For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జబర్ధస్త్‌‌లో సంచలన ఘటన: అనసూయను డ్రెస్‌లపై ప్రశ్నించిన గెస్ట్.. బాధతో ఆ మాటలంటూ వెళ్లిపోయిన యాంకర్

  |

  తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే షోలు ఎన్ని ఉన్నా.. వాటిలో చాలా తక్కువ మాత్రమే ప్రేక్షకుల నుంచి ఆదరణను సొంతం చేసుకుంటాయి. అందులో నెంబర్ వన్ కామెడీ షో జబర్ధస్త్ ఒకటి. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఎనిమిదేళ్లుగా బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోందీ షో. అదే సమయంలో ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అందుకే ఇది విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. ఇలాంటి బడా షోలో తాజాగా గెస్టుగా వచ్చిన ఓ వ్యక్తి అనసూయకు షాకిచ్చాడు. దీంతో సంచలన సంఘటన జరిగింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

  సుదీర్ఘ ప్రయాణం.. తిరుగులేని ప్రస్థానం

  సుదీర్ఘ ప్రయాణం.. తిరుగులేని ప్రస్థానం

  చాలా కాలంగా జబర్ధస్త్ బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను, వివాదాలను చూసిన ఈ షో.. దేనికీ తలొగ్గకుండా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో కొన్ని వందల మంది టాలెంట్లను ప్రపంచానికి పరిచయం చేస్తూ సత్తా చాటుతోంది.

   అనసూయ ఎదుగుదలకు కారణం ఇదే

  అనసూయ ఎదుగుదలకు కారణం ఇదే

  జబర్ధస్త్ ద్వారా ఎంతో మంది తమ టాలెంట్లను నిరూపించుకుని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. వారిలో చాలా తక్కువ మంది బిగ్ సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారు. అలాంటి వారిలో యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒకరు. ఈ ఒక్క షో వల్లే ఆమె ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుంది. తద్వారా వరుస ఆఫర్లను దక్కించుకుంటూ చాలా ఏళ్లుగా టీవీ, సినిమాల్లో హవాను చూపిస్తోంది.

   జబర్ధస్త్‌లో గ్లామర్ షో... యాంకర్ ఇలా

  జబర్ధస్త్‌లో గ్లామర్ షో... యాంకర్ ఇలా

  అనసూయ భరద్వాజ్ ఫేమస్ అవడానికి ఆమె టాలెంట్‌తో పాటు గ్లామర్ కూడా ప్రధాన కారణం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఈ బ్యూటీ తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది. చిన్న చిన్న బట్టలు వేసుకోవడంతో ఎన్నో సార్లు వార్తల్లో నిలిచింది కూడా. ఈ విషయంలో ఆమెపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ కెరీర్‌ కోసం వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకెళ్తోంది.

   జబర్ధస్త్‌‌లో సంచలన ఘటన... షాక్‌లో

  జబర్ధస్త్‌‌లో సంచలన ఘటన... షాక్‌లో

  ఈ మధ్య కాలంలో జబర్ధస్త్ షోకు మరింత ఆదరణ లభిస్తోంది. అప్పట్లో చేసిన బడా కమెడియన్లు దీనికి దూరం అయినప్పటికీ.. సరికొత్త ప్రయోగాలతో నిర్వహకులు షోను సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో మరెన్నో ప్రయోగాలను సైతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జబర్ధస్త్ షోలో సంచలన సంఘటన జరిగింది. దీంతో అంతా షాక్ అయిపోయారు.

  అనసూయను డ్రెస్‌లపై ప్రశ్నించిన గెస్ట్

  అనసూయను డ్రెస్‌లపై ప్రశ్నించిన గెస్ట్

  వచ్చే గురువారం ప్రసారం కానున్న జబర్ధస్త్ షోకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో హైపర్ ఆది టీమ్ కోసం యూట్యూబ్ యాంకర్ శివ గెస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. అతడితో కలిసి ఆది వినూత్నమైన స్కిట్ చేసి మెప్పించాడు. ఇక, ఈ ప్రోమో చివర్లో అనసూయను యాంకర్ శివ చిన్న ప్రశ్న అడుగుతానంటూ ఆమె డ్రెస్‌ల గురించి ప్రశ్నించాడు. దీంతో పెద్ద రచ్చ జరిగింది.

  బాధతో ఆ మాటలంటూ వెళ్లిపోయింది

  శివ మాట్లాడుతూ.. ‘చిన్న చిన్న బట్టలు ఎందుకు వేసుకుంటారు అని చాలా కామెంట్లు వస్తుంటాయి. దీనిపై మీరేమంటారు' అని అనసూయను ప్రశ్నించాడు. దీనికామె ‘వాళ్లకంటే తెలియదు. మీరు ఇండస్ట్రీలో ఉంటూ ఇలా అడుగుతారా. అది నా పర్సనల్' అంది. దీనికి శివ ‘పర్సనల్ అయితే ఇంట్లో వేసుకోవచ్చు కదా' అన్నాడు. దీంతో కోప్పడిన అనసూయ స్టేజ్ దిగి బయటకు వెళ్లిపోయింది.

  Anchor Anasuya జబర్దస్త్ క్రేజ్.. చేతినిండా ప్రెస్టీజియస్ సినిమాలు | #HBDAnasuya | Filmibeat Telugu
  అనసూయతో కమెడియన్లు చర్చలు

  అనసూయతో కమెడియన్లు చర్చలు

  అనసూయ బయటకు వెళ్లిపోయే సమయంలో హైపర్ ఆదితో ‘వాట్ ఈజ్ దిస్.. ఇలాంటోళ్లను ఎందుకు తీసుకొస్తారు.. మీకు తెలియకుండానే జరుగుతున్నాయా ఏంటి అన్నీ' అంటూ కామెంట్ చేసింది. ఆ తర్వాత అక్కడున్న వాళ్లంతా ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రోమోలో చూపించారు. అసలేం జరిగిందో గురువారం వచ్చే షోలో తెలుస్తుంది.

  English summary
  Shocking Incident Placed in Telugu Famous Comedy Show Jabardasth. Anchor Shiva Asked about Anchor Anasuya Bharadwaj Dressing. Then She Left the Stage and Went Back.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X