టాప్ కిందకి జరిపి షాకిచ్చిన శ్యామల: ఇది అట్టాంటిట్టాంటి షో కాదుగా!
తెలుగులో ఎంతో మంది లేడీస్ చాలా కాలంగా యాంకర్లుగా సందడి చేస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే టీవీ రంగం వైపు ఉండగా.. మరికొందరు మాత్రమే సినిమా కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు వంటివి చేస్తూ బిజీగా గడుపుతున్నారు. అలాంటి వారిలో అచ్చ తెలుగు భామ శ్యామల ఒకరు. నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఆమె.. ఆ తర్వాత యాంకర్‌గా మారి సత్తా చాటింది. దీంతో ఎనలేని గుర్తింపుతో పాటు ఎన్నో అవకాశాలను కూడా దక్కించుకుంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను దక్కించుకుంది. ఇక, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోనూ శ్యామల తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సీనియర్ యాంకర్ ఓ అదిరిపోయే ఫొటోను వదిలింది. దాన్ని మీరూ చూసేయండి!

అలా ఎంట్రీ... ఫుల్ పాపులారిటీతో
చిన్న వయసులోనే శ్యామల నటిగా బుల్లితెరపైకి ఎంటరైంది. ఈ క్రమంలోనే తన టాలెంట్‌తో బాగా ఫేమస్ అయింది. ఆమె ప్రయాణంలో 'లయ', 'అభిషేకం', 'గోరింటాకు' వంటివి పేరు తెచ్చాయి. ఆ తర్వాత యాంకర్‌గా మారి 'మా ఊరి వంట', 'పట్టుకుంటే పట్టుచీర' వంటి షోలు చేసింది. అలాగే 'లౌక్యం', 'ఒక లైలా కోసం' సహా పలు సినిమాలూ చేసింది.

సీరియల్ నటుడితో శ్యామల పెళ్లి
యాంకర్ శ్యామల కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే.. బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకున్న నటుడు నరసింహాతో ప్రేమలో పడింది. ఆ తర్వాత అతడితో చాలా కాలం పాటు లవ్ ట్రాక్ నడిపించింది. ఈ క్రమంలోనే పెద్దలను ఎదురించి.. ఆ తర్వాత ఒప్పించారు. దీంతో 2007లో వీరిద్దరూ అగ్ని సాక్షిగా ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా జన్మించాడు.

పాలిటిక్స్‌లోనూ.. వాళ్లతో మీటింగ్
ఒకవైపు సినిమాలు, షోలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ బిజీగా గడుపుతోన్నా.. యాంకర్ శ్యామల పాలిటిక్స్‌ను కూడా టచ్ చేస్తోంది. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఈ క్రమంలోనే భర్తతో కలిసి ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేసింది. ఈ క్రమంలోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక, ఈ మధ్య ఆమె షర్మిలనూ కలిసి తెగ హాట్ టాపిక్‌గా మారిపోయింది.

వివాదంలో భర్త.. సపోర్టుగా నిలిచి
కొన్ని రోజుల క్రితం యాంకర్ శ్యామల భర్త నరసింహా రెడ్డి ఓ వివాదంలో చిక్కుకున్నాడు. తన దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశాడంటూ ఓ మహిళ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బుల్లితెరపై కలకలం రేగింది. ఈ ఘటనపై యాంకర్ శ్యామల కూడా స్పందించింది. సోషల్ మీడియా వేదికగా తన భర్తకు సపోర్టుగా నిలిచింది. అలాగే ఎన్నో పోస్టులను కూడా చేసింది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగానే
కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ యాంకర్ శ్యామల సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా తరచూ తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. అంతేకాదు, అప్పుడప్పుడూ కొన్ని గ్లామరస్ పిక్స్‌ను వదులుతోంది. అలాగే, తన పర్సనల్ విషయాలను కూడా పంచుకుటోంది. ఫలితంగా తన ఫాలోవర్ల సంఖ్యను భారీగా పెంచుకుంటోంది.

అప్పుడప్పుడూ తళుక్కుమనేలా
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న యాంకర్ శ్యామల.. తరచూ తన ఫొటోలను, వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడూ అదిరిపోయే భంగిమలతో దిగిన ఫొటోషూట్లను కూడా వదులుతోంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ దిగినవి కూడా ఉంటోన్నాయి. ఇలా కూడా శ్యామల తెగ హైలైట్ అవుతూనే ఉంటోంది.

టాప్‌ను కిందకు జరిపిన శ్యామల
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హడావిడి చేస్తోన్న యాంకర్ శ్యామల.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్‌ను కిందకు జరిపి మరీ ఫోజులిచ్చింది. దీంతో ఈ ఆమె అందాలు మెరిసిపోతోన్నాయి. ఫలితంగా ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన దక్కుతోంది. తద్వారా ఇది తక్కువ సమయంలోనే వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











