Sreemukhi: పెళ్లంటే అవే ఉంటాయి, అందుకే చేసుకోవట్లేదన్న శ్రీముఖి.. షోలో పరువు తీసిన ఫైమా
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక నటిగా కెరీర్ స్టార్ చేసిన బ్యూటిఫుల్ భామ శ్రీముఖి పలు చిత్రాల తర్వాత యాంకర్ గా మారింది. తన స్టైల్ లో యాంకరింగ్ చేసి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అదుర్స్ షో ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ సుందర్ పటాస్ షోతో యమ క్రేజ్ సంపాదించుకుంది. చలాకీ మాటలతో బిగ్గరగా అరుస్తూ, కొంటె ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటూ ప్రస్తుతం స్టార్ యాంకర్ లో ఒకరిగా హవా నడిపిస్తోంది. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అదిరే హాట్ షోతో కవ్వించే ఈ సుందరాంగి తాజాగా పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసింది.
2012లో ఎంట్రీ:2012లో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటిఫుల్ శ్రీముఖి అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హిట్ మూవీ జులాయితో ఇండస్ట్రీకి పరిచయమైంది శ్రీముఖి. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు చెల్లెలు రాజీగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత 'నేను శైలజ' సినిమాలో కూడా హీరో రామ్ పోతినేనికి సోదరిగా అలరించింది శ్రీముఖి.

హీరోలకు చెల్లెలుగా:సినిమాల్లో హీరోలకు చెల్లెలుగా నటించిన ముద్దగుమ్మ శ్రీముఖి తర్వాత 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసింది. అనంతరం 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ', 'క్రేజీ అంకుల్స్' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా పాటు లీడ్ యాక్ట్రస్ గా నటించి ఫుల్ పాపులర్ అయింది. సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ సత్తా చాటుతోన్న సమయంలోనే బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది ఈ యాంకరమ్మ.

డిఫరెంట్ షోలు:బ్యూటిఫుల్ శ్రీముఖి 'అదుర్స్' అనే షోతో యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి ఆమె వరుసగా షోల మీద షోలు చేస్తూనే పాపులారిటీ పెంచుకుంటూ పోయింది. ఇలా 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'పటాస్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'భలే ఛాన్సులే', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'గోల్డ్ రష్', 'కామెడీ స్టార్స్', 'డ్యాన్స్ ఐకాన్', 'బీబీ జోడీ' వంటి అనేకమైన సక్సెస్‌ఫుల్ షోలు చేసిపేరు తెచ్చుకుంది.

కొత్త డ్యాన్స్ షో:మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'భోళా శంకర్' సినిమా సహా పలు భారీ, చిన్న సినిమాల్లో నటిస్తోంది యాంకర్ శ్రీముఖి. ఇవే కాకుండా ఇటీవల బీబీ జోడీ డ్యాన్స్ షోలో యాంకర్ గా ఆకట్టుకున్న ఈ బ్యూటి త్వరలో నీతోనే డ్యాన్స్ అనే మరో డ్యాన్స్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది. అలాగే పలు టీవీ షోలకు హోస్ట్ గా చేస్తూ ఆకట్టుకుంటోంది.

సిట్టింగ్ వేస్తున్నావ్:తాజాగా ఆదివారం స్టార్ మా పరివారం షోలో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసింది ముద్దుగుమ్మ శ్రీముఖి. ఈ షోలో మొగుడ్స్ వర్సెస్ పెళ్లామ్స్ నిర్వహించారు. దీనికి పలువురు సీరియల్ నటీనటుమణలు రియల్ లైఫ్ జోడీలతో వచ్చి సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోలో "షూటింగ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి సిట్టింగ్ వేస్తున్నావ్" అని సీరియల్ నటుడు అంబటి అర్జున్ భార్య సురేఖ అంది.

శ్రీముఖి ఉంటే :భార్య సురేఖ అన్నదానికి "నువ్వు సంతోషంగా హ్యాపీగా ఉంటే గోవాకు వస్తానని గుళ్లో మొక్కుకున్నా" అని అర్జున్ అన్నాడు. దీంతో మధ్యలో దూరిన శ్రీముఖి.. "షూటింగ్ కు వచ్చినప్పుడు ఏమన్నాడో తెలుసా. ఏ... ఎంతసేపు సురేఖ.. సురేఖ.. ఏ సుహాసినీయో, శ్రీముఖో ఎవరైనా ఉంటే బాగుంటుంది" అని శ్రీముఖి అంటుంది. మధ్యలో కలుగజైసుకున్న ఫైమా "నా పేరు కూడా చెప్పాడు చెప్పు" అని అంది.

కరువులో ఉన్నావా:"డైలీ మెసేజ్ లు చేస్తున్నాడు తెలుసా" అని ఫైమా అంది. దీంతో "మరి అంత కరువులో ఉన్నావా" అని అర్జున్ ను తన భార్య అంటుంది. "పెళ్లి అయితే ఇన్ని ఉంటాయానే నేను చేసుకోవట్లేదు అర్థమైందా" అని ఫైమాతో శ్రీముఖి అంది. "నేను ఇంకా నీకెవరు రావట్లేదు అనుకున్నా" అని శ్రీముఖి పరువు తీసేసింది జబర్దస్త్ ఫైమా.


Click it and Unblock the Notifications











