రష్మీ - సుధీర్‌ను మించి.. రొమాన్స్‌తో రెచ్చిపోయిన రవి, వర్షిణి.. కారణం ఆమెనా.?

Recommended Video

Anchor Ravi - Varshini Romance Promo Goes Viral || Filmibeat Telugu

బుల్లితెరపై వచ్చే ప్రోగ్రామ్‌లలో 'పటాస్' ఒకటి. ఈ షో ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్ధస్త్‌కు పోటీ ఇచ్చేలా ఈ షో టీఆర్పీలను సాధించిన విషయం తెలిసిందే. పటాస్ ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ షో పాపులర్ అవ్వడానికి కంటెంట్‌తో పాటు యాంకర్లు రవి, శ్రీముఖి పాత్ర కూడా ఎంతో ఉంది. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ దీనికి మరింత హైప్ తీసుకొచ్చింది. అదే సమయంలో వివాదాలనూ మోసుకొచ్చింది. ఇక, ఆమె వెళ్లిపోవడంతో షో చప్పగా సాగుతుందని అనుకున్నారు. కానీ, అంతకు మించి పోయింది.

వర్షిణి ఎంట్రీ

వర్షిణి ఎంట్రీ

బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ఎంటర్ అవడం కోసం పటాస్ యాంకర్ శ్రీముఖి షో నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆమె స్థానంలో ఎవరు వస్తారు అని అంతా ఎదురు చూస్తున్న సమయంలో మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టిన వర్షిణి.. శ్రీముఖి స్థానాన్ని భర్తీ చేసింది. ఆమె అంత ఎఫెక్టివ్‌గా చేయలేకపోయినా పర్వాలేదనిపిస్తోంది. అయితే, ఉన్నట్లుండి ఈ షోలో సరికొత్త యాంగిల్ దర్శనమిచ్చింది.

చప్పగా సాగుతోందంటూ..

చప్పగా సాగుతోందంటూ..

శ్రీముఖి గైర్హాజరుతో షో చప్పగా సాగుతుందంటూ పటాస్ ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. రవి, శ్రీముఖి కెమిస్ట్రీకి తోడు వీళ్ల మధ్య వేసుకునే పంచులు.. కమెడియన్ల స్కిట్లతో పటాస్ విజయవంతంగా ప్రదర్శితమయ్యేది. ఇప్పుడు శ్రీముఖి తప్పుకోవడంతో పాటు, కమెడియన్లను కూడా కొత్త వారిని తీసుకు రావడంతో షో పట్ల జనాల్లో ఆసక్తి తగ్గిపోతుందన్న టాక్ వినిపిస్తోంది.

సరికొత్తగా ప్రయోగం

సరికొత్తగా ప్రయోగం

పటాస్‌పై ప్రేక్షకుల్లో తగ్గిపోతున్న ఆసక్తిని పెంచండం కోసమో.. లేక మరే కారణమో తెలియదు కానీ, యాంకర్లు రవి, వర్షిణి రెచ్చిపోయారు. తాజాగా విడుదలైన ప్రోమోలో ‘తెల్లా తెల్లాని చీర.. జారుతున్నాది సంధ్య వేళ' అనే పాటకు అదిరిపోయే రేంజ్‌లో పర్‌ఫార్మ్ చేశారు. ఈ పాటలో ఈ జంట చేసిన రొమాన్స్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల రష్మీ - సుధీర్ చేసిన రొమాంటిక్ డ్యాన్స్‌కు మించిపోయేలా ఈ ప్రదర్శన ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 రష్మీ - సుధీర్ రొమాంటిక్ డ్యాన్స్

రష్మీ - సుధీర్ రొమాంటిక్ డ్యాన్స్

ఢీ' షోలో ఇటీవలి ఎపిసోడ్‌లో రష్మీ - సుధీర్ తొలిసారి రొమాంటిక్‌గా డ్యాన్స్ చేశారు. ‘పరువం వానగా నేడు కురిసేనులే' అంటూ సాగే పాటలో మైమరచిపోయి ఆడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రొమాన్స్ పండించారు. దీంతో అంతా షాక్‌కు గురవుతున్నారు. ఈ డ్యాన్స్ తర్వాత యాంకర్ ప్రదీప్ ‘ఏంటీ.. ఎప్పుడూ లేని విధంగా ఇలా చేశారు' అని అనగానే రష్మీ దీనికి సమాధానం చెబుతూ.. ‘హానెస్ట్‌గా చెప్పాలంటే నేను సర్‌ప్రైజ్ అయ్యాను. సుధీర్ నుంచి నేను ఇది ఊహించలేదు. కుర్రాడు నిజంగా చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు' అని చెప్పుకొచ్చింది. దీంతో అందరూ నవ్వేశారు.

పేరు మార్చుకుని.. మొదలెట్టింది

పేరు మార్చుకుని.. మొదలెట్టింది

ఈ బ్యూటీ తొలుత హైదరాబాద్‌లో మోడలింగ్ చేసింది. అందంతో పాటు నటించే టాలెంట్ కూడా ఉండటంతో సినిమాల వైపు అడుగులు వేసింది. ‘చందమామ కథలు', ‘బెస్ట్ యాక్టర్స్'తో పాటు మరికొన్ని చిత్రాల్లో నటించింది. శామిలి సౌందరాజన్‌గా సినీ రంగానికి పరిచయం అయి ఈ బ్యూటీ.. తర్వాత వర్షిణిగా పేరు మార్చుకుంది. ఇక, ‘ఢీ' షో ద్వారా బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ‘పటాస్'లో చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X