వాళ్ళిద్దరితో కలసి శ్యామల రాజకీయం, మళ్ళీ బిగ్‌బాస్‌లోకి, అలాగైతే ఓకే అంటున్న కౌశల్ ఫాన్స్!

యాంకర్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న శ్యామల బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మరింతగా పాపులర్ అయింది. ఇటీవల శ్యామల హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 2 పై మరింతగా ఆసక్తి పెంచేలా నిర్వాహకులు సరికొత్త ప్లాన్ వేశారు. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన ఆరుగురు సభ్యులలో ఒకరిని తిరిగి హౌస్ లోకి పంపించబోతున్నారు. తమ అభిమాన కంటెస్టెంట్ ని హౌస్ లోకి పంపే అవకాశం ఆడియన్స్ చేతుల్లోనే ఉంది. ఓటింగ్ ద్వారా ఈ ప్రక్రియ ప్రారంభమైంది.

 ప్రయత్నాలు మొదలు

ప్రయత్నాలు మొదలు

సంజన, నూతన్ నాయుడు, కిరీటి, శ్యామల, భానుశ్రీ, తేజస్వి ఇప్పటివరకు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సభ్యులు. తిరిగి హౌస్ లోకి వెళ్లే అవకాశం రావడంతో ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టారు. సోషల్ మీడియా ద్వారా ఫాన్స్ ని రిక్వస్ట్ చేస్తున్నారు.

యాంకర్ శ్యామల

యాంకర్ శ్యామల

యాంకర్ శ్యామల తాజాగా ఫేస్ బుక్ పేజీ లైవ్ లో ఫ్యాన్స్ తో ముచ్చటించారు. తాను తిరిగి హౌస్ లోకి వెళ్లాలని కోరుకుంటున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. శ్యామల తిరిగి హౌస్ లోకి వెళాళ్లని భావిస్తున్న వారు ఉన్నా, అదే సమయంలో ఆమెకు కొన్ని ప్రశ్నలు సైతం ఎదురయ్యాయి.

ఏడాది కొడుకు

ఏడాది కొడుకు

శ్యామలకు ఏడాది కూడా నిండని పసి బాబు ఉన్నాడు. కొడుకుని వదిలేసి బిగ్ బాస్ కు వెళ్లడం అవసరమా అనే ప్రశ్నలు ఫేస్ బుక్ లైవ్ లో ఎదురయ్యాయి. అలా ఎందుకు ఆలోచిస్తారు అంటూ శ్యామల స్పందించింది. తాను తన బాబుని ఎవరివద్దే వదలడం లేదు అని తన కుటుంబ సభ్యుల వద్దే వదిలి వెళుతున్నా అని అన్నారు.

వాడికోసమే

వాడికోసమే

మీరంతా మీ పిల్లలని వదలి పెట్టి ఉద్యోగాలు చేస్తున్నారు కదా.. ఇది కూడా అంతే అని శ్యామల అన్నారు. మీ పిల్లల కోసం మీరు ఉద్యోగాలు చేస్తున్నారు. నా ఉద్యోగం ఇదే అంటూ శ్యామల బదులిచ్చారు. నేను చేసే ఈ పని కూడా నా కొడుకు కోసమే అని శ్యామల తెలిపింది.

కౌశల్ ఫాన్స్ కండిషన్స్

కౌశల్ ఫాన్స్ కండిషన్స్

ఈ సందర్భంగా శ్యామలకు కౌశల్ ఫాన్స్ కండిషన్స్ పెట్టారు. మేము మీకు ఓట్ చేస్తాం. మీరు బిగ్ బాస్ కు వెళ్ళాక కౌశల్ కు సపోర్ట్ చేయాలి అని కండిషన్ పెట్టారు. ప్రస్తుతం ఉన్న బిగ్ బాస్ సభ్యులలో కౌశల్ కు ఆడియన్స్ వైపు నుంచి బాగా మద్దత్తు ఉంది.

 ఎవ్వరితోనూ సమస్య లేదు

ఎవ్వరితోనూ సమస్య లేదు

కౌశల్ అభిమానుల కండిషన్ కు శ్యామల సరదాగా స్పందించింది. ఇచ్చిపుచ్చుకునే పథకమా.. నాకు ఎవ్వరితోనూ సమస్య లేదు. నేను అందరికి సపోర్టే. నేను హౌస్ లో ఎవరితో అయినా గొడవ పెట్టుకోవడం గమనించారా అని శ్యామల అన్నారు.

నిమ్మకాయ పిండుతుంటే

నిమ్మకాయ పిండుతుంటే

కౌశల్ కు కిరీటి నిమ్మకాయ పిండుతుంటే మొదట అడ్డుకుంది నేనే అని శ్యామల తెలిపింది. కౌశల్ బాగా గేమ్ ఆడినప్పుడల్లా అతడికి సపోర్ట్ చేస్తా అని శ్యామల తెలిపింది.

గీత మాధురి, దీప్తితో కలసి రాజకీయం

గీత మాధురి, దీప్తితో కలసి రాజకీయం

మరికొందరు ఫాన్స్ బిన్నంగా స్పందించారు. మీకు ఓట్ చేస్తాం. బిగ్ బాస్ కు తిరిగి వెళితే గతంలో లాగా దీప్తి, గీతా మధురితో కలసి రాజకీయం చేయొద్దు. మీరు సొంతంగా ఆడింది అని సూచించారు.దీనిపై శ్యామల క్లారిటీ ఇచ్చింది.

అమ్మలక్కల కబుర్లే

అమ్మలక్కల కబుర్లే

మేము ముగ్గురం కలసి సీక్రెట్ గా మాట్లాడుకున్న సంగతులన్నీ అమ్మలక్కల కబుర్లే అని అన్నారు. మీ భర్త ఎలా ఉంటారు, మీ అత్తగారు ఎలా ఉంటారు ఇలా ఆడవాళ్లు మాట్లాడుకునే సాధారణ విషయాలే అని శ్యామల తెలిపింది. ఒక సందర్భంలో మాత్రం ఎలిమినేషన్ గురించి మాట్లాడుకున్నట్లు క్లారిటీ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X