శివజ్యోతి లింక్స్ అంటూ టెలిగ్రామ్‌లో రచ్చ.. డబ్బులు పంపగానే షాక్.. క్లారిటీ ఇచ్చిన తీన్‌మార్ సావిత్రి!
యాంకర్ శివ జ్యోతి అనే పేరుతో కంటే కూడా తీన్మార్ సావిత్రి పేరుతో బాగా గుర్తింపు అందుకున్న శివ జ్యోతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట మీడియా న్యూస్ ఛానల్స్ లో వర్క్ చేసిన ఆమె ఆ తర్వాత బిగ్బ్బడ్ షో ద్వారా కూడా మంచి గుర్తింపు అందుకుంది. ఇక స్పెషల్ సాంగ్స్ అలాగే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కూడా బాగా పాపులర్ అయింది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలతో కూడా ఆమె హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటారు. అయితే శివ జ్యోతి ఇటీవల టెలిగ్రామ్ లో తన పేరు మీద వస్తున్న లింక్స్ తో వచ్చే మోసాల గురించి క్లారిటీ ఇవ్వడం వైరల్ గా మారింది. ఆ వివరాలలోకి వెళితే..

అసలు పేరుపై అప్పుడే క్లారిటీ
తీన్ మార్ వార్తలు ఎంతగా పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అందులో బిత్తిరి సత్తితో పాటు సావిత్రి పేరు కూడా బాగా వైరల్ అయింది. మొదట అందరూ కూడా ఆమె పేరు నిజంగానే సావిత్రి అనుకున్నారు. కానీ ఆమె అసలు పేరు శివజ్యోతి అని బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాతనే అందరికీ తెలిసింది. బుల్లితెరపై ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా అందుకుంది.

మద్దతు బాగానే అందుకుంది..
బిగ్ బాస్ మూడవ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొన్న శివ జ్యోతి బాగానే క్రేజ్ అందుకున్నప్పటికీ మాత్రం చివరి వరకు నిలవలేకపోయింది. కానీ ఉన్నన్ని రోజులు మాత్రం ఆమె ఓ వర్గం ప్రేక్షకుల నుంచి మద్దతు బాగానే అందుకుంది. ఓట్లు కూడా బాగానే వచ్చాయి. ఇక ఆ తర్వాత ఆమె టెలివిజన్ ప్రపంచంలో మరింత బిజీగా మారిపోయింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో మంచి ఫాలోవర్స్ ను కూడా పెంచుకుంది.

ఎవరైనా మోసం చేస్తే..
ఇక శివ జ్యోతి తన భర్తకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఆమె అప్పుడప్పుడు తనపై వచ్చే కొన్ని రూమర్స్ పై అలాగే అబద్దపు వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. తన పేరుతో ఎవరైనా మోసం చేస్తే కూడా ఆమె వెంటనే అందరిని అలెర్ట్ అయ్యేలా చేస్తుంది. వీలైనంతవరకు ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా సింపుల్ గా స్పందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

శివజ్యోతి పేరుతో లింక్స్ వైరల్
అయితే ఇటీవల శివ జ్యోతి పేరుతో టెలిగ్రామ్ లో మాత్రం ఊహించని విధంగా కొన్ని లింక్స్ వైరల్ అయ్యాయి. టెలిగ్రామ్ ఛానల్స్ లో అత్యధిక స్థాయిలో చాలామంది మోసపోతున్నారు. ముఖ్యంగా అడల్ట్ కంటెంట్ కూడా అక్కడే ఎక్కువ అయింది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే శివజ్యోతి పేరుతో కూడా కొన్ని లింక్స్ ఇటీవల కాలంలో వైరల్ అయ్యాయట.

టెలిగ్రామ్ లో అలా మోసం
శివ జ్యోతిని ఎంతగానో అభిమానించే ఒక వ్యక్తి నిజంగా ఆమెనే మెసేజ్ చేస్తుంది అనుకుని మోసపోయాడు. శివజ్యోతి యూట్యూబ్ ఛానల్ ద్వారా రివార్డ్స్ పాయింట్స్ వచ్చాయని ఒక టెలిగ్రామ్ ద్వారా లింకు వచ్చిందట. దీంతో అతడు అది నిజమనుకొని 6 వేల రూపాయల వరకు కట్టాడు. ఇక చివరికి అతను మోసపోయినట్లుగా తెలుసుకున్నాడు. ఇక వెంటనే శివజ్యోతికి ఈ విషయం తెలిసేలా మెస్సేజ్ పంపాడు.

స్పందించిన శివజ్యోతి
ఇక వెంటనే ఆ విషయం గురించి తన ఇన్ స్టాగ్రామ్ లో శివజ్యోతి స్పందించే ప్రయత్నం చేసింది. యువకుడు పంపిన మెసేజ్ స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ ఇలాంటి మోసాలకు ఎవరు గురికావద్దు అని అసలు తనకు ఎలాంటి టెలిగ్రామ్ ఛానల్ కూడా లేదు అని ఆమె తెలియజేశారు. ఇలాంటి వాటికి అందరూ కూడా చాలా దూరంగా ఉండాలి అంటూ.. మరోసారి తన పేరు మీద ఎలాంటి లింక్స్ వచ్చినా కూడా వాటిని బ్లాక్ చేయాలని తెలియజేశారు.


Click it and Unblock the Notifications











