అఘోరిగా మారిన తెలుగు యాంకర్.. ఎందుకంటే? (ఫొటోలు)
యంగ్ అండ్ టాలెంటెడ్ యాంకర్ స్రవంతి చొక్కారపు లేటేస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. టెలివిజన్ ప్రజెంటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మోడల్ గా, నటిగానూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ గా మంచి ఆఫర్లు అందుకుంటోంది. 2009 నుంచి స్రవంతి చొక్కారపు టెలివిజన్ రంగంలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. మోడల్ గా తన కెరీర్ ను ప్రారంచి ప్రస్తుతం యాంకర్ గా, నటిగా అవకాశాలు అందుకుంటోంది.
స్రవంతి చొక్కారపు ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో కొన్ని ఎపిసోడ్ లకు యాంకర్ గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులకు మరింతగా దగ్గరయ్యారు. అలాగే ప్రేక్షకాదరణ పొందిన మరొక టీవీ ప్రోగ్రామ్ 'శ్రీదేవి డ్రామా కంపెనీ'కి కూడా వ్యాఖ్యతగా వ్యవహరించి బుల్లితెర ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఈ రెండు షోల కంటే ముందు పలు యూట్యూబ్ ఛానెళ్లు, డైలీ కల్చర్, ఫ్యామిలీ ఫోకస్, జెమినీ టీవీలో యాంకర్ గా వర్క్ చేసింది. సెలబ్రెటీలను ఇంటర్వ్యూలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

2021 నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇమ్మాన్యుయేల్ టీమ్ లోనూ కనిపించి సందడి చేసింది. ఇక ఈమె బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ సీజన్ లోనూ పార్టిసీపేట్ చేసింది. కానీ ఈ సీజన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కావడంతో ఆమె స్టార్ డబ్ కాస్తా బ్రేక్ లు పడ్డాయి. అదే రెగ్యులర్ సీజన్ లో కనిపించి ఉంటే మాత్రం ఇప్పుడామె రేంజ్ వేరేలా ఉండేది. ఇక ఇదిలా ఉంటే.. స్రవంతి చొక్కారపు సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటారు. ఆమె సంబంధించిన ఫొటోలను, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా స్రవంతి చొక్కారపు లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె అఘోరి వేషం కట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడూ బ్యూటీఫుల్ లుక్స్ లో మెరిసే ఈమె అఘోరిగా మారిందేంటని షాక్ అవుతున్నారు. దానికి ఆమె బదులిచ్చింది. ఓదెల2 చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా అఘోరి వేషధారణలో కనిపించినట్టు చెప్పుకొచ్చింది. కానీ ఆమె ఫొటోలు మాత్రం షాకింగ్ గా ఉన్నాయి. సంపత్ నంది సమర్పణలో తమన్నా భాటియా హీరోయిన్ ఓదెల2 చిత్రం ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతం ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు.
ఇక స్రవంతి చొక్కారపు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూ తన అభిమానులను ఖుషి చేస్తుంటుంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే అఘోరి ఫొటోలను ఫ్యాన్స్ తో పంచుకుంది. పెద్దపెద్ద రుద్రాక్ష మాలలు, కాషాయ బట్టలు, నామాలు పెట్టుకొని గంభీరంగా కనిపించింది. ఆమె లుక్ పై నెటిజన్లు ఇంట్రెస్టింగ్ గా స్పందిస్తున్నారు.లైక్స్ కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. స్రవంతి చొక్కారపు ప్రశాంత్ ను పెళ్లి చేసుకుంది. వారిద్దరూ పవన్ కళ్యాణ్ అభిమానులు కావడంతో తమ బిడ్డకు అకీరా నందన్ అని పేరు పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











