అలాంటి డ్రెస్‌లతో ఈవెంట్స్ చేస్తారా? యాంకర్ శ్రీముఖికి నటుడి చురకలు

తెలుగు బుల్లితెరపై తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు శ్రీముఖి. చిన్న వయసులోనే కెరీర్‌ను ప్రారంభించి సినిమాలు, యాంకరింగ్‌తో టాప్ సెలబ్రిటీగా మారారు శ్రీముఖి. అందం, చలాకీతనం, వాక్చాతుర్యం, ఎనర్జీతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం శ్రీముఖికి పోటీ వచ్చే యాంకర్ లేదంటే అతిశయోక్తి కాదు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లు, మోడ్రన్ డ్రెస్‌లతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తారు. తాజాగా శ్రీముఖి డ్రెస్సింగ్ స్టైల్‌పై నటుడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read
అక్కడ అసభ్యంగా తాకుతూ... పబ్లిక్‌గా బాలయ్య హీరోయిన్‌కు వేధింపులు
అక్కడ అసభ్యంగా తాకుతూ... పబ్లిక్‌గా బాలయ్య హీరోయిన్‌కు వేధింపులు

తొలుత అదుర్స్‌ షోతో తన ప్రస్థానం ప్రారంభించిన శ్రీముఖికి.. పటాస్ షో బ్రేక్ ఇచ్చింది. ఈ షోలో అరుపులు, కేకలు, నవ్వులతో ప్రేక్షకులను భయపెట్టి రాములమ్మ అనే ట్యాగ్ తెచ్చుకుంది శ్రీముఖి. ఆ తర్వాత ఆమెకు వరుసపెట్టి టాప్ ఛానెల్స్‌లో అవకాశాలు వచ్చాయి. తెలుగు టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌లో యాంకరింగ్ చేశారు. బుల్లితెరతో పాటు సినిమాల్లోనూ తన సత్తా చాటారు శ్రీముఖి. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, జులాయి, ప్రేమ ఇష్క్ కాదల్, నేను శైలజ తదితర సినిమాలలో నటించారు.

Anchor Sreemukhi Dress Sparks Debate in Aadivaaram With Star Maa Parivaaram Promo

ఇక బిగ్‌బాస్ తెలుగు 3లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకుని రన్నరప్‌గా నిలిచారు. ట్రోఫీ చేజారినప్పటికీ బిగ్‌బాస్ ద్వారా మరింత పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. సినిమాలు, ఈవెంట్స్, బుల్లితెర, సోషల్ మీడియా ద్వారా భారీగా సంపాదిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా బిజినెస్‌లోనూ అడుగుపెట్టింది. హైదరాబాద్ మాదాపూర్‌లో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. కెరీర్ పరంగా దూసుకెళ్తున్న శ్రీముఖి.. పెళ్లి విషయంలో మాత్రం తేల్చడం లేదు. తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో శ్రీముఖి డ్రెస్ సెన్స్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు ఓ బుల్లితెర నటుడు. ఈ వివరాల్లోకి వెళితే..

Recommended For You
Ustaad Bhagat Singh Day 12 Collections: దారుణంగా పడిపోయిన ఉస్తాద్ కలెక్షన్స్.. పవన్ మూవీ హిట్ కావాలంటే?
Ustaad Bhagat Singh Day 12 Collections: దారుణంగా పడిపోయిన ఉస్తాద్ కలెక్షన్స్.. పవన్ మూవీ హిట్ కావాలంటే?

ప్రతి వారం మాదిరిగానే ఈ వారానికి సంబంధించి ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోమో రిలీజ్ అయ్యింది. సమ్మర్ స్పెషల్ థీమ్‌తో ఈసారి కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. ప్రోమో స్టార్టింగ్‌లో సెలబ్రిటీలంతా కొబ్బరి బొండాలు తాగుతూ ఎంట్రీ ఇస్తారు. మీరు ఏ బొండం నీళ్లయినా తాగండి.. కానీ అమర్‌దీప్ చౌదరి బొండం తాగొద్దని ఎక్స్‌ప్రెస్ హరి వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకు అని శ్రీముఖి అడగ్గా.. అందులో కొబ్బరి నీళ్లు ఉంటాయి, ఇందులో కొబ్బరి నీళ్లు కొంచెం కలిపి ఉంటాయని చెప్పడంతో అంతా నవ్వేస్తారు. నువ్వు రీసెంట్‌గా ఏ షో ఓడిపోయావని శ్రీముఖి అడగ్గా.. అమర్ సిగ్గుపడిపోతాడు.

You May Also Like
Sanjay Dutt: 4000 కోట్లతో సంజయ్ దత్ సరికొత్త చరిత్ర.. ప్రభాస్, రణ్‌వీర్‌‌ రికార్డులు గల్లంతు
Sanjay Dutt: 4000 కోట్లతో సంజయ్ దత్ సరికొత్త చరిత్ర.. ప్రభాస్, రణ్‌వీర్‌‌ రికార్డులు గల్లంతు

ఆ వెంటనే అమ్మాయిలు జ్యూస్ తాగుతూ ఎంట్రీ ఇవ్వగా.. వీళ్లంతా బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెకేషన్‌కు వచ్చారని కన్నడ అమ్మాయిలను ఉద్దేశించి కామెంట్స్ చేశాడు హరి. సమ్మర్లో నువ్వు ఎలాంటి డ్రింక్స్ తీసుకుంటావని అడగ్గా.. యష్మి గౌడ సైలెంట్ అయిపోతుంది. నువ్వు వెకేషన్‌కి వెళ్లాంటే ఏ ఊరికి వెళ్తావని అడగ్గా.. థాయ్‌లాండ్ అని చెబుతుంది ఆషికా పదుకొనె. సమ్మర్ కోసం ఎలాంటి టిప్ ఇస్తావని శ్రీముఖి అడగ్గా.. మంచిగా నీళ్లు తాగి, బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవాలని చెప్పింది కావ్యశ్రీ. ఆమెను ఇమిటేట్ చేస్తూ అమర్‌దీప్ నవ్వించే ప్రయత్నం చేయగా.. పంచ్ విసిరింది శ్రీముఖి. ఆ తర్వాత గుండెనిండా గుడిగంటలు ఫేమ్ బాలు మాట్లాడుతూ.. మీరు ఇలాంటి డ్రెస్‌లు బాలి వెళ్లినప్పుడు వేసుకోవచ్చు కదా? ఇక్కడికి ఎందుకు అని శ్రీముఖిని అడగ్గా.. ఆమె నవ్వేస్తూ మానస్‌ గుండెలపై కొడుతుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: sreemukhi movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X