హాస్పిటల్ నుంచి ఇంటికి .. మళ్లీ మొదలెట్టిన తెలుగు స్టార్ యాంకర్
తెలుగులో ఫిమేల్ యాంకర్లదే హవా . సుమ, ఝాన్సీ, శిల్పా చక్రవర్తి, అనితా చౌదరి, అనసూయ, రష్మి, శ్రీముఖి, శ్యామల వంటి వారు ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. సినిమా ఈవెంట్స్, షోలు, ఇంటర్వ్యూలు ఇలా ఎక్కడ చూసినా వీళ్లు కనిపిస్తారు. కొత్తగా యాంకరింగ్‌లోకి వచ్చే అమ్మాయిలు కూడా ఎంతో పోటీని తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది. అలా టాలీవుడ్‌లో అడుగుపెట్టి యాంకర్‌గా రాణిస్తున్నారు స్రవంతి చొక్కారపు.
ఆంధ్రప్రదేశ్‌లోని కదిరిలో పుట్టి పెరిగిన ఈమె 2009లో చదువు పూర్తి చేసి మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది స్రవంతి. ఆ తర్వాత యాంకర్‌గా మారిన ఆమె పలు టీవీ ఛానెల్స్‌లో హోస్ట్‌గా, ఇంటర్వ్యూలు చేసింది. ఈ క్రమంలోనే ఈటీవీలో ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో జబర్దస్త్‌లో అవకాశం దక్కించుకున్న స్రవంతి.. ఈ పాపులారిటీతోనే బిగ్‌బాస్ తెలుగునూలో ఛాన్స్ పట్టేసింది. తీరా హౌస్‌లో అడుగుపెట్టాక.. అఖిల్, అజయ్‌ల సేవలోనే తరించి నెగిటివిటీ మూటగట్టుకుంది.

ఈ క్రమంలో సంచలన దర్శకుడు ఆర్జీవీతోనూ, పుష్ప రిలీజ్ సమయంలో అల్లు అర్జున్, సుకుమార్‌లతోనూ ఆమె చేసిన ఇంటర్వ్యూ బాగా వైరల్ అయ్యింది. తర్వాత పలు సినిమా ఈవెంట్లు, షోలతో బిజీ అయిన ఈమె ప్రశాంత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నిజానికి వీరి వివాహాన్ని రెండు కుటుంబాలు అంగీకరించలేదు. ఎన్నో కష్టాలు పడి తిరిగి కుటుంబానికి చేరువయ్యారు స్రవంతి.
కొద్దిరోజుల క్రితం తెలుగు రాష్ట్రాలను , ముఖ్యంగా విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు రూ. లక్షను ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నారు స్రవంతి . హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందంతో మెరిసిపోయే స్రవంతి చొక్కారపు.. హాట్ హాట్ ఫోటో షూట్‌లతో సోషల్ మీడియాలో సెగలు రేపుతుంటారు. చీరల్లో పద్దతిగా కనిపిస్తూనే మెడ్రన్ డ్రెస్సుల్లో అంతే హాట్‌గా కవ్విస్తుంటారు.
కొద్దిరోజుల క్రితం ఆసుపత్రి బెడ్‌పై దీనంగా ఉన్న ఫోటోలనున షేర్ చేసిన ఆమె కలకలం రేపింది. తాను గడిచిన 40 రోజుల నుంచి విపరీతంగా బ్లీడింగ్ సమస్యను ఎదుర్కొంటున్నానని.. ఎన్నో మందులు వాడినా ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపింది. ఆడవాళ్లు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆమె సలహా ఇచ్చింది. కట్ చేస్తే కొద్దిగంటలు తిరిగే సరికి స్రవంతి పెట్టిన పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించలేదు.
ఆరోగ్యం కుదటపడటంతో ఆమె తిరిగి ఇంటికి చేరుకున్నారు. తొలి నుంచి పూజలు , వ్రతాలను ఇష్టంగా జరుపుకునే స్రవంతి .. ఆసుపత్రి నుంచి వచ్చాక కార్తీక సోమవారం వ్రతాన్ని ఆచరించారు. సాయంత్రం ఇంట్లోనే దేవుడి గదిలో కార్తీక దీపాన్ని వెలిగించి దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఏది ఏమైతేనేం స్రవంతి క్షేమంగా ఇంటికి తిరిగి రావడంతో ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











