నా జీవితంతో ఆడుకున్నారు.. స్టార్ యాంకర్ షాకింగ్ కామెంట్స్..

Anchor Ravi About Bigg Boss: తెలుగు టెలివిజన్ ప్రపంచంలో 'బిగ్ బాస్' ఒక పాపులర్ రియాలిటీ షోగా కొనసాగుతోంది. ప్రతి సీజన్‌తో కొత్త కంటెస్టెంట్లు, కొత్త గొడవలు, ఎమోషనల్ డ్రామాలు, లవ్ ట్రాక్స్, వివాదాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తోంది. ఒకవైపు ఈ షో ఎంతో మందికి గుర్తింపు తీసుకొచ్చిందని చెబుతుంటే.. మరోవైపు అదే షో తమ వ్యక్తిగత జీవితాలను దెబ్బతీసిందని ఆరోపిస్తున్నవారూ ఉన్నారు. గతంలో ప్రముఖ యాంకర్ రవి చేసిన వ్యాఖ్యలు తాజాగా మరోసారి వైరలవుతున్నాయి. బిగ్ బాస్ రియాలిటీపై పెద్ద చర్చకు తెరతీశాయి. ఇంతకీ ఏమన్నారంటే?

బుల్లితెరపై తనదైన స్టైల్‌తో స్టార్ యాంకర్‌గా ఎదిగిన రవి.. గతంలో ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. "బిగ్ బాస్ వల్ల కెరీర్ నాశనం అవుతుంది", "అక్కడ ఎవరూ నిజంగా ఉండరు", "ఒక డైరెక్టర్, పది మంది రైటర్స్ ఉంటారు" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా "బిగ్ బాస్ నా ఆట కాదు.. బయట నా కుటుంబం ఆడిన ఆట" అన్న రవి మాటలు ఆయన మానసికంగా ఎంతగా బాధపడ్డాడో చెప్పకనే చెబుతున్నాయి.

Anchor Ravi Shocking Throwback Comments on Bigg Boss and Career Damage Go Viral Again

స్టార్ యాంకర్ నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్ వరకు..
రవి తెలుగు టెలివిజన్ రంగంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న పేరు. సమ్‌థింగ్ స్పెషల్, పటాస్ వంటి షోల ద్వారా ఆయన యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. స్పాంటేనియస్ కామెడీ, ఎనర్జిటిక్ యాంకరింగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో రవి టాప్ మేల్ యాంకర్లలో ఒకరిగా ఎదిగాడు. అలాంటి సమయంలో ఆయన బిగ్ బాస్‌లోకి వెళ్లడం అప్పట్లోనే పెద్ద చర్చగా మారింది.

తాజాగా రవి చెప్పిన వివరాల ప్రకారం.. మొదటి సీజన్ నుంచే తనకు బిగ్ బాస్ ఆఫర్లు వచ్చాయట. అయితే తాను మొదట్లో ఈ షోపై ఆసక్తి చూపలేదని తెలిపాడు. "నేనెప్పుడూ బిగ్ బాస్ ఫ్యాన్ కాదు. నాలుగు సీజన్లు రిజెక్ట్ చేశాను" అని చెప్పడం గమనార్హం. అంటే.. బిగ్ బాస్‌లో పాల్గొనడం ఆయనకు మొదటి నుంచే ఇష్టం లేకపోయినా.. చివరికి పరిస్థితుల వల్ల ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా సెలబ్రిటీలు తమ నిర్ణయాల వెనుక ఉన్న ఆర్థిక కారణాలను బహిరంగంగా చెప్పడానికి ఇష్టపడరు. కానీ రవి మాత్రం ఎలాంటి దాపరికం లేకుండా "డబ్బు కోసమే బిగ్ బాస్‌కు వెళ్లాను" అని చెప్పడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.

రవి ప్రకారం.. తాను అడిగినంత పారితోషికం ఇవ్వడానికి నిర్వాహకులు అంగీకరించారట. "నాకు వచ్చిన రెమ్యునరేషన్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువే" అని చెప్పడం ద్వారా.. బిగ్ బాస్‌లో స్టార్ కంటెస్టెంట్లకు ఎంత భారీ స్థాయిలో చెల్లింపులు జరుగుతాయో పరోక్షంగా వెల్లడించాడు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. "బిగ్ బాస్ ఇచ్చిన డబ్బుతోనే ఇల్లు కొనుగోలు చేశాను" అని చెప్పడం. అంటే.. ఒకవైపు ఆ షో తనకు ఆర్థికంగా లాభం చేకూర్చినా.. మరోవైపు వ్యక్తిగతంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడిని మిగిల్చిందనే భావన ఆయన మాటల్లో కనిపిస్తోంది.

బిగ్ బాస్‌ను ఒక 'రియాలిటీ షో'గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. కానీ రవి మాత్రం ఆ రియాలిటీనే ప్రశ్నించాడు. "అక్కడ ఒక డైరెక్టర్, పది మంది రైటర్స్ ఉంటారు. వాళ్లు ఏం చేయమంటే అది చేయాల్సిందే" అని ఆయన చెప్పడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ వ్యాఖ్యల ద్వారా.. హౌస్‌లో జరిగే సంఘటనలు పూర్తిగా సహజంగా ఉండవని, కొంతవరకు కంటెంట్ కోసం డ్రామా క్రియేట్ చేస్తారని ఆయన సూచించినట్టుగా కనిపిస్తోంది. గతంలో కూడా పలువురు మాజీ కంటెస్టెంట్లు ఇలాంటి ఆరోపణలు చేసినా.. రవి లాంటి ప్రముఖ యాంకర్ నేరుగా ఇలా మాట్లాడటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఎడిటింగ్ వల్ల ఇమేజ్ దెబ్బతింటుందా?
రవి చెప్పిన మరో కీలక అంశం.. "ఒక గంట ఎపిసోడ్‌లో ఒక్క కోణం మాత్రమే చూపిస్తారు" అన్నది. నిజానికి బిగ్ బాస్‌పై ఎప్పటి నుంచో వస్తున్న ప్రధాన విమర్శ ఇదే. రోజంతా జరిగిన సంఘటనల్లో కొంత భాగాన్ని మాత్రమే ఎడిట్ చేసి చూపించడంతో.. ప్రేక్షకులకు పూర్తి నిజం తెలియదని చాలామంది అంటుంటారు. రవి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. "హౌస్‌లో ఒకలా ఉంటుంది.. బయట వేరేలా చూపిస్తారు" అని చెప్పాడు. ముఖ్యంగా లహరితో తన ఫ్రెండ్షిప్‌ను బయట ప్రేక్షకులు తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపాడు. తన భార్య గురించి ఆలోచించి మాట్లాడిన కొన్ని మాటలను కూడా ఎడిటింగ్ వల్ల వేరే కోణంలో చూపించారని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.

బిగ్ బాస్ వల్ల కొందరికి భారీ ఫేమ్ వస్తుంది. సినిమాల్లో అవకాశాలు వస్తాయి. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరుగుతుంది. కానీ అదే సమయంలో నెగెటివ్ ఇమేజ్ కూడా వెంటాడుతుంది. రవి చెప్పిన "కెరీర్ నాశనం అవుతుంది" అన్న మాట వెనుక కూడా ఇదే భావన కనిపిస్తోంది. బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలో, టీవీ షోలలో రాణిస్తున్నవారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ షో పూర్తిగా నష్టమే అని చెప్పలేం. కానీ మానసిక ఒత్తిడి, సోషల్ మీడియా ట్రోలింగ్, వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడిందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X