భర్త బండారం బయటపెట్టిన యాంకర్ సావిత్రి.. ఆధారాలతో సహా చూపిస్తూ వీడియో లీక్!
తీన్మార్ వార్తలు ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు యాంకర్ సావిత్రి అలియాస్ శివ జ్యోతి. ప్రస్తుతం ఈమె యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. తీన్మార్ వార్తలు ద్వారా తెలంగాణ యాసలో గలగల మాట్లాడేస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.
ఇలా బిగ్ బాస్ తర్వాత మరింత క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి శివ జ్యోతి ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలు, ఇంస్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పాల్గొని సందడి చేస్తున్నారు. ఇలా తన భర్తతో పాటు తమకు సంబంధించిన అన్ని విషయాలను కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే తాజాగా శివ జ్యోతి తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక రీల్ వీడియోని షేర్ చేశారు.. ఇందులో భాగంగా తాను నైట్ ఫేస్ కి ఉపయోగించే కొన్ని క్రీమ్స్ బుక్ చేయడంతో అవి రాగా వాటిని ఓపెన్ చేస్తూ ఉంటారు అయితే వాటి ఖరీదు 2000 అలా ఉండడంతో తన భర్త గంగూలి నైట్ రొటీన్ కోసం ఇలా వేళల్లో ఖర్చు చేయడం అవసరమా అంటూ మాట్లాడారు.
ఇలా మాట్లాడటంతో ఒక్కసారిగా సావిత్రి మరి మీ నైట్ రొటీన్ చూపించిన అంటూ పక్కనే ఉన్నటువంటి కాబోర్డ్ ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి మందు బాటిల్ మొత్తం చూపిస్తూ వాటి ధరను చెప్పేశారు. అయితే ఒక్కో మందు బాటిల్ ధర వేళల్లో ఉండటం గమనార్హం. ఇలా సావిత్రి ఒక్కో బాటిల్ ధర చెప్పడంతో ఇలాంటి క్రీమ్స్ మరో రెండు ఆర్డర్ చేసుకో ఏం పర్వాలేదు అంటూ తన భర్త చెప్పటం అందరిని ఆకట్టుకుంది.
ఇక అందులో ఒక చిన్న బాటిల్ ఏకంగా ఎనిమిది వేల రూపాయల ధర ఉండటంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసినటువంటి అభిమానులు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మీరు మగ జాతి ఆణిముత్యం అంటూ కొందరు కామెంట్లు చేయగా ఏది ఏమైనా మీరు చాలా కాస్ట్లీ బ్రో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇవన్నీ తీయించింది మీరే కదా అక్క అంటూ మరికొందరు కూడా ఈ ఫన్నీ వీడియో పై ఫన్నీగా కామెంట్లు చేస్తూ ఉన్నారు.


Click it and Unblock the Notifications











