ఆ మహిళతో చాలా కాలంగా సంబంధం.. నాకు తెలీదా...భర్త అరెస్ట్ పై శ్యామల షాకింగ్ కామెంట్స్!

ఈరోజు ఉదయం యాంకర్ శ్యామల భర్త సినీ నటుడు టీవీ నటుడు నరసింహా రెడ్డిని పోలీసులు చీటింగ్ కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వార్త దావానలంలా వ్యాపించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ అంశం మీద తాజాగా యాంకర్ శ్యామల స్పందించారు. ఆమె తన భర్త గురించి ఫిర్యాదు చేసిన సదరు మహిళ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమన్నారంటే ?

నరసింహారెడ్డి అరెస్ట్

నరసింహారెడ్డి అరెస్ట్

ఈ రోజు ఉదయం రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో నటుడు నరసింహారెడ్డి తన వద్ద కోటి రూపాయలు తీసుకుని అడిగితే బెదిరిస్తున్నారని ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఆ డబ్బులు ఇవ్వాలని గట్టిగా అడిగితే లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. 2017 నుంచి దఫదఫాలుగా తన వద్ద కోట్ల రూపాయల డబ్బు వసూలు చేశాడని పేర్కొంటూ తమ మధ్య రాయబారం నడిపిందని మరో మహిళ మీద కూడా ఆమె కేసు పెట్టింది. ప్రాథమిక దర్యాప్తు అనంతరం పోలీసులు రాయబారిగా వ్యవహరించిన మహిళ సహా నరసింహా రెడ్డిని అరెస్టు చేశారు.. తాజాగా ఈ అంశం మీద యాంకర్ శ్యామల స్పందించారు.

ఒక్కసారైనా బయటపడతాడు కదా

ఒక్కసారైనా బయటపడతాడు కదా

ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ తన భర్త ఎలాంటివాడో తనకు తెలుసు అని ఆయన ఎలాంటి తప్పు చేయడు అని చెప్పుకొచ్చింది. ఇదంతా తప్పుడు కేసు అని ఆమె చెప్పుకొచ్చింది. తనకు అసలు భర్త అరెస్ట్ అయిన సంగతి కూడా తెలియదని కేవలం టీవీలో చూసి ఈ విషయం తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది.

కోటి రూపాయల కోసం ఒక ఆడపిల్ల ని మోసం చేసే వ్యక్తిత్వం తన భర్తది కాదు అని ఆమె చెప్పుకొచ్చింది. తాను ఆయన పెళ్లి చేసుకుని పది ఏళ్ళు అయిందని ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఉన్నామని ఆమె చెప్పుకొచ్చింది. పదేళ్లలో ఒక్కసారి కూడా ఆయనలో ఎలాంటి చెడు విషయం కనిపించలేదని డబ్బుల గురించి ఆశపడే వాడైతే ఒక్కసారైనా బయటపడతాడు కదా అని ఆమె చెప్పుకొచ్చింది.

రాత్రి వచ్చాడో లేదో తెలీదు

రాత్రి వచ్చాడో లేదో తెలీదు

తాము రెండు రోజుల క్రితమే తన భర్త సొంత ఊరు చీరాల నుంచి హైదరాబాద్ వచ్చామని తనకు జ్వరం వచ్చి పడుకున్నాను అని నిన్న రాత్రి ఇంటికి వచ్చారో లేదో కూడా నాకు తెలియదని శ్యామల చెప్పుకొచ్చారు.. ఈలోపే ఇలా అరెస్టు జరిగిందంటూ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో తాను స్పందించాల్సి వచ్చింది అని ఆమె పేర్కొంది. నిజం ఏమిటో నిలకడ మీద తెలుస్తుంది అప్పటివరకు ఇలా తప్పుడు ఆరోపణలు మీద వార్తలు ప్రసారం చేయొద్దని ఆమె కోరింది.

Recommended Video

Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
నేనే ప్రెస్ మీట్ పెడతా

నేనే ప్రెస్ మీట్ పెడతా

ఆ మహిళతో నరసింహకు చాలా కాలంగా సంబంధం ఉందని, గొడవలు అవుతున్నాయని ప్రచారం చేస్తున్నారని అలా అనుకుంటే అసలు ఈ ఇష్యూ నాకు ఇప్పటివరకు తెలియదని అన్నారు. దీని గురించి నా భర్తని అడిగి తెలుసుకుంటానన్న ఆమె మా మామయ్య వాళ్లకి సమాచారం ఇచ్చా వాళ్లు వచ్చిన తర్వాత నరసింహను కలిసి మాట్లాడతామని అన్నారు. నా భర్తతో పాటు మరో మహిళను కూడా రిమాండ్‌కి తరలించారని.. అంటున్నారు అది కూడా నాకు తెలియదు. అన్నీ తెలుసుకుని ప్రెస్ మీట్ పెడతామని, అన్ని వివరాలు చెబుతానని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X