అతనిని నమ్మి హైదరాబాద్‌కి..ప్రెగ్నెంట్ అని తెలిసి , సంచలన విషయాలు బయటపెట్టిన జబర్దస్త్ యాంకర్
బుల్లితెరపై యాంకర్‌గా, సినిమా ఈవెంట్స్‌కు హోస్ట్‌గా దూసుకెళ్తున్నారు స్రవంతి చొక్కారపు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు పంచుకునే ఈ ముద్దుగుమ్మ .. ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఓ వ్యక్తి చేసిన మోసం , ఎదురైన ఘటనలను పంచుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు. ఆంధ్రప్రదేశ్‌లోని కదిరిలో పుట్టి పెరిగిన ఈమె 2009 చదువు పూర్తి చేసి మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత యాంకర్‌గా మారి పలు టీవీ ఛానెల్స్‌లో హోస్ట్‌గా, ఇంటర్వ్యూలు చేసింది. జబర్దస్త్‌లోనూ కొంతకాలం మెరిసి, ఈ పాపులారిటీతోనే బిగ్‌బాస్‌లో ఛాన్స్ పట్టేసింది. షో స్టార్టింగ్‌లో 100 పర్సెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తానని చెప్పిన స్రవంతి.. తీరా హౌస్‌లో అడుగుపెట్టాక.. అఖిల్, అజయ్‌ల సేవలో తరించింది.

నిజానికి ఆమె ఇండస్ట్రీకి వచ్చాక ఎన్నో ఇబ్బందులు పడింది. కొత్త మనుషులు, కొత్త ఊరు కావడం, ఎవరూ తెలియకపోవడంతో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన ఇంటర్వ్యూ స్రవంతి జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ వెంటనే అల్లు అర్జున్, సుకుమార్‌లను రాయలసీమ స్లాంగ్‌లో ఆమె చేసిన ఇంటర్వ్యూ బాగా వైరల్ అయ్యింది.
ప్రశాంత్ అనే వ్యక్తిని స్రవంతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమానులు కావడంతో అలా సెట్ అయ్యింది.
ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరికి పరిచయం ఏర్పడగా.. ఆ తర్వాత రిలేషన్‌షిప్ స్టార్ట్ చేశారు. అంతేకాదు.. పెళ్లి చేసేసుకుని ఇంట్లో వాళ్లకి షాకిచ్చింది ఈ జంట. పెళ్లి చేసుకున్నాక ఇంట్లోకి రానియ్యకపోగా.. ఆమె భర్త బిజినెస్‌లోనూ లాస్ రావడంతో చాలా ఇబ్బందులు పడ్డారట. దీంతో ఆమె భర్త స్రవంతిని కొన్నాళ్లు హాస్టల్‌లో ఉంచి.. పెద్దల అంగీకారంతో మళ్లీ పెళ్లి చేసుకున్నాడట. ప్రస్తుతం స్టార్ యాంకర్ రేసులో దూసుకెళ్తున్న స్రవంతి చొక్కారపు ఇటీవల తెలుగు రాష్ట్రాలను , ముఖ్యంగా విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు చలించిపోయారు. తన స్తోమతకు తగిన విధంగా రూ. లక్షను ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నారు.

ఇటీవల ఓ ఇంటర్య్యూలో మాట్లాడిన స్రవంతి.. ప్రశాంత్ కోసం చేతిలో రూ.500 పెట్టుకుని హైదరాబాద్‌కు వచ్చేశానని తెలిపింది. ఎస్ఆర్ నగర్‌లో ఓ స్కూల్‌లో పిల్లలకు చదువు చెప్పానని స్రవంతి తెలిపారు. రెండోసారి పెళ్లి చేసుకుని డోర్ కొట్టగా.. తన అత్తగారు సీరియల్స్ చూస్తూ కనిపించారని మమ్మల్ని చూడగానే కోపంతో నన్ను చెంప దెబ్బ కొట్టిందని గుర్తుచేసుకున్నారు. ఈలోగా గర్భం దాల్చానని, కానీ ఫ్రెండ్స్ వల్ల తన భర్త బిజినెస్‌లో నష్టం వచ్చిందని.. తన డెలివరీ చేయడానికి కూడా అతని వద్ద డబ్బులు లేవని తెలిపింది.
చివరికి అత్తమ్మవాళ్లే అంతా చూసుకున్నారని.. నా ఖర్చులైనా తగ్గుతాయన్న ఉద్దేశంతో పుట్టింటికి వెళ్దామని అనుకున్నానని, కానీ ఇంతలో అమ్మ చనిపోయినట్లుగా నాన్న ఫోన్ చేసి చెప్పాడని స్రవంతి ఎమోషనల్ అయ్యారు. చివరికి అత్తమ్మ బాబు బాధ్యతలు తీసుకోవడంతో నేను, ప్రశాంత్ వర్క్‌లో బిజి అయ్యానని ఆమె తెలిపారు. ఒకరికొకరం తోడుగా అన్ని కష్టాలను అధిగమించామని స్రవంతి ఎమోషనల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











