నా వయసుపై కామెంట్స్ ఎందుకు? దాంతో పనేంది? ఆ హీరో అంటే పిచ్చి.. శ్రీముఖి

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 తర్వాత శ్రీముఖి పాపులారిటీ మరింత పెరిగింది. బిగ్‌బాస్‌లోకి రాకముందు టాప్ యాంకర్‌గా అందరికి సుపరిచితులు. తెర మీద కనిపించే అల్లరే కనిపించేది. బిగ్‌బాస్‌లోకి వచ్చిన తర్వాత శ్రీముఖి సహజసిద్ధమైన చిలిపి తనమేంటో తెలిసిపోయింది. లాక్‌డౌన్‌లో స్వీయ గృహ నిర్బంధంలో ఉంటూ యూట్యూబ్ లైవ్‌లో ముచ్చటించింది. ఈ సందర్భంగా చాలా విషయాల గురించి చెప్పింది. వివరాల్లోకి వెళితే..

జీవిత భాగస్వామి ఎలా ఉండాలంటే

జీవిత భాగస్వామి ఎలా ఉండాలంటే

ప్రేమ అనేది వ్యక్తులను బట్టి మారుతుంది. ప్రేమను స్పెసిఫిక్‌గా చెప్పలేం. ఎవరైనా నాకు బాగా నచ్చితే.. వారిని వెంటనే పెళ్లి చేసుకొను. అతడే నాకు ఎప్పటికైనా జీవిత భాగస్వామి అనే ఫీలింగ్‌తో ఉంటాను. అమ్మాయి కాబట్టి పెళ్లి అనేది తప్పనసరి. కాబట్టి పెళ్లి చేసుకోకుండా తప్పించుకోలేం. అలాగని పెళ్లి అనేది జీవితంలో ప్రధానం కాకూడదు అని శ్రీముఖి అన్నారు.

ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లా?

ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లా?

ప్రేమ పెళ్లి చేసుకొంటావా? పెద్దల కుదిర్చిన పెళ్లి చేసుకొంటావా అంటే చెప్పడం కష్టం. ఐదేళ్ల క్రితమైతే అప్పుడు ఉండే జోష్‌లో నేను ప్రేమ పెళ్లి అని ఎగిరి గంతేసే దానిని. ఇప్పుడు కెరీర్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నాను. కానీ పెళ్లి కోసమే వెయిట్ చేయడం లేదు. పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? ఎవరిని చేసుకోవాలి? ఎలా చేసుకోవాలనేది కాలం నిర్ణయించేది అని శ్రీముఖి చెప్పారు.

అందుకే తక్కువ షోలలో నటిస్తున్నా

అందుకే తక్కువ షోలలో నటిస్తున్నా

గత నాలుగైదు ఏళ్లుగా ఫ్యామిలీతో సంబంధం లేకుండా నేను షో చేస్తూ యాంకర్‌గా రాణించాను. ఓ దశలో ఇదేం లైఫ్ అనిపించింది. ఒక సమయంలో నాన్నతో నా వల్ల కాదని చెప్పాను. అలాంటి హెక్టిక్ షెడ్యూల్‌తో ఉండకూడదని అనుకొన్నాను. అందుకే ఎక్కువ షోలు కాకుండా తక్కువ షోలు చేస్తూ స్ట్రెస్‌ను తగ్గించుకొంటున్నానని శ్రీముఖి చెప్పింది.

సినిమాలకు దూరం ఎందుకంటే

సినిమాలకు దూరం ఎందుకంటే

ఇక సినిమాలకు దూరంగా ఉండాలనేది నా వ్యక్తిగత నిర్ణయం. సినిమాలు చేస్తే మూడు నెలలకో.. లేదా ఆరు నెలలకో తెర మీద కనిపిస్తాం. సినిమా చేస్తే డబ్బింగ్, ఇంకా ఏవేవో పనులు ఉంటాయి. అదే టీవీ అయితే ఈ రోజు షూట్ చేస్తే రేపు తెర మీద కనిపిస్తాం. ఎప్పుడూ ప్రేక్షకులతో అటాచ్‌మెంట్ ఉంటుంది. సినిమాలు చేయడానికి ఇంకా వయసు ఉంది. నా వయసు ఇంకా 27 సంవత్సరాలే. 27 ఏళ్ల వయసా అనే ఎవరో కామెంట్ చేశారు. అదేమీ నేను పట్టించుకోను అని శ్రీముఖి చెప్పారు.

Recommended Video

Bigg Boss Telugu 4: Anchor Anusuya Bhardwaj Rejects Offer | #HBDAnusuya
చిరంజీవితో నటించాలని

చిరంజీవితో నటించాలని


సినిమాల విషయానికి వస్తే నాకు చిరంజీవి గారితో నటించాలనే కోరిక ఉంది. చిరంజీవి అంటే నాకు చాలా చాలా ఇష్టం. నా కంటే మా అమ్మకు మెగాస్టార్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. వారు చిరంజీవి సినిమాలను తప్పుకుండా చూసేవారట. నేను ఇండస్ట్రీకి వచ్చే వరకు ఆయన రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి అవకాశం వస్తే నటించాలని చూస్తున్నాను అని శ్రీముఖి చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X