హాస్పిటల్ బెడ్ పై దీనస్థితిలో స్రవంతి చొక్కారపు.. 40 రోజులుగా నరకం.. ఏం జరిగిందంటే?
బుల్లి తెరపై షోలు, స్టార్ హీరోల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తూ బిజీగా ఉంటుంది ఈ స్టార్ యాంకర్. తన మాటల గారడీతో అందర్ని కట్టిపడేస్తుంది ఆ అందాల ముద్దుగుమ్మ. కేవలం స్కీన్ పైనే కాదు. సోషల్ మీడియాలో కూడా రచ్చ చేస్తుంది. తరుచు తన హాట్ హాట్ ఫోజులను షేర్ చేస్తూ.. కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పెళ్లైనా తరగని అందంతో యూత్ ను మెస్మారైజ్ చేస్తుంది. ఎప్పుడు తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేసే ఈ అమ్మడు.. తాజాగా హాస్పిటల్ బెడ్ ఉన్న ఫొటోలను షేర్ చేసి షాకిచ్చింది. ఇంతకీ ఆ స్టార్ యాంకర్ ఎవరు? ఇంతకీ ఆమెకు ఏమైంది?
స్టార్ యాంకర్ ఎవరో కాదు.. స్రవంతి చొక్కారపు ( Sravanthi Chokkarapu ). ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీ షోలు, స్టార్ హీరోల సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉంటోంది అందాల తార. గతంలో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో తో బుల్లితెర ప్రేక్షకుల మనసు గెలుచుకుంది స్రవంతి. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌లో యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించింది. ఈ సమయంలో వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్య్వూ చేసి.. లైఫ్ లైన్లోకి వచ్చింది. ఆ తర్వాత పుష్ప 1 ప్రమోషన్లలో భాగంగా.. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌లను ఇంటర్య్వూ చేసింది స్రవంతి. ఈ సమయంలో రాయలసీమ యాసలో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచింది.

ఇక సోషల్ మీడియాలోనూ ఈ అందాల యాంకరమ్మ చేసే రచ్చ మామూలుగా ఉండదు. హీరోయిన్ లా అందంగా కనిపించే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటుంది. తరుచు తన గ్లామరస్ అండ్ బ్యూటిపుల్ ఫోటోలను షేర్ చేస్తూ..కుర్రకారకు నిద్రలేకుండా చేస్తోంది యాంకర్ స్రవంతి. పెళ్లైనా తన తరగని అందంతో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. కుర్రాళ్ల మతి పోగొడుతుంది ఈ యాంకరమ్మ. ఇలా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా ఓ షాకింగ్ ఫోటోలను షేర్ చేసిన తన అభిమానులకు షాకిచ్చింది స్రవంతి. ఇలా ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది అందాల యాంకరమ్మ.
తాజాగా యాంకర్ స్రవంతి బెడ్ పై దీనంగా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అందులో ఇలా రాసుకొచ్చింది. 'అస్సలు ఇలాంటి పోస్ట్ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు పెట్టక తప్పలేదు. కేవలం ఇది అవేర్నెస్ కోసం మాత్రమే. స్పెషల్ గా ఆడవారి కోసం ఈ పోస్ట్ షేర్ చేస్తున్నాను. గత 35 నుండి 40 రోజుల నుండి ఆన్ అండ్ ఆఫ్ గా విపరీతమైన బ్లీడింగ్. రకరకాల మెడిసిన్ వాడాను. డాక్టర్ ను డైరెక్ట్ గా వెళ్లి కలిసే సమయం లేకపోవడంతో స్కానింగ్ చేయించుకోలేకపోయాను. ఒకరోజు మార్నింగ్ 6:45 నుండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ 2:45 వరకు కంటిన్యూగా షూట్ జరిగింది. ' అని పేర్కొంది.
'విపరీతమైన కడుపునొప్పి వెంటనే డాక్టర్ ను కన్సల్ట్ అయ్యాను. అప్పుడు తెలిసింది. ఇది చిన్న సమస్య కాదు.. వెంటనే అడ్మిడ్ అయి.. సర్జరీకి వెళ్లాల్సి వచ్చింది. ముందు లాగా నేను నడవాలి అంటే నాలుగు నుంచి ఐదు వారాలు పడుతుంది. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే... అయ్యో
ఆల్రెడీ షూట్ కోసం డేట్స్ ఇచ్చాను. ఈ సమయంలో హెల్త్ బాలేదని పర్మిషన్ అడిగితే.. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో.. వాళ్లు ఇబ్బంది పడతారేమో.. అని ఫీల్ అవ్వకండి. అది మీరు వర్క్ చేస్తే ఏ ప్రొఫెషన్ అయినా సరే హెల్త్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రియార్టీ. హెల్త్ ను నెగ్లెట్ చేయకండి. ముందు హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి. ఇవన్నీ ఆటోమేటిగ్గా సెట్ అవుతాయి' అని స్రవంతి పేర్కొంది.


Click it and Unblock the Notifications











