నా భర్తపై డౌట్ ఉంది.. ప్రేమించి పెళ్లి చేసుకోవడం వాళ్లకు నచ్చలేదు: యాంకర్ శ్యామల

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ తో పాటు యాంకర్స్ కూడా మెల్లమెల్లగా వారి క్రేజ్ ని పెంచుకుంటున్నారు. ప్రస్తుతం యాంకర్స్ మధ్య పోటీ తీవ్రత గట్టిగానే పెరిగింది. ఇకపోతే యాంకర్ శ్యామల కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన ఫొటోలతో నెటీజన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటుంది. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్యామల తన లవ్ స్టోరీ గురించి చెప్పింది.

సోషల్ మీడియాలో..

సోషల్ మీడియాలో..

నటిగానే కాకుండా యాంకర్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శ్యామల అప్పుడప్పుడు తన కామెంట్స్ తో నెటీజన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటుంది. లాక్ డౌన్ లో తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్న ఈ యాంకర్ సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్స్ తో కూడా ముచ్చటిస్తోంది.

లవ్ మ్యారేజ్

లవ్ మ్యారేజ్

ఈ బ్యూటీ లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లితోనే ఒకప్పుడు తెలుగు మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. సహా నటుడు నరసింహను ప్రేమించిన శ్యామల ఇంట్లో వాళ్లకు ప్రేమ వ్యవహారాన్ని మర్యాదపూర్వకంగా చెప్పగా వారు తిరస్కరించారు. కొన్నాళ్లపాటు ఓపిక పట్టిన ఆ జంట చివరికి ఒకటవ్వక తప్పలేదు.

పెళ్లి తరువాత..

పెళ్లి తరువాత..

శ్యామల పెళ్లి చేసుకొని చాలా కాలమవుతోంది. 2007లోనే టీవీ యాక్టర్ నరసింహను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత యధావిధిగా కెరీర్ ని కొనసాగించారు. ఇక 2017లో వీరికి ఒక బాబు కూడా పుట్టాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త గురించి శ్యామల కొన్ని కామెంట్స్ కూడా చేసింది. పెళ్లి తరువాత ఇంకా బాగా లవ్ చేస్తున్నారని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారని చెప్పింది.

Recommended Video

Bigg Boss Telugu Management Gives Clarity Over Host & Show Details
డౌట్ ఉంది..

డౌట్ ఉంది..

ఇక అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో తన భర్తను చూస్తే కాస్త డౌట్ వస్తుందని నిజంగా ఆయన నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడా లేదా అనే అనుమానం కలుగుతుంది. ఆ విషయం గురించి నా భర్తతో కూడా చర్చిస్తాను అని యాంకర్ శ్యామల సరదాగా వివరణ ఇచ్చింది. ఇక ఎలాంటి విషయాల్లో అయినా నన్ను నా భర్త చాలా గట్టిగా నమ్ముతారని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X