పెళ్లాన్ని ఇలా వదిలేస్తార్రా.. కాపురం చేయట్లేదారా.. హీరోపై శ్రీముఖి షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక నటిగా కెరీర్ స్టార్ చేసిన బ్యూటిఫుల్ భామ శ్రీముఖి పలు చిత్రాల తర్వాత యాంకర్ గా మారింది. తన స్టైల్ లో యాంకరింగ్ చేసి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అదుర్స్ షో ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పటాస్ ద్వారా యమ క్రేజ్ సాధించుకుంది. చలాకీ మాటలతో బిగ్గరగా అరుస్తూ, కొంటె ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటూ ప్రస్తుతం స్టార్ యాంకర్ లో ఒకరిగా పాపులర్ అయింది.

తన వాయిస్ తో, కామెడీ టైమింగ్ తో ఆద్యంతం షోని ఇంట్రెస్టింగ్ గా సాగేలా చేసే ఈ బ్యూటి అప్పుడప్పుడు బోల్డ్ అండ్ షాకింగ్ కామెంట్స్ చేసి ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా సీరియల్ హీరోపై అలాంటి కామెంట్స్ చేసి షాక్ ఇచ్చింది.

 జులాయితో ఎంట్రీ..

జులాయితో ఎంట్రీ..

2012లో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటిఫుల్ శ్రీముఖి అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హిట్ మూవీ జులాయితో ఇండస్ట్రీకి పరిచయమైంది శ్రీముఖి. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు చెల్లెలు రాజీగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసి యమ పాపులర్ అయింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ', 'క్రేజీ అంకుల్స్' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా పాటు లీడ్ యాక్ట్రస్ గా నటించి ఫుల్ పాపులర్ అయింది.

 సక్సెస్ ఫుల్ షోలతో..

సక్సెస్ ఫుల్ షోలతో..

సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీముఖి బుల్లితెరపై 'అదుర్స్' అనే షోతో యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి ఆమె వరుసగా షోల మీద షోలు చేస్తూనే పాపులారిటీ పెంచుకుంటూ పోయింది. ఇలా శ్రీముఖి 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'పటాస్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'భలే ఛాన్సులే', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'గోల్డ్ రష్', 'కామెడీ స్టార్స్', 'డ్యాన్స్ ఐకాన్' వంటి అనేకమైన సక్సెస్‌ఫుల్ షోలు చేసిపేరు తెచ్చుకుంది.

బీబీ జోడీ డ్యాన్స్ షోకి..

బీబీ జోడీ డ్యాన్స్ షోకి..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'భోళా శంకర్' సినిమా సహా పలు భారీ, చిన్న సినిమాల్లో నటిస్తోంది యాంకర్ శ్రీముఖి. ఇందులో చిరుతో పవన్ కల్యాణ్ ఖుషీ సినిమాలో నడుము సీన్ చేయిస్తున్నట్లు ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇదిలా ఉంటే యాంకర్ శ్రీముఖి ఓవైపు సినిమాలతోపాటు బుల్లితెరపై కూడా అదరగొడుతోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం బీబీ జోడీ అనే డ్యాన్స్ రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తోంది.

సీరియల్ హీరోయిన్..

సీరియల్ హీరోయిన్..

బీబీ జోడీ మాత్రమే కాకుండా ఆదివారం స్టార్ మా పరివారం కార్యక్రమానికి కూడా యాంకరింగ్ చేస్తూ అట్రాక్ట్ చేస్తుంటుంది శ్రీముఖి. మహిళ దినోత్సవం సందర్భంగా తర్వాతి ఎపిసోడ్ కు అనేకమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి.. బిగ్ బాస్ ఫేమ్ మానస్, అతని తల్లి, బిగ్ బాస్ సీజన్ 6 ఆదిరెడ్డి, అతని సోదరి, నటరాజ్ మాస్టర్-ఆయన భార్య, ప్రభాకర్, ఆయన కూతురు, ఆర్జే చైతూ అతని బెస్ట్ ఫ్రెండ్ ఆర్జే కాజల్ తోపాటు సీరియల్ నటి తేజస్విని, ఆమె తల్లి వచ్చారు.

బెస్ట్ ఫ్రెండ్ అంటే అమ్మ..

బెస్ట్ ఫ్రెండ్ అంటే అమ్మ..

కేరాఫ్ అనసూయ సీరియల్ హీరోయిన్ తేజస్విని గౌడ, జానకి కలగనలేదు సీరియల్, మిస్టర్ పెళ్లాం వెబ్ సిరీస్ లో హీరోగా చేసిన అమర్ దీప్ ఇద్దరు ప్రేమించుకుని గతేడాది డిసెంబర్ 14న పెళ్లి చేసుకున్న విషయంపై తెలిసిందే. అయితే తాజాగా ఆదివారం స్టార్ మా పరివారం పోగ్రామ్ కి తేజస్విని వాళ్ల అమ్మతో హాజరైంది. స్ట్రాంగ్ గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఏదోచ్చిన ఫేస్ చేయాలి అవన్నీ నేర్చుకుంది అమ్మ నుంచే అని, తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటే అమ్మే అని చెప్పి ఎమోషనల్ అయింది తేజస్విని.

కాపురం చేయట్లేదేట్రా నువ్వూ..

కాపురం చేయట్లేదేట్రా నువ్వూ..

అనంతరం 'పదహారేళ్ల వయసు' సినిమాలోని 'సిరిమల్లే పువ్వా.. నా వాడు ఎవడే' అనే పాటకు డ్యాన్స్ చేసింది తేజస్విని. దీంతో 'ఏరా అమర్.. పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లాన్ని ఇలా వదిలేస్తారారా.. ఆమె ఇప్పటికీ నా వాడు ఎవరే, నా తోడు ఎవరే అని పాడుతుంది అమర్ దీప్.. కాపురం చేయట్లేదేట్రా నువ్వూ..' అని ఒక కామెడీ స్లాంగ్ తో అనేసింది శ్రీముఖి. దీంతో 'వస్తున్నా వచ్చేస్తున్నా' అనే పాట బ్యాక్ గ్రౌండ్ లో వచ్చింది. అప్పుడు ఒక్కసారిగా షాక్ అయిన శ్రీముఖి.. 'వద్దు వద్దు ఏదో సరదాగా పిలిచాం' అని నవ్వించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X