అతడితో కలిసి రెచ్చిపోయిన శ్రీముఖి: ఏదో ఊపమంటే ఇంకేదో ఊపిండు.. అటువైపు చూపిస్తూ అలా అనడంతో!

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు తమ తమ ప్రభావాన్ని చూపుతున్నారు. ప్రతి ఒక్కరూ తమదైన శైలితో హోస్టింగ్ చేస్తున్నారు. అయితే, వారిలో కొందరు మాత్రమే మిగిలిన వారి కంటే ఎక్కువ గుర్తింపును తెచ్చుకుని సత్తా చాటుతున్నారు. అందులో హాట్ యాంకర్ శ్రీముఖి ఒకరు. తీవ్ర పోటీతో కూడిన గ్లామర్ ప్రపంచంలో వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న ఈ భామ.. వివాదాస్పద వ్యవహారశైలితో తరచూ వార్తల్లో ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఏదో ఊపమంటే ఇంకేదో ఊపిండు తాజాగా మరోసారి రెచ్చిపోయింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

అలా ఎంట్రీ ఇచ్చింది.. దానితోనే పాపులర్

అలా ఎంట్రీ ఇచ్చింది.. దానితోనే పాపులర్

నటిగా సినిమాల్లో సత్తా చాటాలనుకున్న శ్రీముఖికి.. అక్కడి కన్నా బుల్లితెర యాంకర్‌గానే ఎక్కువ పేరొచ్చింది. 'అదుర్స్' అనే షోతో యాంకర్‌గానూ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన కెరీర్‌లో 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది' సహా ఎన్నో షోలు హోస్ట్ చేసింది. అయితే, ఆమె కెరీర్‌లోనే 'పటాస్'ను ప్రత్యేకంగా చెప్పుకుంటారు.

అందులోకి కూడా.. ఇప్పుడు అంకుల్స్‌తో

అందులోకి కూడా.. ఇప్పుడు అంకుల్స్‌తో

బుల్లితెరపైకి అడుగు పెట్టడానికి ముందే కొన్ని సినిమాల్లో నటించింది శ్రీముఖి. సుదీర్ఘమైన కెరీర్‌లో 'జులాయి', 'నేను శైలజ', 'జెంటిల్‌మన్', 'బాబు బాగా బిజీ' సహా ఎన్నో చిత్రాలు పేరు తెచ్చి పెట్టాయి. వీటితో పాటు కొన్నింటిలో లీడ్ రోల్స్ కూడా చేసింది. ఇక, ఇప్పుడు 'క్రేజీ అంకుల్స్' అనే మూవీ చేస్తోంది. ఇందులో ఆమెతో పాటు భరణి, సింగర్ మనో, రాజా రవీంద్రలు నటిస్తున్నారు.

ఆశలు అడియాశలు.. నిరాశ ఎదురైందిగా

ఆశలు అడియాశలు.. నిరాశ ఎదురైందిగా

కెరీర్ పరంగా వరుస సినిమాలు.. షోలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే శ్రీముఖి బిగ్ బాస్ తెలుగు సీజన్ -3కి ఒక కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఈ అమ్మడు.. ఆటతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. దీంతో టైటిల్ కొడుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఆమె రన్నర్‌గా సింగర్ రాహుల్ విన్నర్‌గా నిలిచారు.

బిజీ షెడ్యూల్‌లోనూ అలా... హాట్ హాట్‌గా

బిజీ షెడ్యూల్‌లోనూ అలా... హాట్ హాట్‌గా

శ్రీముఖి ఖాళీ సమయాల్లో తన స్నేహితులతో కలిసి టూర్లు వెళ్తూ ఉంటోంది. ఇప్పటికే పలుమార్లు ఆమె ఎన్నో ప్రదేశాలను చుట్టొచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల ఈ అమ్మడు.. ముక్కు అవినాష్, విష్ణుప్రియ, ఆరియానా గ్లోరీ, ఆర్జే చైతూలతో కలిసి గోవాలో చిల్ అయింది. ఇక, ఈ టూర్‌లో భాగంగా దిగిన హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది.

కొత్త వ్యాపారం మొదలు పెట్టిన రాములమ్మ

కొత్త వ్యాపారం మొదలు పెట్టిన రాములమ్మ

సినీ సెలెబ్రిటీలంతా యాక్టింగ్‌తో పాటు ఏదో ఒక బిజినెస్ చేస్తూనే ఉంటారు. ఇప్పటికే రాహుల్ సిప్లీగంజ్ 'ఊకోకాక' పేరుతో బట్టల షాపులను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తున్నాడు. ఈ క్రమంలోనే యాంకర్ శ్రీముఖి 'లూవీ' బ్రాండ్‌తో ఓ స్టోర్ ఓపెన్ చేసింది. అంతేకాదు, ఫ్యూచర్‌లో ఎన్నో బ్రాంచ్‌లను కూడా ప్రారంభించబోతుంది. ఈ విషయాన్ని ప్రేమికుల రోజున వెల్లడించిందీ భామ.

అతడితో కలిసి తెగ రెచ్చిపోయిన శ్రీముఖి

అతడితో కలిసి తెగ రెచ్చిపోయిన శ్రీముఖి

స్టార్ మాలో 'స్టార్ట్ మ్యూజిక్' అనే కొత్త షో ప్రసారం అవుతోన్న విషయం తెలిసిందే. దీనికి సుమ కనకాల యాంకర్‌గా చేస్తోంది. వచ్చే వారం ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో శ్రీముఖి, విష్ణుప్రియ, హరి, పండు మాస్టర్, ఆర్జే చైతూ, రోల్ రైడాలు పాల్గొన్నారు. ఇందులో ఇద్దరు టీమ్ సభ్యులతో కలిసి శ్రీముఖి డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పి రెచ్చిపోయింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఏదో ఊపమంటే ఇంకేదో ఊపిండు.. అటువైపు

ఏదో ఊపమంటే ఇంకేదో ఊపిండు.. అటువైపు

షోలో భాగంగా తన టీమ్ సభ్యులైన పండు మాస్టర్, హరితో కలిసి ఓ బీట్‌కు స్టెప్ వేసింది శ్రీముఖి. అప్పుడు వీళ్ల ముగ్గురి మధ్య సింక్ మిస్సైంది. దీంతో హరిని ఉద్దేశిస్తూ 'వీడు ఏదో ఊపమంటే ఇంకేదో ఊపిండు' అంటూ కింద వైపు చూపించింది. దీంతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత పకపకా నవ్వేశారు. దీనిపై నెటిజన్లు తమదైన కామెంట్లను వదులుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X