సావిత్రి కన్ఫార్మ్ చేసేసింది.. ‘బిగ్ బాస్’ హౌస్‌లో..

Recommended Video

Bigg Boss Telugu 3 : Teenmar Anchor Savitri Confirms Her Bigg Boss Entry || Filmibeat Telugu

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 'బిగ్ బాస్' షో వివాదం కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు వివాదం.. మరోవైపు ప్రారంభ తేదీ దగ్గరకు వస్తుండడంతో ఈ షో రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు ఈ షోలో కంటెస్టెంట్లుగా ఎవరు పాల్గొనబోతున్నారు..? అనేది సస్పెన్స్‌గా మారింది. అటు స్టార్ మా యాజమాన్యం.. ఇటు కంటెస్టెంట్లు కూడా దీన్ని సీక్రెట్‌గా ఉంచుతున్నారు. అయితే, తాజాగా ఓ ప్రముఖ యాంకర్ 'బిగ్ బాస్'లోకి తన ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసింది.

‘తీన్మార్' సావిత్రి వస్తుందంటూ

‘తీన్మార్' సావిత్రి వస్తుందంటూ

ప్రముఖ న్యూస్ చానెల్‌లో ప్రసారమయ్యే ‘తీన్మార్' ఎంతటి ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి ఆ ప్రోగ్రాం కోసం పని చేసే బిత్తిరి సత్తి ఒక కారణం అయితే, మరో కారణం సావిత్రి అలియాస్ శివజ్యోతి. అయితే, ఆమె కొద్దిరోజులుగా ఆ షోలో కనిపించడం లేదు. దీంతో సావిత్రి ఈ రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇవ్వబోతుందంటూ ప్రచారం జరుగుతోంది.

బిత్తిరి సత్తి వ్యాఖ్యలతో..

బిత్తిరి సత్తి వ్యాఖ్యలతో..

సావిత్రితో పాటు తీన్మార్‌లో పని చేసే బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. సావిత్రి ప్రోగ్రాం నుంచి తప్పుకుందన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ‘‘ఇది నాకు షాకింగ్ న్యూస్. కానీ, ఏదో ఒక రోజు జరిగేదే. ఆమె ఎక్కడ ఉన్నా.. ఏం చేసినా అంతా మంచే జరగాలని మేమంతా కోరుకుంటాం. ఆమె ప్రయత్నాలు ఫలించి భవిష్యత్ మంచిగా ఉండాలి'' అంటూ బిత్తిరి సత్తి ఓ న్యూస్ చానల్‌తో చెప్పుకొచ్చాడు. దీంతో హౌస్‌లోకి ఆమె ఎంట్రీ కన్ఫార్మ్ అని అంతా అనుకున్నారు.

తాజాగా క్లారిటీ ఇచ్చేసింది

తాజాగా క్లారిటీ ఇచ్చేసింది

‘బిగ్ బాస్' ఎంట్రీపై సావిత్రి తాజాగా స్పందించింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో తాను న్యూస్ చానెల్‌ నుంచి తప్పుకోవడానికి గల కారణాలను వెల్లడించడంతో పాటు, ‘బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చేసింది. మొత్తంగా తాను రియాలిటీ షోకు వెళ్తున్నానని వెల్లడించింది.

పోస్ట్ డిలీట్

పోస్ట్ డిలీట్

స్టార్ మా యాజమాన్యం నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయేమో.. సావిత్రి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోను డిలీట్ చేసేసింది. అయితే, అప్పటికే కొందరు దీన్ని చూసేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో సావిత్రి ‘బిగ్ బాస్'లోకి వెళ్తున్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘బిగ్ బాస్' - వివాదాలు

‘బిగ్ బాస్' - వివాదాలు

తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ వ్యయంతో వచ్చిన ‘బిగ్ బాస్' షోపై వచ్చిన వివాదంతో చాలా మంది దీన్ని నిషేదించాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో కొందరు హైకోర్టులో పిల్ సైతం వేశారు. ‘బిగ్ బాస్' సీజన్ - 3 ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది. గత రెండు సీజన్లను జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేయగా, ఈ సారి మాత్రం అక్కినేని నాగార్జున ఆ బాధ్యతలను తీసుకున్నారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్‌లతో ఈ షో ప్రారంభం కానుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X