నీకంత సీన్ లేదు.. హైపర్ ఆదిపై రెచ్చిపోయిన యాంకర్ సౌమ్యా రావు

బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని ఆర్టిస్ట్ కమెడియన్ హైపర్ ఆది. ఆయన పంచులు ప్రాసలతో టెలివిజన్ రంగంలో సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో ఎంతగానో గుర్తింపు పొందారు. జబర్దస్త్ షో వీడిన తర్వాత వెండితెర పైన తన టాలెంట్ ను ప్రదర్శించారు. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. మరోవైపు స్మాల్ స్క్రీన్ పైన కూడా పాపులర్ షో ల్లో హోస్ట్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఢీ20 మెగా లాంచ్ ఈవెంట్లో సందడి చేశారు. ఈ సందర్భంగా యాంకర్ సౌమ్య రావు పై పంచల వర్షం కురిపించారు. తను కూడా ధీటుగా బదులిచ్చింది..

Dhee 20 మెగా లాంచ్..
తెలుగు ప్రేక్షకులు పాపులర్ డ్యాన్స్ షో ఢీDhee ని ఎంతలా ఆదరిస్తారో తెలిసిందే. ఈషోకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేసే ఉంది. ఇప్పటికే 19 సీజన్లు పూర్తి చేసుకుందీ షో. తాజాగా ఢీ20.. ఇది సారూ మా బ్రాండ్ సబ్ టైటిల్ తో మరింత ఎనర్జీటిక్ తో అలరించబోతున్నారు. ఈ షో తాజాగా ప్రారంభం అవుతోంది. జూన్ 25, జూన్ 26న మొదటి ఎపిసోడ్ ఈటీవీలో ప్రసారం కానుంది. ప్రతి బుధవారం, గురువారం రాత్రి 9:30 నిమిషాలకు టెలికాస్ట్ కాబోతోంది. కాగా ఈ లేటెస్ట్ షోకు సంబంధించిన ఎనర్జిటిక్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

Anchor Soumya Rao Shocking Comments on Hyper Aadi

హైపర్ ఆది ఎనర్జీ డబుల్..
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో కంటెస్టెంట్ల పెర్ఫామెన్స్ ఓ రేంజ్ లో ఉండనుందని హామీనిచ్చారు. మరోవైపు హైపర్ హైది కూడా సరికొత్త పంచులు, ప్రాసలు, కామెడీని పంచేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. ఢీ20 మెగా లాంచ్ ప్రోమోలో హైపర్ ఆది ప్రతి డైలాగ్ డైమండ్ లా పేలింది. ఇంట్రో, రెజీనాపై పేల్చిన పంచులు, తొలి యాంకర్లతో సరదా మాటలు ఆకట్టుకుంటున్నాయి. ఒకవైపు వణుకుపుట్టించే డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో పాటు, హైపర్ ఆది డబుల్ ఎనర్జీతో షో కొనసాగనుందని తెలుస్తోంది.

సౌమ్య రావు తో హైపర్ ఆది ఘర్షణ..
ఢీ షోలో కొన్నాళ్లుగా డ్యాన్స్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ ను కూడా అందిస్తున్న సంగతి తెలిసిందే. సుడిగాలి సుధీర్, వర్షిణి, రష్మీ గౌతమ్ వంటి ప్రముఖ బుల్లితెర స్టార్స్ గతంలో అలరించారు. ఇక లేటెస్ట్ షోలో ఫీమేల్ యాంకర్ గా జబర్దస్త్ సౌమ్యా రావు ఎంట్రీ ఇచ్చింది. కాగా మెగా లాంచ్ ఈవెంట్ లో హైపర్ ఆది, సౌమ్యా రావు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒకరిపై ఒకరు తారాస్థాయిలో పంచులు పేల్చడం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఢీ20 షోకు తనే హైలెట్ అని, తన గ్లామర్ ప్లస్ అవుతుందని సౌమ్యరావు పొగడ్తలకు పోతుంది. దీంతో హైపర్ ఆది గుంటనక్క.. అంటూ కామెంట్ల చేస్తాడు. దాంతో సౌమ్యరావు రెచ్చిపోయి మాట్లాడుతుంది. హైపర్ ఆది బండోడని, పొట్టొడని ధీటుగా బదులిస్తుంది. వీరి కాంబో చాలా రోజుల తర్వాత రిపీట్ అవ్వడంతో మున్ముందు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఢీ20 విశేషాలు..
ఢీ20 సీజన్ లో యాక్టర్, టెలివిజన్ ప్రజెంటర్ నందు, యాంకర్ సౌమ్యారావు హోస్ట్ లు గా వ్యవహరిస్తున్నారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ మేల్ జడ్జీగా, టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రెజీనా కస్సాండ్రా ఫీమేల్ జడ్జీగా వ్యవహరిస్తున్నారు. మెగా లాంచ్ ఈవెంట్ సందర్భంగా రెజీనా అదిరిపోయే పెర్ఫామెన్స్ కూడా ఇచ్చింది. ఇక కంటెస్టెంట్లుగా.. పల్సర్ బైక్ ఝాన్సీ, మణికంఠ మాస్టర్, సుష్మితా అనాలా, జతిన్, రాజు, అభి మాస్టర్, పండు, అన్షు రెడ్డి, జాను లిరి అలించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X