Sreemukhi: నల్లని చీరలో శ్రీముఖి అందాలు.. దిమ్మతిరిగేలా నెవ్వర్ బిఫోర్ షో..
తెలుగు యాంకర్స్ లో ఎంతమంది గ్లామరస్ బ్యూటీలు ఉన్నప్పటికీ కూడా అందులో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే వారిలో శ్రీముఖి ఒకరు. ఆమె ఎలాంటి డ్రెస్ లో కనిపించినా కూడా ఓవర్గం కుర్రాళ్ళను ఈజీగా తన వైపుకు తిప్పుకుంటూ ఉంటుంది. ఇక రియాలిటీ షోలతో మంచి క్రేజ్ అందుకున్న శ్రీముఖికి కేవలం కుర్రాలలోనే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ లో కూడా మంచి క్రేజ్ అయితే ఉంది. అయితే శ్రీముఖి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్న ఫోటోలు ఊహించని విధంగా ఆశ్చర్యపరుస్తున్నాయి. రీసెంట్ గా ఆమె నల్లని చీరలో మరోసారి నెవర్ బిఫోర్ అనే గ్లామర్ షో తో ఎంతగానో ఆకట్టుకుంది. ఆ వివరాలు లోకి వెళితే..

పధికి పైగా సినిమాలు
శ్రీముఖి మొదట కొన్ని సినిమాలలో సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా త్రివిక్రమ్ అల్లు అర్జున్ కలయికలో వచ్చిన జులాయి సినిమాలో ఆమె సోదరీ పాత్రలో కనిపించింది. ఆ తర్వాత కూడా ఆమెకు మరికొన్ని చిన్న సినిమాలలో మంచి ఆఫర్లు అయితే వచ్చాయి. ఇక 2012 లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో కనిపించింది. ఇక ఆమె టెలివిజన్ ఇండస్ట్రీలోకి రాకముందే పదికి పైగా సినిమాలు నటించింది.

ఆ విధంగా కామెడీ షో మిస్సయ్యింది
మొదట టెలివిజన్ రంగంలోకి రావాలని అనుకున్నప్పుడు శ్రీముఖికి మంచి ఆఫర్లు కూడా వచ్చాయి. ముఖ్యంగా జబర్దస్త్ మొదలైనప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ యాంకర్ కావాలని అనుకున్నప్పుడు నిర్వాహకులు మొదట ఆమెను సంప్రదించారు. కానీ శ్రీముఖి అప్పుడే మొదలైన కొత్త షో ద్వారా మొదలైతే అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు అనే అనుమానాలతో ఒప్పుకోలేదు. ఇక తర్వాత ఆ అదృష్టాన్ని అనసూయ దక్కించుకొని భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంది. ఆ విధంగా శ్రీముఖి చేతి నుంచి జబర్దస్త్ చేజారిపోయింది.

ఆ షో ద్వారా మరింత క్రేజ్
జబర్దస్త్ సక్సెస్ అయిన తర్వాత అదే నిర్మాణ సంస్థ మరో షో మొదలు పెట్టాలని అనుకున్నప్పుడు శ్రీముఖిని యాంకర్ గా చేయాలని మరోసారి సంప్రదించారు. ఇక ఆమె ఒప్పుకోవడంతో పటాస్ మొదలుపెట్టారు. యాంకర్ రవితో శ్రీముఖి కలిసి చేసిన ఆ షో పెద్ద సక్సెస్ గా నిలిచింది. ఆ టెలివిజన్ షో ద్వారానే శ్రీముఖి మిగతా చానల్స్ లో కూడా మంచి ఆఫర్స్ అందుకుంది.

గెలవకపోయినా కూడా..
ఇక బిగ్ బాస్ షోలో కూడా శ్రీముఖి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ 3 సీజన్లో చాలా బలంగా పోరాడిన ఆమె ఫైనల్స్ వరకు వెళ్ళింది. శ్రీముఖి గెలవక పోయినప్పటికీ ఆ షో ద్వారా అయితే భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంది. ఇక ఆ తర్వాత వరసగా సినిమా ఇండస్ట్రీలో ఆమెకు కొన్ని ఆఫర్స్ కూడా వచ్చాయి.

నల్లని చీరలో గ్లామర్ షో
ఇక శ్రీముఖి ఇటీవల కాలంలో గ్లామర్ షో తో ఊహించిన విధంగా షాక్ ఇస్తోందనే చెప్పాలి. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్న ఫోటోలు అయితే మామూలుగా ఉండడం లేదు. గతంలో ఎప్పుడు లేనివిధంగా శ్రీముఖి రీసెంట్ గా ఒక నల్లని చీరలో గ్లామర్ షో తో అదరగొట్టేసింది. నాభి అందాలను అలాగే ఏద అంశాలను ఒకేసారి స్టన్ అయ్యేలా ఫోటోలకు పోజు ఇచ్చింది. ఇక ఆ ఫోటోలు నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











