వాళ్లలా బాడీ చూపించాల్సిన గతి పట్టలేదు .. అనసూయ, రష్మీలపై జబర్దస్త్ యాంకర్ సంచలనం

తెలుగు నాట స్టార్ కామెడీ షోగా మన్ననలు అందుకుంటూ టాప్ రేటింగ్‌లో దూసుకెళ్తోంది జబర్దస్త్. దాదాపు 13 ఏళ్లుగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది జబర్దస్త్. కమెడియన్లు, యాంకర్లు, జడ్జిలు మారినా జబర్దస్త్ ఇప్పటికీ తన పాపులారిటీని కాపాడుకుంటూనే వస్తోంది. జబర్దస్త్ మాదిరిగా పలు ఛానెల్స్ కార్యక్రమాలకు రూపకల్పన చేసి చేతులు కాల్చుకున్నాయి. కొందరు జబర్దస్త్ టీమ్ మెంబర్స్ వేరే ఛానెల్స్‌కి వెళ్లి అక్కడ అడ్జెస్ట్ కాలేక తిరిగి సొంతింటికి వచ్చేశారనే టాక్ ఉంది.

జబర్దస్త్‌‌కు తొలి నుంచి అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్‌లు యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు. అనసూయ జబర్దస్త్‌కు, రష్మి ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు హోస్ట్ చేసేవారు. గ్లామర్ షోతో పాటు మధ్య మధ్యలో వీరు కమెడియన్లపై వేసే పంచ్‌లకు జనం నవ్వుకునేవారు. జబర్దస్త్ ఫేమ్‌తో వీరు బాగా పాపులర్ కావడంతో పాటు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు. సినిమాల్లో అనసూయ భరద్వాజ్ బిజీ కావడంతో పాటు పలు కారణాలతో జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు.

Anchor Sowmya Rao Nadig made sensational comments on anasuya bharadwaj and rashmi gautam

తనకు జీవితాన్ని, నేమ్‌ను ఫేమ్‌ను ఇచ్చిన జబర్దస్త్‌ను అనసూయ భరద్వాజ్ ఎందుకు వీడారన్న దానిపై సరైన కారణాలు తెలియనప్పటికీ సినిమాల్లో బిజీ కావడం వల్లే బుల్లితెరకు ఈ స్టార్ యాంకర్ దూరమయ్యారని టెలివిజన్ వర్గాల్లో చర్చ నడుస్తుంటుంది. ఇక సోషల్ మీడియాలో రకరకాల కథనాలు నిత్యం వైరల్ అవుతుంటాయి. అనసూయ వెళ్లిపోవడంతో ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అనే చర్చ జరిగింది. ఈ దశలో కర్ణాటకకు చెందిన బుల్లితెర నటి సౌమ్యరావును యాంకర్‌గా తీసుకొచ్చారు.

తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో కన్నడ నటులదే హవా. ఏ ఛానెల్‌లో, ఏ సీరియల్ చూసినా వాళ్లే కనిపిస్తారు. ఇక గతేడాది బిగ్‌బాస్ తెలుగు 8లో నలుగురు కన్నడ నటులు కంటెస్టెంట్స్‌గా పార్టిసిపేట్ చేయడంతో పాటు టైటిల్‌ను కైవసం చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. అలాంటి తెలుగు టాప్ ప్రోగ్రామ్‌కు యాంకర్‌గా ఓ కన్నడ నటిని తీసుకురావడం చర్చనీయాంశమైంది. అయితే వచ్చి రానీ తెలుగుతో పాటు తన క్యూట్ లుక్స్‌తో జబర్దస్త్‌ను నడిపించింది సౌమ్యరావు.

ఎంతో కష్టపడి తన మార్క్ చూపించడానికి ఆమె ప్రయత్నించింది. తెలుగు రాకపోవడంతో జనం వెక్కిరించినా, తనపై దారుణంగా ట్రోలింగ్ జరిగినా లైట్ తీసుకుంది. కానీ అనూహ్యంగా సౌమ్యరావు జబర్దస్త్‌ను వీడటం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ప్లేస్‌లో బిగ్‌బాస్ ఫేమ్ సిరి హనుమంత్ ఈ టాప్ షోకు యాంకరింగ్ బాధ్యతలు చేపట్టారు. అయితే సౌమ్య జబర్దస్త్‌ను ఎందుకు వీడారు? దీని వెనుక కారణాలేంటీ? అనే దానిపై అప్పట్లో సోషల్ మీడియాలో డిస్కషన్ నడిచింది.

ఇటీవల ఓ తెలుగు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌమ్యరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే రష్మి, అనసూయల మాదిరిగా మీరు గ్లామర్ షో చేయకపోవడం వల్లే వెనుకబడ్డారా? అని యాంకర్ ప్రశ్నిస్తాడు. తను వారిలా గ్లామర్ షో చేయాల్సిన అవసరం లేదని గ్లామర్ షో చేయకపోయినా నాకు అవకాశాలు వస్తాయని , ఒకరితో నాకు సంబంధం లేదని ఘాటుగా బదులిచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X