స్టార్ యాంకర్‌పై కన్ను .. ఈరోజు వదలనంటూ, అందరి ముందే ఆమె మీదకి
తెలుగులో ఉన్న స్టార్ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు. అదుర్స్ అనే షోతో యాంకరింగ్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ అనతికాలంలోనే స్టార్ యాంకర్‌గా ఎదిగింది. బ్యాక్ టూ బ్యాక్ క్రేజీ ప్రోగ్రామ్స్‌తో పాటు వెండితెరపై సినిమాలతోనూ ఎంతగానో అలరిస్తుంది. ఆమె బేస్ వాయిస్, చలాకీతనంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది శ్రీముఖి.. అభిమానులు ఆమెను ముద్దుగా బుల్లితెర రాములమ్మగా పిలుచుకుంటారు.
అదుర్స్ షోతో బుల్లితెరపై ఎంట్రీ
10 ఏప్రిల్ 1993న నిజామాబాద్‌లో పుట్టింది శ్రీముఖి. దంత వైద్యంలో గ్రాడ్యుయేషన్ చేసిన ఈ ముదుగుమ్మ.. జులాయి సినిమాలో అల్లు అర్జున్‌కు చెల్లెలిగా నటించి ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ఆమెకు మరింత పేరు తీసుకొచ్చింది. ఈ దశలో బుల్లితెరపై ఫోకస్ పెట్టిన శ్రీముఖికి పటాస్ షో బ్రేక్ ఇచ్చింది. అనంతరం సూపర్ మామ్, సూపర్ సింగర్ 9, జీ సరిగమప, జూలకటక, కామెడీ నైట్స్, గోల్డ్ రష్ వంటి కార్యక్రమాలకు హోస్ట్‌గా చేశారు. ఈ పాపులారిటీతో బిగ్‌బాస్ నుంచి శ్రీముఖికి కబురొచ్చింది. తన అందం, మైండ్ గేమ్‌తో ఫైనల్‌లో అడుగుపెట్టినప్పటికీ రెప్పపాటులో ఆమెకు టైటిల్ మిస్ అయ్యింది. బిగ్‌బాస్‌లో చేసినందుకు గాను భారీ మొత్తంలో ఆమెకు రెమ్యునరేషన్ అందింది.

బిగ్‌బాస్ తర్వాత ఫుల్ బిజీ
బిగ్‌బాస్ తర్వాత పలు క్రేజీ సినిమాలలో శ్రీముఖికి ఆఫర్లు వచ్చాయి. నేను శైలజ, సావిత్రి, జెంటిల్‌మెన్, మనలో ఒకడు, బాబు బాగా బిజీ, క్రేజీ అంకుల్స్, మ్యాస్ట్రో, భోళా శంకర్ సినిమాలలో రాములమ్మ నటించారు. మెగాస్టార్ చిరంజీవితో నటించిన భోళా శంకర్ తర్వాత కొత్తగా ఏ ప్రాజెక్ట్‌కు రాములమ్మ కమిట్ కాలేదు. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న కిర్రాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ సీజన్ 2కు శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. శనివారం తన పుట్టినరోజు కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఈ ముద్దుగుమ్మ దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
శ్రీముఖికి బర్త్ డే సర్‌ప్రైజ్
కాగా.. ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో శ్రీముఖి బర్త్ డే వేడుకల్ని ప్లాన్ చేశారు ఆమె ఫ్రెండ్స్. మే 11 ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఈ షోలోని పార్టిసిపెంట్స్.. శ్రీముఖికి బర్త్ డే విషెస్ తెలియజేశారు. మీరు చిన్నప్పుడు దిగిన ఫోటోలని మేము కొన్ని తీసుకొచ్చామని.. వాటిని చూసి అప్పుడు మీ వయసెంతో చెప్పాలని ముక్కు అవినాష్ చెప్పారు. ఆ వెంటనే శ్రీముఖి చిన్నతనంలోని ఫోటోలను బోర్డ్‌పై చూపించారు. అప్పుటు యాంకర్ హరి.. మీరు చాలా బాగున్నారని, చూస్తుంటే ఇప్పుడే వచ్చి ముద్దు పెట్టాలని ఉందని చెప్పడంతో శ్రీముఖి సహా అంతా షాక్ అవుతారు.
108 కేజీల బరువు నుంచి స్లిమ్‌గా మారిన శ్రీముఖి
వీడెంటే నాకు ముద్దు పెడతానంటున్నాడని శ్రీముఖి అనగా.. ఆ పక్కనే ఉన్న జబర్దస్త్ రోహిణి క్షణం కూడా ఆగకుండా పంచ్ విసిరింది. దాంట్లో షాక్ అవ్వాల్సిన పనేముంది.. వాడు ముద్దంటే నువ్వు వద్దను సరిపోతుందని చెప్పడంతో అంతా నవ్వేస్తారు. ఇక ఇదే ప్రోమోలో పదవ తరగతి చదువుతున్న రోజుల్లో శ్రీముఖి ఫోటోను చూపించగా అంతా షాక్ అయ్యారు. అప్పట్లో నేను కూర్చొన్నానంటే రెండు బిర్యానీ ప్యాకెట్లు లాగించాల్సిందేనని, అలా తిని దాదాపు 108 కిలోలు బరువు పెరిగి నడవటం కూడా కష్టంగా ఉండేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బరువు నుంచి ఇంత స్లిమ్‌గా మారడానికి ఎంతో కష్టపడ్డానని శ్రీముఖి చెప్పారు. దాంతో పార్టిసిపెంట్స్ అంతా చప్పట్లు కొట్టి ఆమెను అభినందిస్తారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











