యాంకర్ రవికి భారీ షాకిచ్చిన భార్య: రోజూ మూడు తర్వాతే.. మొబైల్‌లో అలా అంటూ సీక్రెట్ లీక్ చేసింది

టెలివిజన్ రంగంలో యాంకర్ అంటే అమ్మాయిల హవానే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఏ భాషలోనైనా ఇలాగే ఉంటుంది. తెలుగులోనూ ఎంతో మంది ఫీమేల్ యాంకర్లు తమ సత్తాను చూపిస్తున్నారు. ఒకరిద్దరు మాత్రమే మగ హోస్టులు చాలా కాలంగా నెగ్గుకొస్తున్నారు. అలాంటి వారిలో యాంకర్ రవి ఒకడు. చాలా కాలంగా ఈ రంగంలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతోన్న అతడు.. వరుస ఆఫర్లతో అదరగొడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఓ షోలో రవికి అతడి భార్య భారీ షాకిచ్చింది. పర్సనల్ మేటర్ లీక్ చేసి పరువు తీసింది. ఆ వివరాలు మీకోసం!

అలా మొదలైన ప్రస్థానం.. వరుస ఆఫర్లతో

అలా మొదలైన ప్రస్థానం.. వరుస ఆఫర్లతో

అప్పుడెప్పుడో బుల్లితెరపైకి యాంకర్ అడుగు పెట్టాడు రవి. కెరీర్ ఆరంభంలోనే తన హోస్టింగ్‌తో ఆకట్టుకున్న అతడు.. వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకొచ్చాడు. అదే సమయంలో ఎంతో మంది అభిమానాన్ని సైతం అందుకున్నాడు. సుదీర్ఘమైన కెరీర్‌లో టీవీ షోలు, సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు చేస్తూ హల్‌చల్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే లేడీ యాంకర్లకు సైతం పోటీని ఇస్తున్నాడు.

ఆ షో ఒక్కటే ప్రత్యేకం.. ఆమెతో కలిసి రచ్చ

ఆ షో ఒక్కటే ప్రత్యేకం.. ఆమెతో కలిసి రచ్చ

సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో షోలను హోస్ట్ చేశాడు యాంకర్ రవి. అయితే, అందులో ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయిన 'పటాస్' మాత్రం అతడికి మంచి పేరును తెచ్చి పెట్టింది. ఇందులో హాట్ యాంకర్ శ్రీముఖితో కలిసి అతడు చేసిన రచ్చకు ఎంతో మంది ఫిదా అయిపోయారు. అదే సమయంలో కొన్ని విమర్శలూ వచ్చాయి. చాలా కాలం తర్వాత ఈ షో నుంచి తప్పుకున్నాడతను.

ఎప్పుడూ వివాదాలే... విమర్శలతో వార్తల్లో

ఎప్పుడూ వివాదాలే... విమర్శలతో వార్తల్లో

యాంకర్‌గా తన ప్రయాణంలో ఎన్నో గొప్ప మైలురాళ్లను అందుకున్న రవి.. ఎన్నో వివాదాల్లోనూ చిక్కుకున్నాడు. మరీ ముఖ్యంగా ఓ సినిమా ఫంక్షన్‌లో ఆడవాళ్లపై చేసిన కామెంట్స్ పెద్ద రాద్దాంతం అయ్యాయి. ఆ తర్వాత అతడు పలుమార్లు క్షమాపణలు చెప్పినా.. చాలా రోజులు రవిపై మహిళా సంఘాలు గొడవలు చేసిన విషయం తెలిసిందే. అలా పలుమార్లు విమర్శలపాలయ్యాడు.

హీరోగానూ మారాడు.. కేసుల వరకూ వెళ్లి

హీరోగానూ మారాడు.. కేసుల వరకూ వెళ్లి

కొన్నేళ్ల క్రితం యాంకర్ రవి 'ఇది మా ప్రేమకథ' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. దీనికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ సందీప్ తనను రూ. 41 లక్షలు ఇవ్వకుండా మోసం చేశాడని ఫిర్యాదు చేశాడని రవి అతడిపై కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు పెట్టాడు. ఆ తర్వాత అతడు కూడా యాంకర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇది పెద్ద సంచలన అయింది.

యాంకర్ రవికి భారీ షాకిచ్చిన భార్య నిత్య

యాంకర్ రవికి భారీ షాకిచ్చిన భార్య నిత్య

యాంకర్ రవి.. తన చిన్ననాటి స్నేహితురాలైన నిత్యను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడూ ఆమెను సైతం స్పెషల్ ఈవెంట్లు, కొన్ని షోలలోకి తీసుకొస్తుంటాడు. ఇందులో భాగంగానే జీ తెలుగులో ప్రసారం అవుతోన్న 'బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్' షోలోకి ఎంట్రీ ఇచ్చిందామె. ఈ సందర్భంగా యాంకర్ సుమతో కలిసి తన భర్త రవికి భారీ షాక్‌లు ఇచ్చింది.

రోజూ మూడు తర్వాతే.. అదే కారణం చెప్పి

రోజూ మూడు తర్వాతే.. అదే కారణం చెప్పి

'బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్' షోలో భాగంగా ఇంద్రనీల్, రోహిత్ దంపతులు గెస్టులుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సమయంలో యాంకర్ రవి.. భార్యలను ఓ ఆట ఆడుకోవాలని వాళ్లకు సూచించాడు. సరిగ్గా అప్పుడే రవి భార్య నిత్య ఎంట్రీ ఇచ్చింది. అప్పుడామె మాట్లాడుతూ.. 'ప్రతి రోజూ తెల్లవారుజామున 3 గంటలకు వస్తాడు. షూటింగ్‌లో ఉన్నానని చెబుతాడు' అంటూ కామెంట్స్ చేసింది.

Recommended Video

Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
మొబైల్‌లో అలా అంటూ సీక్రెట్ లీక్ చేసింది

మొబైల్‌లో అలా అంటూ సీక్రెట్ లీక్ చేసింది

ఈ సందర్భంలోనే యాంకర్ సుమ.. 'నీ పేరు తన ఫోన్‌లో ఏమని సేవ్ చేసుకున్నాడు' అని నిత్యను ప్రశ్నించింది. దీనికి 'నిజంగా నాకు తెలియదు అక్కా. ఆ మొబైల్ పాస్‌వర్డ్ కూడా నాకు తెలీదు. అది చూసే సాహసం కూడా చేయను' అంటూ అతడి పరువు తీసేసింది. ఓ సందర్భంలో నా భార్య నా కాళ్లు కడుగుతుందని రవి చెప్పగా.. 'నేనైతే చేయలేదు. ఎక్కడైనా చేశారేమో' అని షాకిచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X