ప్రెగ్నెంట్‌గా ఉన్నా ఆ పని చేశా.. డెలివరీ అయినా వదల్లేదు: భర్త గురించి బయటపెట్టిన శ్యామల

తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా పరిచయం అయ్యారు. అందులో కొందరు మాత్రమే స్టార్‌ స్టేటస్‌ను అందుకున్నారు. అలాంటి వారిలో బ్యూటిఫుల్ లేడీ శ్యామల ఒకరు. చాలా ఏళ్ల క్రితమే తెరంగేట్రం చేసిన ఈ భామ.. అప్పటి నుంచి యాంకర్‌గా, నటిగా సందడి చేస్తోంది. ఫలితంగా వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా యాంకర్ శ్యామల మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన ఎన్నో చేదు సంఘటనల గురించి మాట్లాడింది. ఆ వివరాలను మీరే చూసేయండి!

షోలు, సినిమాలు చేస్తూ:ముందుగా యాంకర్ శ్యామల నటిగా ఎంట్రీ ఇచ్చి సీరియళ్లలో నటించింది. అలా తన కెరీర్‌లో 'లయ', 'అభిషేకం', 'గోరింటాకు' వంటి వాటిలో నటించి మెప్పించింది. ఆ తర్వాత యాంకర్‌గా మారిన శ్యామల 'మా ఊరి వంట', 'పట్టుకుంటే పట్టుచీర' సహా పలు షోలు చేసింది. అలాగే 'లౌక్యం', 'ఒక లైలా కోసం' వంటి సినిమాలతో శ్యామల సత్తా చాటుకుంది.

Anchor Shyamala Comments On Trolls and Husband Controversy

నటుడితో లవ్ మ్యారేజ్:వరుస పెట్టి సినిమాలు, షోలు చేస్తూ కెరీర్ పరంగా సమయంలోనే యాంకర్ శ్యామల బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకున్న నటుడు నరసింహాతో ప్రేమాయణం సాగించింది. ఆ తర్వాత అతడితో చాలా కాలం పాటు సీక్రెట్‌గా లవ్ ట్రాక్‌ను నడిపింది. ఒక సమయంలో పెద్దలను ఎదురించినా.. ఆ తర్వాత ఒప్పించారు. దీంతో వీరిద్దరూ అగ్ని సాక్షిగా ఒక్కటై తర్వాత ఓ బిడ్డకు తల్లైంది.

సినిమాలు.. పాలిటిక్స్:తల్లైన కొంత కాలానికే యాంకర్ శ్యామల బిగ్ బాస్ షోలోకి వచ్చింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి సైతం అడుగు పెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. గత ఏడాది విరూపాక్ష చిత్రంలో అదిరిపోయే పాత్రను చేసి మెప్పించింది. ఇప్పుడు కూడా ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తోంది. ఆ మధ్య శ్యామల, ఆమె భర్త ఓ వివాదంలో చిక్కుకుని హాట్ టాపిక్‌ అయిపోయారు.

Anchor Shyamala Comments On Trolls and Husband Controversy

అలా పెళ్లి చేసుకున్నా:వరుస ఆఫర్లతో సత్తా చాటుతోన్న శ్యామల తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను 19 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా. అది మా ఇంట్లో వాళ్లకు నచ్చలేదు. అందుకే వాళ్లెవరూ నా పెళ్లికి రాలేదు. మా అమ్మను ఎలాగైనా ఒప్పించి నా పెళ్లి చూసేలా చేసుంటే బాగుండేది అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇక, మా బాబు పుట్టిన తర్వాత మాత్రం రెండు ఫ్యామిలీలు కలిశాయి' అని వివరించింది.

తల్లైన తర్వాత ట్రోల్స్:శ్యామల కంటిన్యూ చేస్తూ.. 'నేను 8 నెలల ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కూడా యాంకర్‌గా పని చేశా. బాబు పుట్టిన తర్వాత మాత్రం కాస్త గ్యాప్ తీసుకున్నా. ఆ సమయంలో బిగ్ బాస్ షోలోకి వెళ్లాను. కానీ నన్ను 11 నెలల బిడ్డను వదిలేసి వెళ్లింది అంటూ దారుణంగా ట్రోల్ చేశారు. డబ్బుకోసం బిడ్డను వదిలేశానని నోటికి వచ్చినట్లుగా నన్ను తిట్టుకున్నారు' అని ఆవేదన వ్యక్తం చేసింది.

Anchor Shyamala Comments On Trolls and Husband Controversy

భర్త వివాదంపై ఓపెన్:ఇదే ఇంటర్వ్యూలో భర్త వివాదం గురించి ప్రస్తావిస్తూ.. 'కోవిడ్ సమయంలో ఒకావిడ నా భర్తపై కేసు పెట్టింది. ఆమె మా ఇంటికి వస్తే భోజనం పెట్టాను. అయినప్పటికీ మాకు వెన్నుపోటు పొడిచి నిందలు వేసింది. నా భర్త ఒకరిని మోసం చేసే వ్యక్తి కాదు. చివరకి అదే న్యాయ పరంగా రుజువైంది' అని యాంకర్ శ్యామల తెలిపింది. తద్వారా నరసింహా క్యారెక్టర్ బయట పెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X