కాటుక కళ్లతోనే చంపేసేలా ఉందిగా... యంగ్ యాంకర్ లేటెస్ట్ ఫొటోస్ ఇలా!

యంగ్ బ్యూటీ స్రవంతి చొక్కారపు పేరు ప్రస్తుతం బుల్లితెర ఆడియెన్స్ కు బాగానే వినిపిస్తున్న సంగతి తెలిసిందే. యూట్యూబ్ ఛానెల్ యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం స్మాల్ స్క్రీన్ పై ఎంతటి సెన్సేషన్ గా మారిందో తెలిసిందే. ఆమె టాలెంట్, యాంకరింగ్ స్కిల్స్ తో షోలో అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. మరోవైపు తన అందంతోనూ బుల్లితెర ఆడియెన్స్ ను మంత్రముగ్ధులను చేస్తోంది. టీవీ షోలతో ఓవైపు అలరిస్తూనే ఉన్న స్రవంతి చొక్కారపు మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది.

స్రవంతి చొక్కారపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తుంటారు. తను చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి, తన వ్యక్తిగత విషయాల గురించి ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మకు ఇన్ స్టా గ్రామ్ లో దగ్గర దగ్గర వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో యంగ్ బ్యూటీ ఎలాంటి పోస్ట్ పెట్టినా క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారుతుంటుంది. లైక్స్, కామెంట్లతో అభిమానులు ఆమెకు మరింతగా సపోర్ట్ ఇస్తూ ఉంటారు.

Anchor Sravanthi Chokkarapu attracts with her Traditional look Here is her beautiful Stills

తాజాగా స్రవంతి చొక్కారపు కొన్ని బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. సుడిగాలి సుధీర్ 'ఫ్యామిలీ స్టార్స్' షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పంచులు, ప్రాసలు, ఎనర్జీతో షోను ఇంట్రెస్టింగ్ గా రన్ చేస్తున్నారు. వచ్చిన గెస్ట్ లనూ ఉల్లాసపరుస్తూ కొత్త ఎనర్జీని అందిస్తున్నారు. మరోవైపు ఈ షోకు టీవీ నటీనటులు, యాంకర్లు, యంగ్ బ్యూటీ వచ్చి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో 'ఫ్యామిలీ స్టార్స్' లేటెస్ట్ ఎపిసోడ్ లో స్రవంతి చొక్కారపు మెరిసింది. ఈ సందర్భంగా బ్యూటీఫుల్ లుక్ లో ముస్తాబైంది. లెహంగా, పింక్ ఎంబ్రాయిడ్ టాప్ లో ఆకర్షణీయమైన లుక్ ను సొంతం చేసుకుంది. సంప్రదాయ దుస్తుల్లో యంగ్ బ్యూటీ మరింత అందాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు కాటుక కళ్లతో కెమెరావైపు ఓరాగా చూస్తూ కుర్ర గుండెల్ని పేల్చేలా స్టిల్స్ ఇచ్చింది. స్రవంతి రూపసౌందర్యానికి అభిమానులు ఖుషీ అవుతున్నారు. లేటెస్ట్ ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.

ఇక స్రవంతి చొక్కారపు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ'కి లేడీ యాంకర్ గా వ్యహరిస్తోంది. తన పంచులు, ప్రాసలతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. యూట్యూబ్ ఛానెళ్లకు యాంకర్ గా వ్యవహరించి తన ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫలితంగా మెరుగైన అవకాశాలు కూడా స్రవంతి చొక్కారపు సొంతం అయ్యాయి. ఈ యంగ్ బ్యూటీ మా టీవీ, జెమిని టీవీల్లో యాంకర్ గా వ్యవహరించి ఆకట్టుకుంది. అంతేకాదు పాపులర్ రియాలిటీ గేమ్ షో 'బిగ్ బాస్ : ఓటీటీ' లోకి కూడా ఎంట్రీ ఇచ్చి టీవీ ఆడియెన్స్ కు మరింత దగ్గరైంది. ప్రస్తుతం టీవీ షోలు, ప్రొగ్రామ్స్ తో అలరిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ తళుక్కున మెరుస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింతగా పెంచుకుంటోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో బ్యూటీఫుల్ లుక్ లో ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X