బిగ్‌బాస్ 2 : నాని ఎప్పటికీ ఎన్టీఆర్ కాలేడు అంటున్న శ్యామల!
Recommended Video

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 మొదలైన తర్వాత నాని ఈ షోను హోస్ట్ చేస్తున్న తీరుపై చాలా విమర్శలు వచ్చాయి. చాలా మంది మొదటి సీజన్ హోస్ట్ చేసిన ఎన్టీఆర్‍తో కంపేర్ చేశారు. యంగ్ టైగర్ స్థాయిలో నాని ప్రేక్షకులను అలరించ లేక పోయారని కొందరు, నాని స్టైల్ నానిదే... ఆయన నేచురల్ పెర్ఫార్మర్ అని కొందరు ఇలా రకరకాల అభిప్రాయాలు వినిపించాయి. ఈ ఇద్దరిలో మీకు ఎవరి హోస్టింగ్ ఇష్టం అనే ప్రశ్న ఎదురైనపుడు యాంకర్ శ్యామల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

ఎన్టీఆర్.... నాని కాలేడు, నాని... ఎన్టీఆర్ కాలేడు
ఎన్టీఆర్.... నాని కాలేడు, నాని... ఎన్టీఆర్ కాలేడు. ఎవరి స్టైల్ వారికి ఉంటుంది. నానికి నేచురల్ స్టార్ అనే పేరుంది. యాంకరింగ్ కూడా చాలా నేచురల్‌గా చేస్తున్నారు. ఆయన చేస్తున్న హోస్టింగులో తనకు లోపాలు ఏమీ కనిపించలేదన్నారు.

లుక్ పరంగా నచ్చలేదు
నాని హోస్ట్‌గా కోటు వేసుకుని కనిపిస్తే కొత్తగా అనిపిస్తుంది కానీ.... సినిమాల్లో పక్కింటి అబ్బాయిలా ఉంటారు. ఆయన అలా కోట్లు వేసుకుని వచ్చేసరికి ఎందుకో నాకు మొదట్లో పెద్దగా ఎక్కలేదు. తర్వాత తర్వాత అలవాటు పడిపోయాం. లుక్స్ వైజ్ తప్ప ఆయన ఎలా ఉంటారో అలానే చేస్తున్నారు.... అని శ్యామల తెలిపారు.

నాని ఒక హీరో స్థానంలో ఉండి అలా...
కోపం వస్తే తిడుతున్నారు, నచ్చితే మెచ్చుకుంటున్నారు. ఇటీవల గీతా మాధురిని పొగుడుతూ నేను మీ ఫ్యాన్ అయిపోయాను అని చెప్పారు. ఒక హీరో అయుండి... హోస్ట్ స్థానంలో ఉండి ఆయన అలా కంటెస్టెంటును పొగడటం అనేది నాని హంబుల్‌నెస్‌కి నిదర్శనమని శ్యామల తెలిపారు.

తేజు గురించి..
తేజును మొదట్లో చూసినపుడు కాస్త ఓవర్ యాక్టింగ్, హైపర్ యాక్టింగ్ అనిపించింది. కానీ తర్వాత ఆమెను అర్థం చేసుకున్నాను. తను ఎక్స్‌ప్రెషన్‌ను లోపల దాచుకోలేదు. వెంటనే బయటకు అనేస్తుంది. దాన్ని తీసుకోవడం మొదట్లో కష్టం అనిపించింది. ఒకసారి తన గురించి తెలుసుకున్న తర్వాత, టైమ్ స్పెండ్ చేసిన తర్వాత తన నటించడం లేదు, తతన స్వభావమే అంత అని అర్థమైంది... అని శ్యామల తెలిపారు.

తేజ, సామ్రాట్ బంధం గురించి
తేజు, సామ్రాట్ మధ్య ఏదో ఉందని నేను అనుకోవడం లేదు. వాళ్లు ముందు నుండి ప్రెండ్స్ కాస్త క్లోజ్ గా ఉంటారు. అదే సమయంలో లవర్ టాస్క్ రావడం, వారు పేయిర్ గా ఉండటం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఒక వేళ వారి మధ్య ఏదైనా ఉంటే అది వారి పర్సనల్, దాని గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్.


Click it and Unblock the Notifications











