Sekhar Master: శేఖర్ మాస్టర్‌కు హీరోయిన్‌తో ఎఫైర్.. లీక్ చేసిన యాంకర్?

కొరియోగ్రాఫర్ కం డ్యాన్సర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కింది నుంచి పైకి వచ్చిన వాళ్లలో శేఖర్ మాస్టర్ ఒకరు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫి చేస్తూ పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే ఆయన ఢీ షోలో న్యాయ నిర్ణేతగా ఉంటారనే విషయం తెలిసిందే. అయితే అందులోని యాంకర్... శేఖర్ మాస్టర్ గురించి నోరు జారాడు. ఓహీరోయిన్ తో ఎఫైర్ ఉందంటూ స్టేజీ మీదే లీక్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బుల్లితెరపై డ్యాన్స్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకునే టీవీ షోల్లో 'ఢీ' షో ఒకటి. ప్రతి వారం ఈ షో బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ ఇస్తూ వస్తుంది. ఇక ఈ షోకు ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే. ఇక ఈ షో నుంచి ఎంతో మంది డాన్సర్స్.. ఇండస్ట్రీలో సెటిల్ అయిన వారు ఉన్నారు. వారిలో ఒకరు శేఖర్ మాస్టర్. ప్రస్తుతం ఈ షోకు ఆయనే న్యాయ నిర్ణేతగా వ్యవహారిస్తున్నారు. అయితే ఇదిలా ఉంటే ఈ షో ప్రోమో ఒకటి రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది.

Anchor Shiva Leak Sekhar Master Affair With Heroine in Dhee Show Full Details Here

ఇక ఆ ప్రోమో విషయానికి వస్తే.. సెలబ్రిటీ డ్యాన్స్ షోగా తెలుస్తోంది. ఈ ప్రోమోలో నందు యాంకర్ గా వ్యవహారిస్తున్నాడు. ఇక ఈ షోలో పలువురు సెలబ్రెటీలు డ్యాన్స్ పెర్మామెన్స్ ఇచ్చారు. ఇక వారికి శేఖర్ మాస్టర్ తనదైన శైలిలో వారి డ్యాన్స్ ఫెర్మామెన్స్ పై కామెంట్స్ చేశారు. ఇక ఈ షోలో హైపర్ ఆది కామెడీ పండించాడు. శేఖర్ మాస్టర్ తో పాటు.. అందాల భామ ప్రణిత కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహారించింది.

ఇక హ్యాపీగా సాగుతున్న ఈ ప్రోమోలో యాంకర్ శివ చేసిన కామెంట్స్ తో హీటెక్కింది. యాంకర్ శివ గురించి సోషల్ మీడియా వాడే వారికి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ... సెలబ్రెటీల ఇంటర్వ్యూలతో ఫేమస్ అయిపోయాడు. మొన్నటి బిగ్ బాస్ సీజన్ సెలబ్రెటీల ఇంటర్వ్యూలతో మరింత పాపులర్ అయ్యాడు. ఇక ఈ యాంకర్ శివ ఢీ షోలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Anchor Shiva Leak Sekhar Master Affair With Heroine in Dhee Show Full Details Here

అయితే ప్రోమోలో శేఖర్ మాస్టర్ ను ఒకటి అడగాలి అంటూ.. నోరు జారాడు. మీకు ఓ హీరోయిన్ కు ఎఫైర్ ఉందని బయట రూమర్స్ నడుస్తున్నాయని యాంకర్ శివ అడుగుతాడు. దీంతో శేఖర్ మాస్టర్ సిరీయస్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావ్... నాకు ఓ ఫ్యామిలీ ఉంది. పిల్లలు ఉన్నారు అంటూ ఫుల్ ఫైర్ అవుతాడు. ఎవడ్రా వీడిని తీసుకువచ్చిందని మండిపడుతాడు శేఖర్ మాస్టర్.

వాడిని పంపిస్తారా లేదా నన్ను వెళ్లిపోమ్మంటారా అంటూ శేఖర్ మాస్టర్ ఫైర్ అవుతాడు. ఇక యాంకర్ శివ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా... శేఖర్ మాస్టర్ వినకుండా షో నుంచి బయటకు వెళ్లిపోతాడు. దీంతో సెట్లోని వారంతా షాక్ అవుతారు. పక్కనే ఉన్న ప్రణతి కూడా షాక్ లో ఉండిపోతుంది. ఇక ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే.. డిసెంబర్ 27న ప్రసారం అయ్యే ఎపిసోడ్ ను చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X