సుమ కనకాలపై యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్.. అలా అనేశాడేంటీ?
ప్రముఖ తెలుగు టీవీ హోస్ట్ యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెరతో పాటు బుల్లితెర ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. పటాస్, ఆడాళ్ల మజాకా, ఆడాళ్లు మీకు జోహార్లు, సంథింగ్ స్పెషల్ వంటి పాపులర్ షోలతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. ఒకవైపు యాంకర్‌గా బిజీగా ఉంటూనే, మరోవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల రవి ఓ టాక్ షోలో రాపిడ్ ఫైర్ సెగ్మెంట్‌లో హోస్ట్‌ల గురించి ప్రశ్న ఎదురవ్వగా, 'సుమ కనకాల గారు లెక్కలోకే రారు' అంటూ చేసిన కామెంట్ నెటిజన్ల దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఏమైందంటే?
ఇటీవల నటి,బిగ్ బాస్ ఫేమ్ తేజస్వి మడివాడ హోస్ట్ గా వ్యవహరిస్తున్న పాపులర్ టాక్ షో 'కాకమ్మ కథలు'లో గెస్ట్ గా యాంకర్ రవి పాల్గొన్నారు. ఈ షోలో రాపిడ్ ఫైర్ సెగ్మెంట్‌లో ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తేజస్వి మడివాడ అడిగిన వరుస ప్రశ్నలకు రవి స్ట్రైట్ ఫార్వర్డ్, కొంచెం పంచ్‌లైన్ స్టైల్‌లో సమాధానాలు ఇవ్వడంతో ఆ భాగం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.

రాపిడ్ ఫైర్‌లో 'మీ ఫేవరెట్ యాంకర్ ఎవరు?' అన్న ప్రశ్నకు రవి వెంటనే సుమ కనకాల అని చెప్పాడు. ఆ తర్వాత నీ బెస్ట్ కో-యాంకర్ ఎవరు అంటే? శ్రీముఖి అని సమాధానం ఇచ్చాడు. తాను చేసిన షోలలో ఆల్‌టైమ్ ఫేవరెట్ ఏది అని అడిగితే.. ఎన్ని షోలు చేసినా 'పటాస్' షోనే తనకు బెస్ట్ అని చెప్పాడు. 'ఈ షో చేయకపోతే బాగుండేదేమో అని ఎప్పుడైనా అనిపించిందా?' అంటే సరదాగా 'లోకల్ గ్యాంగ్స్' అంటూ ఆన్సర్ ఇచ్చాడు. అదీ తేజస్వితో కలిసి చేసిన షో కావడంతో అక్కడ చిన్నపాటి ఫన్నీ మొమెంట్ చోటుచేసుకుంది.
ఇక 'యాంకరింగ్ తక్కువ, యాక్టింగ్ ఎక్కువ అనిపించే యాంకర్ ఎవరు?' అని అడిగితే రవి నేరుగా 'తేజు' అని చెప్పి హోస్ట్‌కే షాక్ ఇచ్చాడు. తేజస్వి కాస్త ఫీల్ అవ్వగా 'ఇది రాపిడ్ ఫైర్... ఆగకుండా ప్రశ్నలు అడగాలి' అంటూ రవి పంచ్ వేసి పరిస్థితిని లైట్ చేసేశాడు. సెలబ్రిటీ క్రష్‌గా 'ఇలియానా' పేరు చెప్పగా, టాలీవుడ్‌లో తన ఇన్‌స్పిరేషన్ ఎవరు అన్న ప్రశ్నకు గట్టిగా 'చిరంజీవి' అంటూ సమాధానం ఇచ్చాడు. ఇండస్ట్రీలో తనను ఎక్కువగా ఇరిటేట్ చేసిన ఫ్రెండ్‌గా 'అలీ రెజా' పేరు చెప్పి నవ్వులు పూయించాడు. కెరీర్‌లో తీసుకున్న రాంగ్ డెసిషన్ ఏమిటంటే.. అప్పుడప్పుడు కొన్ని రాంగ్ షోలు చేశాను అని నిజాయితీగా ఒప్పుకున్నాడు.
అసలు హైలైట్ మాత్రం ఈ లిస్ట్‌లో గ్రేట్ హోస్ట్ ఎవరు.. సుమ, శ్రీముఖి, ప్రదీప్, సుధీర్, తేజస్వి?' అన్న ప్రశ్న. రవి వెంటనే 'ఫస్ట్ ఈ లెక్కలోకి రారు సుమ గారు. యాంకరింగ్ అంటే నాకు ఎక్కువగా నచ్చేది ప్రదీప్ మాచిరాజు. ఆ తర్వాత శ్రీముఖి, తర్వాత సుధీర్,చివరగా తేజు' అంటూ క్లియర్‌గా ర్యాంకింగ్ చెప్పాడు.
ఇక్కడ 'సుమ గారు లెక్కలోకి రారు' అన్న మాటపై కొందరు ఆశ్చర్యపోయినా.. రవి ఉద్దేశం సింపుల్.. సుమ గారు ఎప్పుడూ టాప్‌లోనే ఉంటారు. అందుకే ఆమెను ఇతరులతో పోల్చడం కరెక్ట్ కాదనే భావనతో అలా చెప్పినట్లు అభిమానులు అర్థం చేసుకుంటున్నారు.ఈ కామెంట్స్‌తో కలిసి షోకే హైలైట్‌గా నిలిచాయి. ఇదే సెగ్మెంట్ ఇప్పుడు క్లిప్స్ రూపంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, యాంకర్ రవి పేరు మరోసారి చర్చల్లో నిలిపింది.


Click it and Unblock the Notifications











