బిగ్‌బాస్‌ను ఎలా సంతృప్తి పరుస్తావని వేధించారు..యాంకర్ శ్వేతారెడ్డి కేసు
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 3 ప్రారంభం కావడానికి ముందే అనేక వివాదాల్లో చుట్టుముడుతున్నాయి. తాజాగా మహిళా సెలబ్రిటీలతో బిగ్‌బాస్ నిర్వాహకులు అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు రావడం మీడియాలో సంచలనం రేపింది. తాజాగా బిగ్‌బాస్ నిర్వాహకులపై విరుచుకుపడిన యాంకర్ శ్వేతారెడ్డి మరో అడుగు ముందుకేసింది. తాజాగా బిగ్‌బాస్ నిర్వాహకులపై కేసు కూడా నమోదు చేయడం మరింత సెన్సేషనల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.

లైంగికంగా వేధించారని
యాంకర్ శ్వేతారెడ్డి శనివారం (13 జూలై) రోజున బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బిగ్‌బాస్ కార్యక్రమ నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్ షోలో పాల్గొనేందుకు పిలిచి తనను లైంగికంగా వేధించారని శ్వేతారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో ఈ కార్యక్రమం నిర్వహణపై మరోసారి చర్చనీయాంశమైంది.

కమిట్‌మెంట్ అడిగారని
బిగ్‌బాస్ నిర్వాహకులను కూడా ఈ కేసులో శ్వేతారెడ్డి ఈడ్చింది. బిగ్‌బాస్3 కార్యక్రమానికి ఎంపిక చేశారని, అయితే తనకు అగ్రిమెంట్ ఇవ్వలేదు అని యాంకర్ శ్వేతారెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా బిగ్‌బాస్‌ను ఎలా సంతృప్తి పరుస్తారు అని లైంగికంగా వేధించారు అని పేర్కొన్నారు. అంతేకాకుండా కార్యక్రమ బాధ్యులను కూడా ఈ కేసులో పేర్కొనడం చర్చనీయాంశమైంది.

జూలై 21న ప్రారంభం
బిగ్ బాస్ సీజన్ 3 జూలై 21వ తేదీన ప్రారంభం కానున్నది. ఈ సందర్భంగా ఇప్పటికే పలువురు సెలబ్రిటీల ఎంపిక పూర్తి కావడంతో తనకు అన్యాయం జరిగిందనే భావనలో యాంకర్ శ్వేతారెడ్డి ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ క్రమంలో పలువురు మహిళా సినీ ప్రముఖులు కూడా తమతో ఇలానే వ్యవహరించారని ప్రముఖ టీవీ ఛానెల్లో వేధించడం చర్చనీయాంశమైంది.

నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్ 3
ఇక బిగ్‌బాస్ షోకు నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో సీజన్ 1కు జూనియర్ ఎన్టీఆర్, సీజన్ 2కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించడంపై ట్రోలింగ్ మొదలైంది. గతంలో బిగ్‌బాస్ షోపై నాగ్ ప్రతికూలంగా వ్యవహరించడం తెలిసిందే. తాజాగా ఎంపికలో మహిళా సెలబ్రిటీలపై వేధింపులు ఇప్పుడు మరింత హాట్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











