మళ్లీ తెగించిన యాంకర్ స్రవంతి: ఓర్నాయనో ఆ డ్రెస్సు, ఫోజులు చూశారంటే!
తెలుగులో ప్రస్తుతం ఎంతో మంది యాంకర్లుగా అలరిస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే టీవీ రంగానికి పరిమితం అవుతోన్నారు. మిగిలిన వాళ్లంతా సినిమా సంబంధిత కార్యక్రమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్నారు. అందులో రాయలసీమ చిన్నది స్రవంతి చోకారపు ఒకరు. ఎప్పుడో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ భామ.. పెద్దగా ఆఫర్లను అందుకోలేకపోయింది. కానీ, బిగ్ బాస్ షోలోకి ఎంటరైన తర్వాత క్రేజ్ పెంచుకుని ఆఫర్లను పట్టేస్తోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ స్రవంతి ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. ఇక, తాజాగా ఆమె కొన్ని పిక్స్ వదిలింది. అవి మీరే చూడండి!

అలా వచ్చింది.. ఫేమస్ కాలే
హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటోన్న సమయంలో ఓ సీనియర్ హీరో సినిమా షూటింగ్ చూసేందుకు వెళ్లిన స్రవంతి.. అనుకోకుండా అందులో నటించాల్సి వచ్చింది. అలా సినిమా రంగానికి పరిచయమైన ఈ చిన్నది.. ఆ తర్వాత ఎన్నో అవకాశాలను సొంతం చేసుకుంది. ఇలా చాలా చిత్రాల్లో నటించింది. కానీ, స్రవంతికి అనుకున్న స్థాయిలో గుర్తింపు మాత్రం దక్కలేదనే చెప్పాలి.

యాంకర్‌గా మారి... పాపులర్
సినిమాల్లో రాణించలేకపోయిన స్రవంతి చోకారపు.. ఆ తర్వాత యాంకర్‌గా మారిపోయింది. ఇందులో భాగంగానే బుల్లితెరపై చాలా షోలను కూడా నడిపించింది. ఆమె చేసిన వాటిలో 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' మాత్రమే గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారిన స్రవంతి సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లతో యమ పాపులర్ అయిపోయింది.

తల్లైనా తగ్గకుండా దూకుడు
యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించిన సమయంలోనే స్రవంతి.. ప్రశాంత్ అనే వ్యక్తితో ప్రేమాయణం సాగించింది. అయితే, ఆమె ఇంట్లో ఒప్పుకోకపోవడంతో మొదట వీళ్లు సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా దూరంగానే ఉంటూ.. కొన్నేళ్లకు పెద్దలను ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీళ్లకు ఓ బాబు జన్మించాడు. అయినా ఆమె దూకుడు ప్రదర్శిస్తోంది.

బిగ్ బాస్ ప్లస్.. యమ బిజీ
గత ఏడాది ఆరంభంలో యాంకర్ స్రవంతి చోకారపు బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఎన్నో అంచనాలతో షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అంతగా ఆకట్టుకోలేక మధ్యలోనే బయటకు వచ్చేసింది. కానీ, ఈ షో వల్ల క్రేజ్ పెంచుకుని ఆఫర్లను అందుకుంటోంది. అయితే, ఈ మధ్య ఆరోగ్య సమస్యలతో ఆమె గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్లీ సత్తా చాటుతోంది.

అందులో మాత్రం సందడి
ఏకధాటిగా సినిమా ఫంక్షలు, ఇంటర్వ్యూలు, షోలు చేస్తూ కెరీర్ పరంగా బిజీగా గడుపుతోన్నా.. యాంకర్ స్రవంతి చోకారపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను విశేషంగా పెంచుకుంటూ సాగుతోంది.

గ్లామర్ షోతో సెగలు రేపేలా
సోషల్ మీడియాలో చాలా కాలంగా విపరీతంగా హడావిడి చేస్తోన్న స్రవంతి చోకారపు.. ఎక్కువగా అందాలను ఆరబోస్తూ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు అప్పుడప్పుడు గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో ఎక్కువగా క్లీవేజ్ షో ఫొటోలు ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లో నిలుస్తూ తెగ హైలైట్ అవుతోంది.

స్రవంతి హాట్ పిక్స్ వైరల్
యాంకర్ స్రవంతి చోకారపు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె వైట్ కలర్ బ్యాక్‌లెస్ డ్రెస్‌లో క్లీవేజ్ షో చేస్తూ ఘాటుగా ఫోజులు ఇచ్చింది. ఫలితంగా ఈ ఫొటోల్లో ఆమె ఎద, బ్యాక్ అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవన్నీ భారీ స్థాయిలో వైరల్ అవుతోన్నాయి.


Click it and Unblock the Notifications











