ఆ వ్యసనం నుంచి బయటపడ్డా.. మా పిల్లలు కూడా... బ్యాన్ మూడ్‌లో శిల్పా చక్రవర్తి

ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒక్కరి రోజువారీ జీవితం కరోనాదెబ్బకు తలకిందులయ్యాయి. చైనాలో పుట్టిన మహమ్మారిపై పలు దేశాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఎంతో మంది జీవితాలు కూలే పరిస్థితి నెలకొన్నది. ఇలాంటి తీవ్ర పరిణామాలకు కారణమైన కొవిడ్19 వైరస్ గురించి వెలువడుతున్న భయాందోళనతో యాంకర్ శిల్పా చక్రవరి అనూహ్యమైన నిర్ణయం తీసుకొన్నారు. ప్రతీ ఒక్కరి జీవితానికి వ్యసనంగా మారుతున్న అలవాటు నుంచి బయటపడ్డానని ఆమె తెలిపారు. ఇంతకు ఆమె ఎలాంటి వ్యసనం నుంచి బయటపడ్డారంటే..

కరోనావైరస్ సమయంలో

కరోనావైరస్ సమయంలో

దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనావైరస్ గురించి చదువుతుంటే ప్రాణం పోయేలా ఉంది. ఇందుకు కారణమైన చైనాపై నాకు విపరీతమైన కోపం వస్తున్నది. ఆ దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులపై నా వంతుగా నిషేధం ప్రకటించాను. ప్రతీ ఒక్కరు కూడా అలాంటి వస్తువులను వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని శిల్పా చక్రవర్తి సూచించారు.

చైనా ఉత్పత్తులకు దూరం

చైనా ఉత్పత్తులకు దూరం

చైనాలో తయారయ్యే మొబైల్ యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ దేశం తయారు చేసే యాప్స్‌ను వాడకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజల జీవితాలకు ముప్పుగా మారిన ప్రమాదకరంగా యాప్స్‌కు దూరంగా ఉండండి. నేను ఇప్పటికే చైనాకు చెందిన యాప్స్‌ను వాడటం మానేసాను అని శిల్ప చక్రవర్తి చెప్పారు.

టిక్ టాక్ యాప్‌ను నిషేధించాం.

టిక్ టాక్ యాప్‌ను నిషేధించాం.

నేను, నా పిల్లలు చైనాకు సంబంధించిన టిక్‌టాక్ ఇతర యాప్స్‌ను విపరీతంగా వాడేవాళ్లం. వాటికి ఇప్పుడు స్వస్తి చెప్పాం. ఇంట్లో చైనా వస్తువులు, మొబైల్‌లో యాప్స్‌ను నిషేధించాలని నిర్ణయం తీసుకొన్నాం. చైనాలో పుట్టిన వైరస్‌ గురించి తెలుసుకోవడానికి ఆ దేశం నుంచి టెస్టింగ్ కిట్స్ తెచ్చుకోవడం చాలా దారుణం అని శిల్పా చక్రవర్తి పేర్కొన్నారు.

చాలా మందికి వ్యసనంగా

చాలా మందికి వ్యసనంగా

ఇటీవల కాలంలో టిక్ టాక్ యాప్ చాలా ప్రజాదరణ పొందింది. మాతోపాటు చాలా మంది దానికి వ్యసనంగా మారారు. ఎప్పుడూ టిక్‌టాక్‌ వీడియోలతో కాలం గడుపుతున్నారు. టిక్ టాక్ చేయడం ఓ పిచ్చిగా మారింది. ఇలాంటి సమయంలో అలాంటి వ్యసనం నుంచి నేను, మా పిల్లలు బయటపడటం చాలా సంతోషంగా ఉంది అని శిల్పా చక్రవర్తి అన్నారు.

Recommended Video

MMOF Telugu Movie Trailer || J D Chakravarthy || Akshatha || Manoj Nandan || Akshitha || Benerjee
చైనా యాప్స్‌కు దూరంగా

చైనా యాప్స్‌కు దూరంగా

ప్రస్తుత పరిస్థితుల్లో టిక్‌టాక్ లాంటి యాప్స్‌కు దూరంగా ఉండాలని మా కుటుంబ నిర్ణయించింది. చైనా భయాందోళనలు మమల్ని వెంటాడుతున్నాయి. హైదరాబాద్‌లోని మా ఇంటికి సమీపంలో ఓ పాజిటివ్ కేసు బయటకు రావడంతో భయంతో వణికిపోయాం. జీవితం విలువ బాగా తెలిసి వచ్చింది. కాబట్టి దేశ ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా కారణమైన చైనాను, ఆ దేశ వస్తువులను బహిష్కరించాలి అని శిల్పా చక్రవర్తి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X