షాకిచ్చిన టాలీవుడ్ స్టార్ యాంకర్ .. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ పోస్ట్ డిలీట్, ఏకీపారేస్తోన్న నెటిజన్లు
సెలబ్రెటీలు అనేవారు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలి. మాటలు , చేతలు ఇలా ఏం చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయాలి. ఏమాత్రం తేడా వచ్చిన పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వీళ్లు సోషల్ మీడియాలో పెట్టే చిన్న పోస్ట్ కూడా తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. తాజాగా టాలీవుడ్ స్టార్ యాంకర్ ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సంచలన పోస్ట్ పెట్టగా అది కాస్తా వైరల్ అయ్యింది. అయితే కాసేపటికే ఈ పోస్ట్ డిలీట్ చేయడంతో ఇండస్ట్రీలో అది చర్చనీయాంశమైంది. ఆమె ఎవరు? ఇన్‌స్టాలో ఏం పోస్ట్ పెట్టింది? ఎందుకు డిలీట్ చేసింది? ఈ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ రియాలిటీ షో పాపులర్ అయిన వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు. ఆంధ్రప్రదేశ్‌లోని కదిరిలో పుట్టి పెరిగిన ఈమె 2009 చదువు పూర్తి చేసి మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత యాంకర్‌గా మారి పలు టీవీ ఛానెల్స్‌లో హోస్ట్‌గా, ఇంటర్వ్యూలు చేసింది. ఈ క్రమంలోనే జబర్దస్త్‌లో అవకాశం దక్కించుకున్న స్రవంతి.. ఈ పాపులారిటీతోనే బిగ్‌బాస్‌లో ఛాన్స్ పట్టేసింది. నా తడాఖా ఏంటో చూపిస్తానని లాంచింగ్ ఎపిసోడ్ రోజున బీరాలు పలికిన స్రవంతి.. తీరా హౌస్‌లో అడుగుపెట్టాక.. అఖిల్, అజయ్‌ల సేవలోనే తరించింది.

నిజానికి ఆమె ఇండస్ట్రీకి వచ్చాక ఎన్నో ఇబ్బందులు పడింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన ఇంటర్వ్యూ స్రవంతి జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత పుష్ప రిలీజ్ సమయంలో అల్లు అర్జున్, సుకుమార్‌లను రాయలసీమ స్లాంగ్‌లో ఆమె చేసిన ఇంటర్వ్యూ బాగా వైరల్ అయ్యింది. తర్వాత పలు సినిమా ఈవెంట్లు, షోలతో బిజీ అయిన ఈమె ప్రశాంత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
కొద్దిరోజుల క్రితం తెలుగు రాష్ట్రాలను , ముఖ్యంగా విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు చలించిపోయారు. తన స్థాయికి తగిన విధంగా రూ. లక్షను ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందంతో మెరిసిపోయే స్రవంతి చొక్కారపు.. హాట్ హాట్ ఫోటో షూట్‌లతో సోషల్ మీడియాలో సెగలు రేపుతుంటారు. చీర అయినా, మోడ్రన్ డ్రెస్సులైనా పర్ఫెక్ట్ మ్యాచింగ్‌తో గ్లామర్ ట్రీట్ ఇస్తుంటారు స్రవంతి.

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టీవ్‌గా ఉండే స్రవంతి నిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. ఆసుపత్రి బెడ్‌పై దీనంగా ఉన్న ఫోటోలనున షేర్ చేసిన ఆమె ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తాను గడిచిన 40 రోజుల నుంచి విపరీతంగా బ్లీడింగ్ సమస్యను ఎదుర్కొంటున్నానని.. ఎన్నో మందులు వాడినా ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపింది. ఇటీవల ఓ రోజంతా కంటిన్యూగా వర్క్ చేయడంతో విపరీతమైన కడుపునొప్పి రావడంతో డాక్టర్‌కు కలవగా సర్జరీ వరకు వెళ్లాల్సి వచ్చిందని స్రవంతి పేర్కొంది. ఆడవాళ్లు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆమె సలహా ఇచ్చింది.
స్రవంతి పరిస్ధితి చూసి ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు షాక్ అయ్యారు. స్రవంతి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించారు. కానీ ఏమైందో ఏమో కానీ ఆదివారం స్రవంతి ఇన్‌స్టాగ్రామ్‌లో హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫోటోలు కనిపించడం లేదు. ఆమె ఎందుకిలా చేసిందో అర్ధం కాక నెటిజన్లు మండిపడుతున్నారు. సానుభూతి పొందాలని అనుకుంటున్నావా అంటూ ట్రోలింగ్‌కు దిగారు. దీనిపై స్రవంతి స్వయంగా స్పందిస్తేనే ఈ చర్చకు తెరపడుతుంది.


Click it and Unblock the Notifications











