ఇన్ ఫ్లూయేన్స్ అంటూనే రవిని బోల్తా కొట్టిస్తున్న షన్ను.. ఎవడిని అన్న అనాల్సిన అవసరం లేదు!

బిగ్ బాస్ హౌస్ లో ఏ విధంగా ఆలోచించినా కూడా ఎప్పుడు అది పాజిటివ్ అవుతుందో ఎప్పుడు నెగిటివ్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. పరిస్థితులను బట్టి వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. పాజిటివ్ గా వెళ్లినా కూడా పరిస్థితులు కొన్నిసార్లు విలన్ ను చేస్తాయి. కొన్నిసార్లు చెడుగా ఆలోచించిన కూడా హీరోని చేస్తాయి. అయితే ప్రస్తుతం యాంకర్ రవి తో పాటు షణ్ముఖ్ జస్వంత్ కూడా అలాంటి అనుభవాలనే ఎదుర్కొంటున్నారు. అమాయకంగా కనిపిస్తూనే ఒకరికొకరు గేమ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు అనిపిస్తోంది. ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్ అయితే ఇన్ ఫ్లూయేన్స్ అనే పదంతో ప్రతిసారి రవిని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా నామినేషన్స్ లో కూడా అదే తరహాలో కామెంట్ చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

Photo Courtesy: Star మా and Disney+Hotstar

గుంటనక్క అతనే

గుంటనక్క అతనే

అసలే ఒకవైపు నటరాజ్ మాస్టారు కాస్త ఓవర్ యాక్షన్ తో యాంకర్ రవి ని గుంటనక్కను చేసిన విషయం తెలిసిందే. నేను అనలేదు అంటూనే రవిని డైరెక్ట్ గా గుంటనక్కగా హైలెట్ చేస్తున్నాడు. డైరెక్ట్ గా ఆ విషయం పై క్లారిటీ తెచ్చుకునేందుకు రవి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కడం లేదు. సాధారణంగా ఇంట్లో బలమైన కంటెస్టెంట్స్ పైనే ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక హౌస్ లో ప్రస్తుతం యాంకర్ రవి చాలా బలమైన పోటీ అని అందరికీ తెలిసిన విషయమే.

తెలియకుండా ఇన్ ఫ్లూయెన్స్

తెలియకుండా ఇన్ ఫ్లూయెన్స్

అందరిని నామినేషన్స్ సమయంలో రవి తన తెలివితో ఆటను మార్చేస్తున్నాడు అని ఇప్పటికే నట్రాజ్ మాస్టర్ అనేక రకాలుగా కామెంట్స్ చేశాడు. ఇక ఇప్పుడు షణ్ముఖ్ జస్వంత్ కూడా తెలియకుండా నేను నీకు ఇన్ ఫ్లూయేన్స్ అవుతున్నాను అంటూ గట్టిగా నిందలు వేస్తున్నాడు. ఒక విధంగా ఇది షణ్ముఖ్ గేమ్ స్ట్రాటజీ అని కూడా చెప్పవచ్చు. వీరిద్దరి మధ్య ఎక్కువగా సంభాషణ లేకపోయినప్పటికీ షన్ను పదేపదే ఇన్ ఫ్లూయేన్స్ అనే ఆయుధాన్ని వాడుతున్నాడు.

 తేడా వస్తే.. అంతే

తేడా వస్తే.. అంతే

ఇన్ ఫ్లూయేన్స్ అనే పదాన్ని షణ్ముఖ్ జస్వంత్ చాలా సున్నితంగా రవిపై ప్రభావం చూపేలా చేయించాలని అనుకుంటున్నాడు. అయితే ఏమాత్రం తేడా వచ్చినా కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అని సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. కానీ మరొక షాకింగ్ విషయం ఏమిటంటే షణ్ముక్ తన తెలివితో ఇతరులను ఇన్ ఫ్లూయేన్స్ చేస్తున్నాడు.

Recommended Video

#BiggBosstelugu5 : హౌస్ లో ఇంట్రెస్టింగ్ టాస్క్.. Sriram,Hamida అదుర్స్ || Filmibeat Telugu
ఎవడిని అన్న అనాల్సిన అవసరం లేదు

ఎవడిని అన్న అనాల్సిన అవసరం లేదు

రీసెంట్ గా క్యాప్టెన్ జెస్సీ జస్వంత్ ఈ విషయంలో అనేక రకాలుగా ముందుండి తనే నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాడు. అసలు హౌస్ లో కెప్టెన్ జెస్సినా లేక షన్నునా? అంటూ చాలామంది కామెంట్స్ కూడా చేశారు ఇక రీసెంట్ గా ఒక టాస్క్ లో సన్నీ బిగ్ బాస్ నుంచి చీవాట్లు తిన్న విషయం తెలిసిందే. ఆ ప్రభావం అతన్ని మళ్ళీ కెప్టెన్ అవ్వకుండా చేసింది. బాధ పడుతున్న సమయంలో షన్ను తన మాటలతో బాగానే ఇన్ ఫ్లూయేన్స్ చేశాడు. హౌస్లో కెప్టెన్ అన్నప్పుడు చాలా బలంగా ఉండాలి అని ఎవరిని అన్నా అనల్సిన అవసరం లేదని కూడా చెప్పాడు. అతను యాంకర్ రవి ని ఉద్దేశించి మాట్లాడినట్లు అర్థమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X