రేప్ ఆరోపణలపై ప్రదీప్ పోరాటం.. పిడికిలి బిగించి మద్దతు తెలిపిన యాంకర్ రవి

తనపై 139 మంది మంది గత కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారని యువతి చేసిన ఫిర్యాదు, ఆమె ఆరోపణలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. సదరు యువతి చెప్పిన పేర్లలో యాంకర్ ప్రదీప్ పేరు కూడా ఉండటం కలకలం రేపింది. ఈ మేరకు తనపై వస్తోన్న వార్తలపై యాంకర్ ప్రదీప్ స్పందించాడు. ఈ మేరకు ప్రదీప్ గత విషయాలపైనా స్పందించాడు. తనపై చేసిన ఆరోపణలు, వస్తోన్న కామెంట్లపై ఎమోషనల్ అయ్యాడు.

నిర్దారణ చేయకండి..

నిర్దారణ చేయకండి..

సదరు యువతి చేసిన ఆరోపణలు రాసే హక్కు మీడియాకు ఉంటుంది. కాది అది నిజమని నిర్దారించే హక్కు ఉండదు. కానీ కొందరు మాత్రం నిర్దారణ చేసిన రాసేస్తున్నారు. ఆమె చెప్పింది నిజమో కాదో అని తెలుసుకోకుండా నన్ను సంప్రదించకుండా ఏవేవో హెడ్డింగ్‌లు పెట్టుకుని రాసేస్తున్నారంటూ ప్రదీప్ అసహనం వ్యక్తం చేశాడు.

 నిజాన్ని బయటకు రానివ్వండి..

నిజాన్ని బయటకు రానివ్వండి..

ఆమె చేసిస ప్లేస్, ఆమె చేసిన ఆరోపణలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. వాటిలో ఎలాంటి వాస్తవం లేదు.. అవన్నీ అవాస్తవాలే. నిజాన్ని బయటకు రానివ్వండి.. మీరే నిర్దారించకండి.. అంటూ మీడియాను కోరుకున్నాడు. తనపై తప్పుడు వార్తలు రాసిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకోబోతోన్నా అని యాంకర్ ప్రదీప్ అన్నాడు.

గతంలోనూ ఇలానే..

గతంలోనూ ఇలానే..


నా మీద అనే కాదు సెలెబ్రిటీల మీద ఇలాంటి వార్తలు రాస్తుంటారు. ముఖ్యంగా నా విషయంలో ఎన్నోసార్లు ఇలాంటి ఆరోపణలు రాశారు. తీరా అవి అబద్దమని తెలిశాక ఒక్కరు కూడా తప్పుగా రాశామని అనరు. క్షమాపణలు చెప్పరు. అంటూ ప్రదీప్ ఎమోషనల్ అయ్యాడు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని, ఎవ్వరు సాయం చేయకపోయినా ఒంటరిగానైనా సరే పోరాటం చేస్తానని యాంకర్ ప్రదీప్ తెలిపాడు.

Recommended Video

Checkmate Movie Trailer | Anchor Vishnupriya చెక్ మేట్ ట్రైలర్, విష్ణుప్రియ యమ హాట్ గురూ !
పిడికిలి బిగించిన రవి..

పిడికిలి బిగించిన రవి..

ప్రదీప్ రిలీజ్ చేసిన వీడియో బాగానే వైరల్ అయింది. అందులో ప్రదీప్ ఎమోషన్ ఎందరినో కదిలించింది. ఈ క్రమంలోనే యాంకర్ రవి ప్రదీప్‌కు మద్దతు తెలిపాడు. ప్రదీప్ చెప్పినట్టుగా.. సోషల్ ట్రోలింగ్ చేయకండి అనే నినాదాన్ని ప్రమోట్ చేశాడు. నిజం బయటకు వచ్చే వరకు ఎదురుచూడండి.. నేను ప్రదీప్‌కు అండగా నిలబడతాను అంటూ పిడికిలి బిగించిన ఫోటోను షేర్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X