For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sreemukhi Remuneration: శ్రీముఖి రెమ్యూనరేషన్ లీక్.. ఒక్క ఈవెంట్‌కే అన్ని లక్షలు.. యాంకర్ సుమ కంటే!

  |

  శ్రీముఖి.. తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర, సినీ ప్రియులకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా ఈ ముద్దుగుమ్మ సుదీర్ఘ కాలంగా అటు టీవీల్లోనూ, ఇటు సినిమాల్లోనూ తెగ సందడి చేస్తోంది. ఫలితంగా చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. దీంతో ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకుంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో శ్రీముఖి డిమాండ్ భారీగా పెరిగిపోయింది. అందుకే ఎక్కడ చూసినా ఈ బ్యూటీనే దర్శనమిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే రాములమ్మ ఓ స్పెషల్ ఈవెంట్‌లో భాగం అయింది. దీనికోసం ఏకంగా కొన్ని లక్షల రూపాయలను ఆమె రెమ్యూనరేషన్‌గా తీసుకుందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వివరాలేంటో మీరే చూడండి!

   అలా వచ్చి.. ఇలా పాపులర్

  అలా వచ్చి.. ఇలా పాపులర్

  'జులాయి' అనే సినిమాతో శ్రీముఖి నటిగా ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో మంచి మంచి పాత్రలను పోషించి ఫుల్ పాపులర్ అయింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే, హీరోయిన్‌గా ఈ బ్యూటీకి సరైన బ్రేక్ రాకపోవడంతో సినిమాలకు గ్యాప్ తీసుకుంది.

  దిశా పటానీ ఎద అందాల ప్రదర్శన: వామ్మో ఆమెనిలా చూస్తే నిద్ర పట్టదు!

   యాంకర్‌గా సందడి చేస్తూ

  యాంకర్‌గా సందడి చేస్తూ


  చాలా సినిమాల్లో నటించడం ద్వారా ఫేమస్ అయిన శ్రీముఖి.. ఆ తర్వాత 'అదుర్స్' అనే షోతో యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి ఆమె వరుసగా షోల మీద షోలు చేస్తోంది. ఇలా తన కెరీర్‌లో 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి షోలను హోస్ట్ చేసింది.

  చేతి నిండా ఆఫర్లతో బిజీ

  చేతి నిండా ఆఫర్లతో బిజీ


  ఈ మధ్య కాలంలో యాంకర్ శ్రీముఖి వరుసగా అవకాశాలను అందుకుంటూ కెరీర్ పరంగా సత్తా చాటుతోంది. గత ఏడాది శ్రీముఖి 'క్రేజీ అంకుల్స్', 'మాస్ట్రో'లో నటించింది. ఇప్పుడు చిరంజీవి 'భోళా శంకర్' సహా పలు భారీ, చిన్న సినిమాల్లో నటిస్తోంది. అలాగే, యాంకర్‌గానూ ఎన్నో షోలను హోస్ట్ చేస్తూ సత్తా చాటుతోంది. ఇలా రెండు రంగాల్లో హవాను చూపిస్తోంది.

  బెడ్‌పై ఈషా రెబ్బా అందాల ఆరబోత: నెట్ డ్రెస్‌లో మొత్తం కనిపించేలా!

  సోషల్ మీడియాలో క్రేజ్

  సోషల్ మీడియాలో క్రేజ్

  ఒకవైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా దూసుకుపోతోన్న శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. దీంతో ఈ అమ్మడు తరచూ హైలైట్ అవుతూ క్రేజ్ పెంచుకుంటోంది.

  సైమాలో సందడి.. కిస్‌తో

  సైమాలో సందడి.. కిస్‌తో

  సౌత్ ఇండియాలో ఉన్న సినీ పరిశ్రమలకు చెందిన చిత్రాలు, నటులు, టెక్నీషియన్లలో టాలెంట్‌ను వెలికి తీసి ఇచ్చే సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) కార్యక్రమం ఇటీవలే బెంగళూరు నగరంలో జరిగింది. దీనికి యాంకర్ శ్రీముఖి హోస్టుగా వ్యవహరించింది. ఇందులో బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ ఆమెకు ముద్దు పెట్టడం బాగా హైలైట్ అయిపోయింది.

  బీచ్‌లో బికినీలో రెచ్చిపోయిన శ్రీయ: ఆ పార్టులన్నీ చూపిస్తూ దారుణంగా!

  అన్ని లక్షలు తీసుకుంది

  అన్ని లక్షలు తీసుకుంది

  సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించిన శ్రీముఖి.. భారీగా రెమ్యూనరేషన్ తీసుకుందని తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. బుల్లితెర వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఒక్క ఈవెంట్ కోసం శ్రీముఖి ఏకంగా రూ. 20 లక్షలు చార్జ్ చేసిందట. అలాగే, ఫ్లైట్, హోటల్ ఖర్చులు కూడా నిర్వహకులే భరించారని ప్రచారం జరుగుతోంది.

   యాంకర్ సుమ మాత్రమే

  యాంకర్ సుమ మాత్రమే


  ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఉన్న యాంకర్లలో యాంకర్ సుమ కనకాల మాత్రమే ఒక్కో ఈవెంట్‌కు రూ. 20 - 30 లక్షలు చార్జ్ చేస్తుందని ఓ టాక్ ఉంది. ఇప్పుడు ఆమెకు శ్రీముఖి కూడా అందుకుందని అంటున్నారు. అంతేకాదు, రాబోయే రోజుల్లో ఈ బ్యూటీనే అందరి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నా ఆశ్చర్యపోయే పని లేదని కూడా పలువురు చెప్పుకుంటున్నారు.

  English summary
  Actress and Television Presenter Sreemukhi Recently Participated in SIIMA Event. She Charges Rs 20 lakh Remuneration For This Event
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X