హైదరాబాద్‌లో 20 కోట్ల లగ్జరీ విల్లా? దిమ్మతిరిగేలా స్టార్ యాంకర్ కౌంటర్
సోషల్ మీడియా రాకతో సెలబ్రిటీలపై దారుణంగా ట్రోలింగ్ జరగడంతో పాటు వారిపై లేనిపోని కథనాలు వస్తుండటం ఇబ్బందులకు గురిచేస్తోంది. దీని కారణంగా తమ పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతోందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వీటిపై చూసి చూడనట్లుగా వదిలేస్తుండగా.. మరికొందరు మాత్రం సీరియస్‌గా యాక్షన్‌కు దిగుతున్నారు. తాజాగా తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు స్టార్ యాంకర్ స్రవంతి చొక్కారపు. ఈ వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్‌లో స్టార్ యాంకర్‌గా దూసుకెళ్తున్నారు స్రవంతి చొక్కారపు. సినిమా ఈవెంట్స్, ప్రైవేట్ ఫంక్షన్స్ ఇలా ఏ కార్యక్రమం చూసినా ఆమె ఉండాల్సిందే. అందమైన రూపంతో పాటు కట్టుబొట్టుతో పద్ధతిగా కనిపిస్తూ కుర్రాళ్లకు సెగలు రేపుతుంటారు స్రవంతి. ఇదంతా రాత్రికి రాత్రి వచ్చిన స్టార్‌డమ్ కాదు.. దీని వెనుక ఎంతో కష్టం, అవమానాలు, చీత్కారాలు ఉన్నాయి. పలుమార్లు దీని గురించి బయటపెట్టారు స్రవంతి.

అనంతపురం జిల్లా కదిరికి చెందిన స్రవంతి.. చిన్న వయసులోనే హైదరాబాద్‌కు వచ్చేశారు. తొలుత హాస్టల్‌లోనూ ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నించి పలు సినిమాలలో చిన్నాచితకా పాత్రలు వేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌లో యాంకర్‌గా సినిమా రివ్యూలు, ఇతర అప్‌డేట్స్ ఇస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు స్రవంతి. సన్నిహితుల సలహా మేరకు హోస్ట్‌గా అవతారమెత్తారు. ఈ దశలో పుష్ప ది రైజ్ సందర్భంగా అల్లు అర్జున్- సుకుమార్‌లతో చిత్తూరు యాసలో మాట్లాడుతూ చేసిన ఇంటర్వ్యూ సక్సెస్ కావడంతో ఈమె రాత్రికి రాత్రి పాపులర్ అయిపోయింది. నాటి నుంచి ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
ప్రశాంత్ అనే కుర్రాడితో ప్రేమలో పడి అతనిని పెళ్లాడారు. అయితే రెండు కుటుంబాల్లోనూ ఈ పెళ్లిని అంగీకరించకపోవడంతో ఇద్దరూ ఎంతో కష్టపడ్డారు. ఆ సమయంలో సేల్స్ గర్ల్‌గా ఓ జ్యూవెలరీ షాప్‌లో పనిచేశారు. ఇంతలో ప్రెగ్నెంట్ కావడంతో వీరి కష్టాలు మరింత రెట్టింపు అయ్యాయి. కుటుంబం కోసం స్రవంతి కూడా యాంకరింగ్‌లోకి దిగారు. డబ్బులు ఎక్కువగా దాచుకోలేను.. నా చుట్టూ ఉన్నవాళ్లు అవసరంలో ఉన్నాను అంటే ఇచ్చేస్తానని పలుమార్లు స్రవంతి తెలిపారు. ఇంత సంపాదించినా హైదరాబాద్‌లో కనీసం ఇల్లు కూడా కొనలేదు. కష్టపడి 10 ఏళ్లపాటు అప్పులు కట్టా, మా ఆయనకి అనుకోకుండా బిజినెస్‌లో నష్టం వస్తే జీరో నుంచి స్టార్ట్ చేశాం.. ఇద్దరం కలిసి అన్ని తీర్చేశామని స్రవంతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఈ క్రమంలో యాంకర్ స్రవంతి 20 కోట్ల రూపాయలు పెట్టి హైదరాబాద్‌లో లగ్జరీ విల్లా కొనుగోలు చేసిందని ఊహాగానాలు రావడంతో ఈ ముద్దుగుమ్మ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇటీవల గోదారి గట్టుపైన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యాంకర్ మంజూష మాట్లాడుతూ.. నీ గురించి బాగా వైరల్ అయిన ఫేక్ న్యూస్ చెప్పమని అడిగింది. నాకు 20 కోట్ల విల్లా ఉందని వచ్చిందని చెప్పింది. అసలు అలాంటిది ఎక్కడుంది, 20 కోట్లు కాదు కదా? కనీసం 2 కోట్లు విలువ చేసే విల్లా కూడా లేదని ఆన్సర్ ఇచ్చింది. అయితే మరి నీ మెడలో ఉన్న నెక్లెస్ ఒరిజనలేనా? అని యాంకర్ అడగ్గా.. ఒరిజినలే కాకపోతే ఇది బ్రాండ్ అండార్స్‌మెంట్ అని చెప్పింది స్రవంతి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. తనకు ఎలాంటి విల్లా లేదని స్రవంతి ఒక్క ముక్కలో చెప్పేశారు.


Click it and Unblock the Notifications