చిక్కుల్లో స్టార్ యాంకర్ శ్యామల భర్త.. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్!

గత కొద్ది రోజులుగా వార్తలు నిలుస్తున్న యాంకర్ శ్యామల మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అయితే ఈ సారి ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించిన వివరాల గురించి కాదు. ఆమె భర్త మీద నమోదయిన చీటింగ్ కేసు విషయంలో. ఈ మధ్య కాలంలో సుమతో పోటీ పడుతూ శ్యామల అనేక ఈవెంట్స్, టీవీ షోలు చేస్తూ ట్రేండింగ్ లో ఉంది. తాజాగా ఆమె కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూల వలన ఆమె గురించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఆమె భర్త మీద చీటింగ్ కేసు నమోదైనట్లు మీడియాలో కధనాలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే

యాంకర్ శ్యామల భర్త మీద చీటింగ్ కేసు

యాంకర్ శ్యామల భర్త మీద చీటింగ్ కేసు

యాంకర్ శ్యామల భర్త నరసింహారెడ్డి మీద రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు అయినట్లు సమాచారం. తన వద్ద కోటి రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా శ్యామల భర్త నరసింహారెడ్డి మోసం చేశాడని ఒక మహిళ ఫిర్యాదు చేసినట్లు మీడియాలో కధనాలు వస్తున్నాయి. 2017 నుంచి ఇప్పటివరకు విడతలవారీగా డబ్బు తీసుకున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారని అంటున్నారు. డబ్బుల విషయం గురించి అడిగితే బెదిరింపులకు దిగారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

రిమాండ్ కి తరలింపు

రిమాండ్ కి తరలింపు

డబ్బు తీసుకోవడమే కాకుండా లైంగికంగా కూడా నరసింహారెడ్డి వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో సెటిల్మెంట్ చేసుకోవాలని నరసింహారెడ్డి తరఫున ఒక మహిళ కూడా రాయబారం చేసిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్టు మీడియాలో కధనాలు వస్తున్నాయి. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు...నర్సింహారెడ్డి తో పాటు రాయబారం నడిపిన మహిళను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశం మీద శ్యామల స్పందించాల్సి ఉంది.

17 ఏళ్లకే ఇంట్లో నుంచి వచ్చేసి పెళ్లి

17 ఏళ్లకే ఇంట్లో నుంచి వచ్చేసి పెళ్లి

ఇక కాకినాడకు చెందిన యాంకర్ శ్యామల టీవీ నటుడు నరసింహారెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లి అనుకున్నంత సాఫీగా అయితే జరగలేదని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. కులాలు వేరు కావడంతో తాను 17 ఏళ్లకే ఇంట్లో నుంచి వచ్చేసి పెళ్లి చేసుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది. అయితే తాను మేజర్ కాకముందే ప్రేమలో పడడంతో పెళ్లి చేసుకోవడానికి బయటకు వచ్చాక కూడా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది. తాను అతి లో జగదేకవీరుడు అతిలోక సుందరి అనే సీరియల్ చేస్తున్న సమయంలో తమ ఇద్దరికీ పరిచయం అయిందని ఆమె చెప్పుకొచ్చింది.

సినిమా రేంజ్ లో పెళ్లి కష్టాలు

సినిమా రేంజ్ లో పెళ్లి కష్టాలు

ముందు అందరి లాంటి అబ్బాయి అని దూరంగా ఉన్నా ఇద్దరి మధ్య చనువు పెరిగింది అని రోజు తనను కార్ లో డ్రాప్ చేసేవాడని ఆ జర్నీలో మాట్లాడుకుంటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుని చివరికి ప్రేమలో పడ్డామని ఆమె చెప్పుకొచ్చింది..

అయితే పెళ్లి చేసుకోవాలని అనుకుంటే మా అమ్మ ఒప్పుకోలేదు అని దానికి కారణం కులాలు వేరు కావడమే అని శ్యామల పేర్కొంది. మేము బ్రాహ్మిన్స్ వాళ్లు రెడ్డీస్ కావడంతో మా అమ్మకు రెడ్డి అబ్బాయిలంటే సమరసింహా రెడ్డి నరసింహారెడ్డి రేంజ్ లో ఉంటారని అని భయం అని ఆమె చెప్పుకొచ్చింది. వాళ్లని ఫ్యాక్షనిస్టులు అని ఊహించుకుని రెడ్లు అంటే చాలా కోపంగా ఉంటారు నువ్వు తట్టుకోలేవు నీకు ఊ అంటే కన్నీళ్లు వచ్చేస్తాయి అని ఆమె వారించింది అని శ్యామల చెప్పుకొచ్చింది. చివరికి సినిమాల్లో లానే ఎన్నో కష్టాల అనంతరం ఒక్కటయ్యామని ఆమె చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X