మిడ్ నైట్ అలా వేధించాడు.. ఫోన్‌లో అలాంటి మాటలు మాట్లాడాడు: బయటపెట్టిన యాంకర్
తెలుగు బుల్లితెరపై యాంకర్, వెండితెరపై నటిగా వెలుగొందుతూ.. సుదీర్ఘకాలంగా తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతోంది శ్యామల. ఇలా దాదాపు దశాబ్ద కాలంగా షోలు, సీరియళ్లు, సినిమాలు చేసుకుంటూ హవాను చూపిస్తోన్న ఈ భామ.. ఇప్పుడు కూడా వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. ఫలితంగా తీరిక లేకుండా ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యాంకర్ శ్యామల.. తన కెరీర్ ఆరంభంలో జరిగిన చేదు అనుభవం గురించి మాట్లాడింది. ఈ క్రమంలోనే ఓ కెమెరామెన్ బండారం బయటపెట్టింది. వివరాల్లోకి వెళ్తే....
అలా వచ్చి ఇలా పాపులర్
సీరియల్ నటిగా తెలుగు వాళ్లకు పరిచయమైన శ్యామల.. 'లయ', 'అభిషేకం', 'గోరింటాకు' సహా పలు ధారావాహికల్లో నటించి ఫేమస్ అయింది. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. ఈ క్రమంలోనే 'మా ఊరి వంట', 'పట్టుకుంటే పట్టుచీర' వంటి షోలతో పాపులర్ అయింది. ఆ తర్వాత 'లౌక్యం', 'ఒక లైలా కోసం', 'గుండెల్లో గోదారి' సహా కొన్ని చిత్రాల్లో నటించింది.

ఆ నటుడితో ప్రేమ పెళ్లి
సినిమాలు, టీవీ షోలు చేస్తున్న సమయంలోనే యాంకర్ శ్యామల.. బుల్లితెరపై సత్తా చాటుతోన్న నటుడు నరసింహాతో లవ్‌లో పడిపోయింది. ఆ తర్వాత అతడితో చాలా కాలం పాటు సీక్రెట్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఈ క్రమంలోనే పెద్దలను ఒప్పించారు. దీంతో 2007లో వీరిద్దరూ అగ్ని సాక్షిగా ఒక్కటయ్యారు. ఈ జంటకు ఓ కుమారుడు కూడా ఉన్న విషయం తెలిసిందే.
ఇప్పుడు కూడా బిజీగానే
బుల్లితెరపై, వెండితెరపై సత్తా సందడి చేస్తూ వరుస ఆఫర్లు దక్కించుకుంటోన్న శ్యామల.. బిగ్ బాస్ షోలోనూ సందడి చేసింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన మార్కును చూపించింది. ఇక, గత ఏడాది 'విరూపాక్ష'తో బంపర్ హిట్ కొట్టిన యాంకర్ శ్యామల.. ఇప్పుడు కూడా పలు సినిమాల్లో కీలక పాత్రలను పోషిస్తోంది. అలాగే, వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది.

చేదు అనుభవాలు చెప్తూ
యాంకర్ శ్యామల తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను పంచుకుంది. అలాగే, ఫ్యామిలీ లైఫ్‌లోని మధురానుభూతులను కూడా ప్రేక్షకులకు వివరించింది. అలాగే, తన ప్రేమ ఎలా పుట్టింది? పెళ్లి ఎలా జరిగింది? అనే విషయాను వెల్లడించింది. అదే సమయంలో లైఫ్‌లో జరిగిన కొన్ని చేదు అనుభవాలను వివరించింది.
లవ్ ప్రపోజల్స్‌తో బాధ
ఈ ఇంటర్వ్యూలో శ్యామల మాట్లాడుతూ.. 'సినిమాల్లో నటించాలని నేను అమ్మతో కలిసి హైదరాబాద్‌లో అడుగు పెట్టా. అలా సీరియళ్లలో నటించడం మొదలెట్టినప్పుడు చాలా ఇబ్బందులు కలిగాయి. కావాలనే చాలా మంది నన్ను విసిగించేవారు. లవ్ ప్రపోజల్స్‌తో ఇబ్బంది పెట్టారు. దీంతో మూడు సీరియళ్లు చేసేసి.. తిరిగి ఇంటికి వెళ్లిపోదాం అనుకున్నా' అని చెప్పుకొచ్చింది.

అర్ధరాత్రి కాల్ చేసి మరీ
ఆ తర్వాత యాంకర్ శ్యామల కొనసాగిస్తూ.. 'సీరియళ్లకు పని చేసే ఓ కెమెరామెన్ నన్ను బాగా వేధించాడు. మిడ్ నైట్ టైంలో ఫోన్ చేసి భయపెట్టేవాడు. ఒకసారి అమ్మ కాల్ లిఫ్ట్ చేస్తే.. ''మీకు మగదిక్కు లేదు. నేను తలచుకుంటే ఏమైనా చేయగలను. నేను వెళ్లి మాట్లాడుతుంటే మీ అమ్మాయి పట్టించుకోవడం లేదు.. మీరైనా చెప్పండి'' అని బెదిరించాడు' అని వెల్లడించింది.
కంప్లైంట్ చేసినా అంతే
శ్యామల కంటిన్యూ చేస్తూ.. 'ఆ కెమెరామెన్ బెదిరించే సరికి అమ్మ బాగా భయపడిపోయింది. ఎవరికి చెప్పాలో మాకు అర్థం కాలేదు. అప్పుడే అమ్మ వెళ్లి ఈ ప్రోగ్రామ్ ప్రొడ్యుసర్‌కు జరిగింది చెప్పింది. అప్పుడాయన మేనేజర్‌ని పిలిపించి మాట్లాడారు. కానీ, వాళ్లంతా ఫ్రెండ్స్ కావడంతో కెమెరామెన్‌ను ఏమీ చేయలేదు. కానీ అతడి బాగోతం అందరికీ తెలిసింది' అని చెప్పింది.


Click it and Unblock the Notifications











