యాంకర్ స్రవంతి ఓవర్ డోస్ ట్రీట్: ఈ డ్రెస్ ఏంటో.. ఆ ఫోజులేంటో.. చూస్తే షాకే!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది భామలు.. శృతి మించిన గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోన్నారు. తద్వారా నిత్యం వార్తల్లో ఉండడంతో పాటు ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. అదే సమయంలో అవకాశాలను కూడా భారీ స్థాయిలోనే దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ యాంకర్ స్రవంతి చోకారపు ఒకరు.
చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామ.. సుదీర్ఘ కాలం ప్రయాణించిన తర్వాతనే గుర్తింపును అందుకుంది. ఈ మధ్య కాలంలో మరింతగా హల్‌చల్ చేస్తూ హైలైట్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా స్రవంతి సోషల్ మీడియాలో దారుణమైన ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి మరి!

అప్పుడెప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ
రాయలసీమ నుంచి హైదరాబాద్‌లో ఉద్యోగాన్వేషణకు వచ్చిన స్రవంతి చోకారపు.. అనుకోకుండా ఓ సీనియర్ హీరో సినిమాలో నటించాల్సి వచ్చింది. ఆ మూవీలో మెప్పించడంతో ఆమెకు కొన్ని ఆఫర్లు దక్కాయి. అలా చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను చేసింది. కానీ, స్రవంతికి కావాల్సిన గుర్తింపు మాత్రం దక్కలేదు. దీంతో ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటోంది.

యాంకర్‌గా మారింది.. ఫీలాన్స్‌గా
చాలా సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు దక్కకపోవడంతో స్రవంతి చోకారపు బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో చాలా షోలను కూడా నడిపించింది. ఆమె చేసిన వాటిలో 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' పేరు తెచ్చింది. ఇవి మాత్రమే కాదు.. సినిమా ఫంక్షన్లు, సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లలోనూ హోస్టింగ్ చేస్తూ ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారింది.

ప్రేమ పెళ్లి... కెరీర్‌ను ఆపకుండా
గ్లామర్ ఫీల్డులోకి రాకముందే స్రవంతి చోకారపు.. ప్రశాంత్ అనే వ్యక్తితో ప్రేమలో పడిపోయింది. అయితే, ఆమె ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో వీళ్లిద్దరూ సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత దూరంగా ఉన్న వీళ్లిద్దరూ.. కొన్నేళ్లకు పెద్దలను ఒప్పించి మళ్లీ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఓ బాబు కూడా జన్మించాడు. తర్వాత మళ్లీ ఆమె కెరీర్ సాగిస్తోంది.

బిగ్ బాస్ ఛాన్స్.. ఫుల్ స్పీడుతో
యాంకర స్రవంతి చోకారపు ఇటీవలి కాలంలో వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమెకు ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం దక్కింది. ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా ఎలిమినేట్ అయిపోయింది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే
కెరీర్ పరంగా గుర్తింపును దక్కించుకోకున్నా.. స్రవంతి చోకారపు హైలైట్ అయిందంటే దానికి కారణం సోషల్ మీడియానే అని చెప్పుకోవాలి. ఇందులో ఈ అమ్మడు చాలా యాక్టివ్‌గా ఉండడం వల్లే క్రేజ్‌ను సంపాదించుకుంది. అందుకే దీని ద్వారా తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తూ మరింత హైలైట్ అవుతోంది.

అందాలను ఆరబోస్తోన్న బ్యూటీ
ఎంతో కాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోన్న స్రవంతి చోకారపు.. ఎక్కువ శాతం అందాలను ఆరబోస్తూ ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు అప్పుడప్పుడు హాట్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్స్ ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తన హాట్ షోతో నిత్యం వార్తల్లోనే హెడ్‌లైన్ అవుతోంది.

యమ హాట్ ఫొటోలతో సందడి
యాంకర్ స్రవంతి చోకారపు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె క్లీవేజ్ షో చేసే డ్రెస్‌ను ధరించింది. అలాగే, నిల్చుని పడుకుని ఘాటు ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె ఎద అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా ఇవి వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











