Anchor Ravi: నాపై ఆ లేడీ యాంకర్ క్షుద్రపూజలు.. యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్..

Anchor Ravi : యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక సంపాదించుకున్నారు. సంథింగ్ స్పెషల్, పటాస్, ఆడాళ్ల మజాకా, ఆడాళ్లు మీకు జోహార్లు వంటి ప్రోగ్రామ్స్ ను వెయ్యికి పైగా ఎపిసోడ్‌లు చేసి అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. అటు సినిమాలతో పాటు ఇటు టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్ చేశారు.తాను 15 ఏళ్ల కెరీర్ లో ఎన్నో వెన్నుపొట్లు ఎదుర్కొన్నాననీ, చాలా మంది నన్ను తొక్కేయాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఓ లేడీ యాంకర్ ఏకంగా నాపై చేతబడి చేయించిందనీ, మనుషులు ఇంత ఘోరంగా ఉంటారంటూ బాధపడ్డారు. ఇంతకీ ఏం జరిగింది ?

బుల్లితెర స్టార్ యాంకర్ రవి తాజాగా యాంకర్ వర్ష హోస్ట్ చేస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks)షోకు గెస్ట్‌గా హాజరయ్యారు. తాను నటించిన ఓ మ్యూజిక్ ఆల్బమ్ ప్రమోషన్ కోసం ఫ్రెండ్స్‌తో కలిసి వచ్చిన రవి... షో మొత్తం తనదైన హాస్య శైలితో ఆకట్టుకున్నారు. ఇంటర్వ్యూ ప్రారంభంలోనే వర్షా ఆ మ్యూజిక్ సాంగ్ గురించి అతిగా ప్రశంసలు చేయడంతో రవి సరదాగా 'ఇంతకీ ఆ సాంగ్ చూశావా?' అంటూ స్ట్రెయిట్‌గా ప్రశ్నించాడు. దానికి వర్ష 'ఓ అరగంట బ్రేక్ ఇస్తే చూసి వస్తా'అని రిప్లై ఇవ్వగా.. అది మూడు నిమిషాల సాంగ్ మాత్రమే, దానికి అరగంట ఎందుకు?' అంటూ రవి ఫన్నీగా కౌంటర్ ఇచ్చాడు. ఈ సరదా సంభాషణతో షో నవ్వుల్లో మునిగిపోయింది.

Anchor Ravi Shocking Revelations Backstabbing Black Magic Claims and Career Struggles Go Viral

అయితే ఆ తర్వాత వర్ష రవి కెరీర్‌పై సీరియస్ ప్రశ్నలు వేయడంతో ఇంటర్వ్యూ టోన్ మారింది. 'ఒకప్పుడు టీవీలో ఎక్కడ చూసినా రవే కనిపించేవారు... ఇప్పుడు ఎందుకు తగ్గిపోయారు?' అన్న ప్రశ్నించగా.. రవి ఎమోషనల్‌గా స్పందించాడు. '15 సంవత్సరాల కెరీర్‌లో ఎన్నో ఛానెల్స్‌లో పనిచేశా, ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశా. కానీ చివరికి 'వాట్ నెక్స్ట్?' అనే ప్రశ్నే ముందుకు వస్తుంది' అంటూ తన కెరీర్‌లో ఎదురైన అప్ అండ్ డౌన్స్ గురించి వివరించాడు.

టీవీ ఆర్టిస్టులు సినిమాల్లోకి రావాలంటే ఒక ప్రత్యేక ఫార్ములా ఏర్పడిందని, ఇండస్ట్రీలో కొన్ని గోడలు కనిపించకపోయినా ఉంటాయని రవి షాకింగ్ కామెంట్స్ చేశాడు. అదే సమయంలో 'జీవితంలో వెన్నుపోటు అనుభవించారా?' అన్న ప్రశ్నకు 'మనుషులంటేనే వెన్నుపోటు'అంటూ షాకింగ్ సమాధానం ఇచ్చాడు. ఇంటర్వ్యూలో అత్యంత సంచలనంగా మారిన అంశం... క్షుద్ర పూజలపై రవి చేసిన వ్యాఖ్యలు. 'ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్. పెద్ద హీరోయిన్లు, హీరోలకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. నాపై క్షుద్ర పూజలు చేయించింది ఎవరో కాదు... నాతోపాటు యాంకరింగ్ చేసిన ఓ లేడీ యాంకర్' అని పేర్కొన్నాడు. అయితే ఆ యాంకర్ పేరు మాత్రం వెల్లడించలేదు.

ఈ విషయంపై తాను ఎలా రియాక్ట్ అయ్యానన్న ప్రశ్నకు రవి ప్రశాంతంగా స్పందించాడు. 'నేను దేవుడి దగ్గరికి వెళ్లి ఆమె చల్లగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించాను. నేను ఎవరి దృష్టిలో తప్పు చేసి ఉండొచ్చు. కానీ నా మనస్సాక్షికి నేను కరెక్ట్ అనిపిస్తే అదే నాకు సరిపోతుంది' అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

ఇక కెరీర్‌లో ఎదురైన మార్కింగ్ గురించి కూడా రవి మాట్లాడాడు. 'కొంతమంది యాంకర్లు 'అతనితో మేము ప్రోగ్రామ్స్ చేయము' అని ఓపెన్‌గా చెప్పిన సందర్భాలున్నాయి. అలాంటి పరిస్థితులు ఎదురైనా నేను అదృష్టాన్ని కాదు, హార్డ్ వర్క్‌ని నమ్ముతా. అర్హత ఉంటే అవకాశాలు వస్తాయి'అని పేర్కొన్నాడు. ఉదాహరణగా క్రికెటర్ విరాట్ కోహ్లి పేరు ప్రస్తావిస్తూ.. 'అతను మంచి బ్యాటింగ్ చేస్తాడు కాబట్టే అవకాశాలు వస్తాయి. అలాగే మన రంగంలోనూ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే అవకాశాలు వస్తూనే ఉంటాయి' అన్నాడు.

ఈ ఇంటర్య్వూ సరదాగా ప్రారంభమైన చివరికి సంచలన వ్యాఖ్యలతో ముగిసింది. ముఖ్యంగా క్షుద్ర పూజల అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆ లేడీ యాంకర్ ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం రవి వద్దే మిగిలిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X