారా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. అదే సమయంలో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించాడు. ఈ మధ్య కాలంలో టీవీ షోలు, సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు వంటివి చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు.

  అందులో శ్రీముఖితో కలిసి హల్‌చల్

  అందులో శ్రీముఖితో కలిసి హల్‌చల్

  దాదాపు పదేళ్ల కెరీర్‌లో యాంకర్ రవి ఎన్నో షోలను నడిపించాడు. వాటిలో ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయిన ‘పటాస్' మాత్రం అతడికి ఎంతగానో గుర్తింపును తెచ్చి పెట్టింది. ఇందులో హాట్ యాంకర్ శ్రీముఖితో కలిసి అతడు చేసిన రచ్చకు ఎంతో మంది ఫిదా అయిపోయారు. అదే సమయంలో కొన్ని విమర్శలూ వచ్చాయి. చాలా కాలం తర్వాత ఈ షోకు గుడ్‌బై చెప్పేశాడతను.

  వివాదాలతో సావాసం.. నిత్యం వార్తలే

  వివాదాలతో సావాసం.. నిత్యం వార్తలే

  సుదీర్ఘమైన ప్రయాణంలో యాంకర్ రవి ఎన్నో అరుదైన మైలురాళ్లను అందుకున్నాడు. అదే సమయంలో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. ఆ మధ్య ఓ సినిమా ఫంక్షన్‌లో ఆడవాళ్లపై చేసిన కామెంట్స్ పెద్ద రాద్దాంతం అయ్యాయి. ఆ తర్వాత అతడు పలుమార్లు క్షమాపణలు చెప్పినా విమర్శల పాలయ్యాడు. ఇక, తరచూ డబుల్ మీనింగ్ డైలాగులతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.

  ఒకే సినిమా.. కేసుల వరకూ వెళ్లింది

  ఒకే సినిమా.. కేసుల వరకూ వెళ్లింది

  యాంకర్ రవి కొన్నేళ్ల క్రితం ‘ఇది మా ప్రేమకథ' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ డిజాస్టర్ అయింది. దీనికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ సందీప్ తనను రూ. 41 లక్షలు ఇవ్వకుండా మోసం చేశాడని ఫిర్యాదు చేశాడని రవి అతడిపై కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు పెట్టాడు. ఆ తర్వాత అతడు కూడా యాంకర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇది పెద్ద సంచలన అయింది.

   పురుషా పురుషా అంటూ షాకిచ్చాడు

  పురుషా పురుషా అంటూ షాకిచ్చాడు

  యాంకర్ రవి కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. ఇందులో భాగంగానే తాజాగా ‘వకీల్ సాబ్' సినిమాలోని మగువా మగువా పాటకు మేల్ వెర్షన్‌గా ‘పురుషా పురుషా' అనే పాటను చేశాడు. ఇందులో ఇంట్లోని పనులు మొత్తం తానే చేస్తున్నట్లు చూపించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

  రవి వీడియోపై వర్షిణి ఫన్నీ కామెంట్

  రవి వీడియోపై వర్షిణి ఫన్నీ కామెంట్

  యాంకర్ రవి చేసిన ఈ వీడియోకు నెటిజన్లతో పాటు ప్రముఖుల నుంచి కూడా కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటికే నటి భానూ శ్రీ, యాంకర్ విద్య తదితరులు రిప్లైలు ఇచ్చాడు. ఈ క్రమంలోనే యాంకర్ వర్షిణి ‘అయ్యో మా రవన్నా ఏంటి ఇలా అయిపోయావ్? కానీ మస్త్ ఉంది చూడడానికి' అంటూ ఫన్నీ కామెంట్ పెట్టింది. దీంతో ఆమెకు మద్దతుగా ఎంతో మంది రిప్లైలు ఇస్తున్నారు.

  పెళ్లయ్యాక నీ మొగుడు కూడా అంటూ

  పెళ్లయ్యాక నీ మొగుడు కూడా అంటూ

  ఎవరు కామెంట్ చేసినా యాంకర్ రవి అదే రీతిలో బదులిస్తున్నాడు. ఈ క్రమంలోనే సెలెబ్రిటీలతో పాటు సామాన్యులకు సైతం రిప్లైలు ఇస్తున్నాడు. ఇందులో భాగంగానే యాంకర్ వర్షిణి చేసిన కామెంట్‌కు ‘వర్షిణి.. సమాజంలో ప్రతి మగాడి పరిస్థితి ఇంతే కదా. రేపు పెళ్లి తర్వాత నీ మొగుడు కూడా ఇదే చేయాలి.. నువ్వు చేయిస్తావ్ కూడా' అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.

  English summary
  Telugu VJ and an Anchor Ravi Very Active in Social Media. Now he shared Male Version of Maguva Maguva Song in Insagram. Then Anchor Varshini Comment on This post.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X