ఆమె నాపై చేతబడి చేయించింది.. లేడీ యాంకర్‌పై రవి షాకింగ్ కామెంట్స్!

Anchor Ravi : స్టార్ యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు బుల్లితెరపై తనదైన యాంకరింగ్ స్టైల్, టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సంథింగ్ స్పెషల్, పటాస్, ఆడాళ్ల మజాకా, ఆడాళ్లు మీకు జోహార్లు వంటి ఎన్నో సక్సెస్‌ఫుల్ ప్రోగ్రామ్‌లతో ప్రేక్షకులను అలరించిన రవి.. వెయ్యికి పైగా ఎపిసోడ్‌లు పూర్తి చేసి అరుదైన రికార్డు సృష్టించారు. టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నారు.

తన 15 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, చాలామంది తన ఎదుగుదలను అడ్డుకోవడానికి ప్రయత్నించారని రవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో పోటీతో పాటు వెన్నుపోట్లు కూడా చాలానే చూశానని అన్నారు. అంతేకాదు, తనతో కలిసి పనిచేసిన ఓడీ యాంకర్ తనపై చేతబడి చేయించిందని చెప్పి అందరినీ షాక్‌కు గురి చేశారు. మనుషులు ఇంత క్రూరంగా కూడా ఆలోచిస్తారా అని బాధపడ్డారు. ప్రస్తుతం రవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఆ లేడీ యాంకర్ ఎవరు?

Anchor Ravi Throwback Interview Shocking Claims on Lady Anchor and Career Betrayals

"15 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో వెన్నుపోట్లు"
ఇటీవల యాంకర్ వర్ష హోస్ట్ చేస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి రవి అతిథిగా హాజరయ్యారు. మొదట సరదాగా ఈ ఇంటర్వ్యూ సాగింది. అయితే.. "ఒకప్పుడు టీవీలో ఎక్కడ చూసినా రవే కనిపించేవాడు.. ఇప్పుడు ఎందుకు తగ్గిపోయారు?" అన్న ప్రశ్నకు రవి భావోద్వేగంగా స్పందించారు. "15 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఛానెల్స్‌లో పనిచేశాను. ఎన్నో షోలు చేశాను. రికార్డులు క్రియేట్ చేశాను. కానీ చివరికి 'వాట్ నెక్స్ట్?' అనే ప్రశ్నే వస్తుంది" అన్నారు. తాను ఎదుగుతున్న సమయంలో చాలామంది తొక్కేయాలని ప్రయత్నించారని, వెన్నుపోట్లు అనేవి ఇండస్ట్రీలో కామన్ అని చెప్పారు.

లేడీ యాంకర్ చేతబడి?
ఇంటర్వ్యూలో అత్యంత సంచలనంగా మారిన అంశం ఇదే. "మనుషులంటేనే వెన్నుపోటు" అని మొదలుపెట్టిన రవి, "నా ఎదుగుదల చూడలేక నా బ్యాచ్‌లో ఉన్న ఓ లేడీ యాంకర్ నాపై చేతబడి చేయించింది. రీసెంట్‌గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఓ వ్యక్తితో చేతబడి పూజలు చేయించింది" అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ లేడీ యాంకర్ పేరు మాత్రం బయటపెట్టలేదు. దీంతో సోషల్ మీడియాలో ఆమె ఎవరు? అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ విషయంపై తాను కోపం చూపలేదని రవి చెప్పారు. "నేను దేవుడి దగ్గరకు వెళ్లి ఆమె చల్లగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాను. నేను ఎవరి దృష్టిలో తప్పు చేసి ఉండొచ్చు. కానీ నా మనస్సాక్షికి నేను కరెక్ట్ అనిపిస్తే అదే చాలును" అన్నారు. ఈ స్పందన చాలామందిని ఆకట్టుకుంది.

బిగ్‌బాస్‌పై బోల్డ్ కామెంట్స్
ఇంటర్వ్యూలో బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) గురించి కూడా రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. "నాలుగు సీజన్ల నుంచి పిలిచినా వెళ్లలేదు. ఐదో సీజన్‌కు ఎక్కువ మొత్తం అడిగి తప్పించు కోవాలనుకున్నా.. వాళ్లు ఒప్పుకున్నారు. అందుకే వెళ్లాల్సి వచ్చింది" అన్నారు. అయితే ఆ షో వల్ల సంపాదించుకున్న పేరు దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. "బిగ్‌బాస్‌లో ఎవరైనా నేను నటించలేదు అంటే చెప్పుతో కొట్టాలి. కెమెరాలు ఉన్న చోట అందరూ నటిస్తారు" అని చెప్పడం వైరల్ అయింది.

కొంతమంది యాంకర్లు "అతనితో మేము షోలు చేయం" అని ఓపెన్‌గా చెప్పిన సందర్భాలున్నాయని రవి తెలిపారు. అయినప్పటికీ తాను అదృష్టాన్ని కాదు, కష్టాన్ని నమ్ముతానన్నారు. ఉదాహరణగా విరాట్ కోహ్లీ పేరును ప్రస్తావిస్తూ, "అతను బాగా బ్యాటింగ్ చేస్తాడు కాబట్టే అవకాశాలు వస్తాయి. అలాగే మన రంగంలోనూ టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయి" అన్నారు. ఇక రవి తనకు పెళ్లైన విషయాన్ని చాలా ఏళ్ల పాటు రహస్యంగా ఉంచిన సంగతి తెలిసిందే.

తరువాత సోషల్ మీడియా ద్వారా తన భార్య నిత్యా సక్సేనా, కుమార్తె వియా గురించి వెల్లడించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత వ్యక్తిగత జీవితం, కెరీర్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే? రవి చేసిన వ్యాఖ్యల్లో "లేడీ యాంకర్ చేతబడి చేయించింది" అనే కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ యాంకర్ ఎవరు? నిజంగా ఏమైంది? అన్న ప్రశ్నలు నెటిజన్లలో చర్చకు దారితీశాయి. అయితే పేరు బయటపెట్టకపోవడంతో ఈ మిస్టరీ అలాగే మిగిలిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X