భర్త మోసంపై పెదవి విప్పిన యాంకర్ శ్యామల: డెలివరీ అయిన వెంటనే అలా.. మొత్తం ఆమె చేసింది అంటూ!
తెలుగు బుల్లితెరపై ఎంతో మంది భామలు యాంకర్లుగా సందడి చేశారు. కానీ, వారిలో అతి తక్కువ మంది మాత్రమే మంచి గుర్తింపుతో విశేషమైన పేరును తెచ్చుకున్నారు. అందులో లోకల్ బ్యూటీ శ్యామల ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ.. అందం, అభినయంతో రాణించి మంచి పేరు సంపాదించింది.
దీంతో ఇప్పటికీ ఆఫర్లను సొంతం చేసుకుంటూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో శ్యామల భర్త వివాదం సహా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!

అలా వచ్చి ఫుల్ పాపులర్: యాంకర్‌గా మారడానికి ముందే శ్యామల బుల్లితెరపై నటిగా పరిచయం అయింది. ఈ క్రమంలోనే 'లయ', 'అభిషేకం', 'గోరింటాకు' వంటి సీరియళ్లలో అదిరిపోయే నటనను కనబరిచి సత్తా చాటింది. ఆ తర్వాత యాంకర్‌గా మారిన శ్యామల 'మా ఊరి వంట', 'పట్టుకుంటే పట్టుచీర' వంటి షోలు చేసింది. అలాగే 'లౌక్యం', 'ఒక లైలా కోసం' వంటి చిత్రాల్లో మెరిసింది.

ప్రేమ వివాహంతో ఒక్కటై: ఏకధాటిగా సినిమాలు, షోలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోన్న సమయంలోనే యాంకర్ శ్యామల బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకున్న నటుడు నరసింహాతో ప్రేమలో పడింది. ఆ తర్వాత అతడితో చాలా కాలం సీక్రెట్‌గా ట్రాక్ నడిపింది. ఒక సమయంలో పెద్దలను ఎదురించినా.. ఆ తర్వాత ఒప్పించారు. దీంతో వీరిద్దరూ అగ్ని సాక్షిగా ఒక్కటై తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చారు.

రాజకీయాలు, వివాదాలు: ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత శ్యామల బిగ్ బాస్ షోలోకి వచ్చింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి సైతం అడుగు పెట్టింది. ఇలా 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి భర్తతో కలిసి ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేసింది. ఇక, ఈ మధ్య ఆమె షర్మిలనూ, బ్రదర్ అనిల్‌ను కలిసింది. ఆ తర్వాత శ్యామల, ఆమె భర్త ఓ వివాదంలో చిక్కుకుని హాట్ టాపిక్‌గా మారారు.

క్రేజీ హిట్.. ఇంటర్వ్యూలో: ఇటీవలే యాంకర్ శ్యామల 'విరూపాక్ష' అనే చిత్రంలో నటించింది. ఇది భారీ హిట్ అవడంతో పాటు ఆమె పాత్రకు కూడా మంచి పేరు దక్కింది. దీంతో ఆమెలో ఉత్సాహం రెట్టించింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ భామ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో యాంకర్ శ్యామల తన భర్త వివాదం, ఫ్యామిలీ స్ట్రగుల్స్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

19 ఏళ్లకే ప్రేమ వివాహం: ఈ ఇంటర్వ్యూలో శ్యామల మాట్లాడుతూ.. 'నేను 19 ఏళ్లకే ప్రేమ వివాహం చేసుకున్నాను. అది మా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. అందుకే వాళ్లెవరూ నా పెళ్లికి హాజరు కాలేదు. మా అమ్మను ఎలాగైనా ఒప్పించి నా పెళ్లి చూసేలా చేసుంటే బాగుండేది అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇక, మా బాబు పుట్టిన తర్వాత మాత్రం రెండు ఫ్యామిలీలు కలిసిపోయాయి' అని చెప్పుకొచ్చింది.

డెలివరీ తర్వాత ట్రోల్స్: శ్యామల కొనసాగిస్తూ.. 'నేను 8 నెలల ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కూడా యాంకరింగ్ చేశా. బాబు పుట్టిన తర్వాత మాత్రం కాస్త గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో బిగ్ బాస్ షోలోకి వెళ్లాను. కానీ నన్ను అర్థం చేసుకోకుండా 11 నెలల బిడ్డను వదిలేసి వెళ్ళింది అంటూ దారుణంగా ట్రోల్ చేశారు. డబ్బుకోసం బిడ్డను వదిలేశానని నోటికి వచ్చినట్లుగా నన్ను తిట్టుకున్నారు' అని వెల్లడించింది.

భర్త మోసంపై తొలిసారి: భర్త మోసం గురించి మాట్లాడుతూ.. 'కోవిడ్ సమయంలో ఒకావిడ నా భర్తపై చీటింగ్ కేసు పెట్టింది. ఆమె మా ఇంటికి వచ్చినప్పుడు నా చేతితో వండి భోజనం పెట్టాను. అయినప్పటికీ మా ఫ్యామిలీ వెన్నుపోటు పొడిచి నిందలు వేసింది. నా భర్త ఒకరిని మోసం చేసే వ్యక్తి కాదు. చివరకి అదే న్యాయ పరంగా రుజువైంది' అని యాంకర్ శ్యామల తొలిసారి దీనిపై పెదవి విప్పింది.


Click it and Unblock the Notifications











