‘తెలుగు ఇండస్ట్రీలో సిండికేట్ నిజమే.. ఆ హీరోయిన్ నా మీదకి కారెక్కించి’
కర్ణాటకకు చెందిన అమ్మాయే అయినప్పటికీ తన అందంతో, వాక్చాతుర్యంతో తెలుగునాట నటిగా, యాంకర్‌గా రాణించింది సౌమ్యారావు నడిగ్. పరభాషా నటి అయినప్పటికీ యాంకరింగ్‌లో తెలుగు వారికి పోటీనిచ్చింది. తెలుగులో టాప్ రేటింగ్‌తో దూసుకెళ్తున్న జబర్దస్త్‌కు యాంకర్‌గా అవకాశం దక్కించుకుని శెభాష్ అనిపించుకుంది. అయితే అనూహ్యంగా జబర్దస్త్‌కు వీడ్కోలు చెప్పి మళ్లీ ఎక్కడా కనిపించలేదు. తాజాగా జబర్దస్త్ ఫేమ్ వర్ష హోస్ట్‌గా వ్యహరిస్తున్న కిస్సిక్ టాక్ షోకు సౌమ్యారావు గెస్ట్‌గా వచ్చి తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
జబర్తస్త్‌కి యాంకర్‌గా
ఇప్పటికే తెలుగు బుల్లితెర మొత్తం కన్నడ నటీనటులతో నిండిపోగా.. చివరికి యాంకర్‌గానూ కన్నడ అమ్మాయిని తీసుకోవడం అప్పట్లో పెద్ద విమర్శలకు దారి తీసింది. అయితే జబర్దస్త్ వేదికపై వచ్చీ రాని తెలుగు మాట్లాడటంతో జనం వెక్కిరించినా, తనపై దారుణంగా ట్రోలింగ్ జరిగినా లైట్ తీసుకుంది. అయితే సౌమ్య జబర్దస్త్‌ను ఎందుకు వీడారు? దీని వెనుక కారణాలేంటీ? అనే దానిపై అప్పట్లో సోషల్ మీడియాలో డిస్కషన్ నడిచింది. తాజాగా వర్షతో జరిగిన పాడ్‌కాస్ట్‌లో వీటికి ఆన్సర్ ఇచ్చింది.

ఆ హీరో నా నెంబర్ తీసుకుని
ప్రోమో ప్రారంభంలోనే సౌమ్యారావు వస్తే ట్రోల్ అవుతుందంటూ స్టార్ట్ చేయడంతో వర్షంపై సౌమ్య మండిపడింది. అందరి పాడ్‌కాస్ట్ నువ్వు చేస్తున్నావ్ కాబట్టి.. నీ పాడ్‌కాస్ట్ నేను చేస్తానంటూ కన్నడంలో ఇంట్రో ఇచ్చింది. అదేంటో వర్షకు అర్ధం కాకపోవడంతో తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసి చెప్పింది సౌమ్యారావు. ఓ పెద్ద హీరో ఫ్లైట్‌లో నీ నెంబర్ తీసుకుని సౌమ్యా నీతో మాట్లాడతానని చెప్పాడు కదా అని వర్ష ప్రశ్నించగా.. నీకు దండం పెడతానురా ఆ మేటర్ మాత్రం ఇప్పుడు వద్దని చెప్పింది వర్ష.
బస్టాండ్‌లో పడుకున్నాం
'పేదరికం అనేది చాలా బ్యాడ్, నాన్న అనే వాడికి పిల్లల్ని పెంచే శక్తి లేనప్పుడు పుట్టించకూడదు. నా ఫాదర్ గురించి ఏం అడగొద్దు.. అమ్మ నా కోసం చాలా కష్టాలు పడ్డారు. మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే పక్కింటి వాళ్లు డోర్స్ క్లోజ్ చేసుకునేవాళ్లు. అర్ధరాత్రి 2 గంటలకు నేను, మా అమ్మ, సోదరుడు బస్టాండ్‌లో పడుకున్నాం.. రెండు రోజులు నేను అన్నం తినలేదు. తిరుపతి దైవ దర్శనానికి వెళితే నాకు ఎప్పుడు ఫుడ్ పెడతారు? అని ఎదురుచూసే దానిని' అని తన పేదరికం గురించి తెలిపింది సౌమ్యారావు.
సిండికేట్ నిజమే
'మీరు హార్డ్ వర్కింగ్‌కి ఇంపార్టెన్స్ ఇస్తారా? లక్‌కి ఇస్తారా? అని వర్ష అడగ్గా.. హార్డ్ వర్క్ అనేది ఏం పనికిరాదని, లక్కే ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఫీల్డ్‌లో ఉన్న వాళ్లందరికీ టాలెంట్ ఉందా? నువ్వు కరెక్ట్‌గా చెప్పు. కొందరు లక్ పరంగా, కొంతమంది జిమ్మిక్స్ చేసి వచ్చారు, వస్తారు, వస్తూనే ఉంటారు. లాస్ట్ టైం ఉదయభాను గారు ఓ ఫంక్షన్‌లో ఓ సిండికేట్ ఉందని చెప్పారు. అది 100 శాతం నిజం. నేను సీరియల్‌లో చేస్తున్నప్పుడు హీరోయిన్ , హీరో మధ్య వ్యవహారం నడుస్తోంది. షూటింగ్ అంతా ప్యాకప్ అయిపోయిన తర్వాత హీరో నాతో ఏదో మాట్లాడుతుండగా.. హీరోయిన్ రివర్స్ గేర్‌లో కారును తీసుకొచ్చి నన్ను గుద్దేసింది. నా జీవితంలో అదొక భయానక అనుభవం' అని ఇండస్ట్రీలోని పరిస్ధితులను తెలిపింది
అమ్మ నాతో ఉంటే బాగుండేది
ఒకరోజు నేను పెద్ద హీరోను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లాలి.. ఆ తొందరలో స్పీడ్‌గా వెళ్తుండగా కారుకి యాక్సిడెంట్ అయ్యింది. చాలా రక్తం పోయింది, చాలా కష్టాలు చూశాను. అమ్మకి బ్రెయిన్ క్యాన్సర్ రాకపోయుంటే బాగుండేదని సౌమ్యారావు కన్నీటి పర్యంతమయ్యారు. మరి సౌమ్యారావును కారుతో ఢీకొట్టిన హీరోయిన్ ఎవరు? ఎందుకు జబర్దస్త్‌ను ఆమె వదిలేసింది? సౌమ్యారావును తొక్కేసిన సిండికేట్ ఏంటీ? అనేది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











