‘భార్య లేకపోతే అతని చేతులు నా మీదే.. చుట్టాలు వస్తే తలుపులు వేసేసి’

తెర మీద వినోదం పంచే తారల జీవితాలు పైకి కనిపించేలా అందంగా ఉండవు.. దాని వెనుక ఎంతో కష్టం, ఎన్నో విషాదాలు దాగి ఉంటాయి. ఎన్ని కష్టాలు ఉన్నా అవన్నీ కెమెరాకు వెనుకే.. ఒకసారి కెమెరా ముందుకు వస్తే బాధలన్నీ పంటి బిగువున భరిస్తూ ప్రేక్షకులకు వినోదం పంచాల్సిందే. బుల్లితెర అయినా, వెండితెర అయినా నటీనటుల లక్ష్యం ఇదే. పలు ఇంటర్వ్యూలలో వారు తమ కన్నీటిగాథలను బయటపెడుతుంటారు. తాజాగా బుల్లితెర యాంకర్, నటి సౌమ్యారావు నడిగ్ తన జీవితంలోని కష్టాలు, కెరీర్‌లో పడ్డ ఇబ్బందులను గురించి పంచుకున్నారు. జబర్దస్త్ వర్ష నిర్వహిస్తోన్న కిస్సిక్ టాక్ షోకు గెస్ట్‌గా హాజరైన సౌమ్యారావు తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులు, ఇతర విషాదాలను బయటపెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే..

జబర్దస్త్ యాంకర్‌గా క్రేజ్
కర్ణాటకకు చెందిన సౌమ్యారావు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సీరియల్స్‌లో నటించారు. తెలుగులో వరుస అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మకు ఏకంగా జబర్దస్త్‌కు యాంకర్‌గా చేసే అవకాశం దక్కింది. స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్.. జబర్దస్త్‌ను వీడటంతో ఆమె స్థానంలో సౌమ్యారావుకు యాంకరింగ్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే తెలుగు బుల్లితెరపై కన్నడ నటీనటుల ఆధిపత్యం నేపథ్యంలో యాంకరింగ్‌కు కూడా కన్నడ వాళ్లనే పట్టుకు రావడం అప్పట్లో విమర్శలకు దారి తీసింది. తెలుగులో అంతగా పట్టులేకపోవడంతో పట్టుబట్టి నేర్చుకున్న సౌమ్యారావు తనపై జరుగుతున్న ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. అయితే అనూహ్యంగా జబర్దస్త్‌ను వీడారు సౌమ్యారావు. తర్వాత ఆమె ఎక్కడా కనిపించలేదు. తాజాగా వర్ష టాక్ షోలో ప్రత్యక్షమై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Anchor Sowmya Rao Nadig shares her bad Experience with Male lawyer in a podcast hosted by Jabardasth Varsha

యాటిట్యూడ్ చూపించేవాళ్లే
'కొంతమంది వ్యక్తులు ఆర్టిస్ట్ అవ్వగానే గిన్నిస్ రికార్డ్ కొట్టినట్లుగా యాటిట్యూడ్ చూపిస్తారు. నేను వచ్చినప్పుడు లేచి నిలబడాలి, అందరూ సలాం కొట్టాలి అనుకుంటారు. అలాంటి యాటిట్యూడ్ చూపించినవాళ్లే ఇప్పుడు టాప్ పొజిషన్‌లో ఉన్నారు. షూటింగ్‌ ఉంటే కారులో, క్యాబ్‌‌లో అవసరమైతే ఆటోలోనైనా వెళ్లిపోతా. ఇండస్ట్రీ నాకు ఇచ్చిన దాని కంటే నేను పొగొట్టుకున్నదే ఎక్కువ. అదృష్టం అనేది ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్. జబర్దస్త్‌లో అవకాశం కోల్పోయినందుకు బాధగా లేదు.. అవకాశాలు వస్తుంటాయి, పోతుంటాయి' అని సౌమ్యారావు తెలిపింది.

రక్తం కారుతున్నా ఇంటర్వ్యూకి వెళ్లా
'కన్నడ ఇండస్ట్రీలో న్యూస్ రీడర్‌గా, యాంకర్‌గా ఎంతో కష్టపడ్డాను.. ఒకే రోజులో మూడు ఛానెల్స్‌లో పనిచేసేదానిని. ఒకరోజు నేను పెద్ద హీరోని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యింది. కాలుకి దెబ్బ తగిలి రోడ్డుపై నెత్తురు పారినా అలాగే ఆ హీరోని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లా. చాలా పేదరికం నుంచి వచ్చా.. డబ్బు లేదనే ఉద్దేశ్యంతో అమ్మను తక్కువగా చూశారు. మా ఇంటికి చుట్టాలు వస్తే పక్కింటిలో వాళ్లు డోర్స్ క్లోజ్ చేసుకునేవారు. ఎందుకంటే అమ్మ ఎక్కడ పాలు, టీపోడి అడుగుతారోనని భయం' అని సౌమ్యారావు గుర్తుచేసుకున్నారు.

మన బాధలు ఎవరితో పంచుకోవద్దు
'నా తండ్రి ఊరంతా అప్పులు చేస్తే అప్పులు ఇచ్చిన వాళ్లు ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసేవారు. మీ అమ్మాయి ఉందా? పెద్ద మనిషి అయ్యిందా? అంటూ అసభ్యంగా మాట్లాడేవారు. పార్ట్ టైం జాబ్ చేసుకుని చదువుకున్నా .. లాయర్ దగ్గర పనిచేస్తూ కాలేజ్ ఫీజు కట్టుకునే దానిని. మన కష్టాలు, అవసరాలు ఎవరితోనూ పంచుకోకూడదు, లేదంటే మనల్ని వాడుకుంటారు. కాలేజ్ అయిన వెంటనే లాయర్ దగ్గర పనిచేసే దానిని.. అతను అసభ్యంగా తాకడం, నేను టైప్ చేసి చూపిస్తానని చేతులు పట్టుకోవడం చేసేవాడు. ఆ లాయర్ భార్య, కూతురు బయటికి వెళ్లగానే అతనే నాతో మిస్ బిహేవ్ చేసేవాడు' అని సౌమ్యా రావు చెప్పారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X