ఇండియాలో దిగిందో లేదో .. మళ్లీ మొదలెట్టేసిన స్టార్ యాంకర్ , ఆ లుక్ వైరల్
తెలుగు తెరపై ఉన్న స్టార్ యాంకర్‌లలో స్రవంతి చొక్కారపు ఒకరు. సుమ, అనసూయ, రష్మి, శ్రీముఖిలకు ఈమె గట్టి పోటీ ఇస్తోంది. స్రవంతిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. హీరోయిన్‌లనే మించే అందంతో కట్టిపడేస్తోన్న స్రవంతి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. తాజాగా ఆమె పెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఈ ముద్దుగుమ్మ స్థానికంగానే చదువుకుని అనంతరం హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. స్రవంతికి చిన్నప్పటి నుంచి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన పిచ్చి. ఆయనకు వీరాభిమాని కావడంతో తన కొడుక్కి కూడా అకీరా నందన్ అని పేరు పెట్టుకున్నారు. అంతేకాదు.. తన బోటిక్‌కు అకీరా లేబిల్ అని పెట్టుకుని మరింత సంచలనం సృష్టించారు.

అలాగే తన బోటిక్ నుంచి పవన్‌కు కొన్ని ఔట్ ఫిట్స్‌ను సైతం పంపినట్లు స్రవంతి పలుమార్లు తెలిపారు. తాను పంపించిన వాటిని పవన్ కళ్యాణ్ ధరించడం ఎంతో ఆనందంగా ఉందని స్రవంతి తెలిపారు. రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండటంతో ఆయనను వ్యక్తిగతంగా కలవలేకపోయానని స్రవంతి ఆవేదన వ్యక్తం చేశారు. యాంకర్‌గా సినిమాలు, ఈవెంట్స్, ఇంటర్వ్యూలలో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయిస్తుంటారు స్రవంతి.
కొద్దిరోజుల క్రితం ఏపీలో వరదలు పోటెత్తి ప్రజలు నిరాశ్రయులు కావడంతో స్రవంతి తట్టుకోలేకపోయారు. వెంటనే తన వంతు సాయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ లక్షను విరాళంగా ప్రకటించింది. తర్వాత ఏమైందో ఏమో కానీ ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫోటోలను, వీడియోలను షేర్ చేసి అభిమానులకు షాకిచ్చింది. తనకు దాదాపు 40 రోజులకు పైగా బ్లీడింగ్ అవుతోందని తాను చేసిన తప్పుని ఏ ఆడపిల్లా చేయొద్దని స్రవంతి పేర్కొన్నారు.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత స్రవంతి చొక్కారపు తిరిగి తన రెగ్యులర్ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. ఆరోగ్యం సహకరించకపోయినా కార్తీక సోమవారం పూజ చేసి శెభాష్ అనిపించుకున్నారు. ప్రస్తుతం మలేషియా, దుబాయ్ తదితర ప్రాంతాల్లో వెకేషన్ ఎంజాయ్ చేసిన స్రవంతి చొక్కారపు దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఫారిన్ ట్రిప్ ముగించుకుని ఇటీవలే ఆమె తిరిగి భారతదేశానికి చేరుకున్నారు.
ఇండియాకు వచ్చిన తర్వాత తీర్ధయాత్రలు మొదలెట్టారు స్రవంతి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె.. శేషాచలం కొండల్లోని ఆకాశగంగ , పాపనాశనం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవస్థానం తదితర ప్రాంతాలను సందర్శించారు. తన తిరుమల యాత్రకు సంబంధించిన ఫోటోలను పంచుకున్న స్రవంతి ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











