ఆమెతో కలిసి గోవాలో శ్రీముఖి రచ్చ: వాళ్లతో పాటు అతడు కూడా.. ఆ ఫొటోలు వదిలి షాకిచ్చిన యాంకర్
ఆమెతో కలిసి గోవాలో శ్రీముఖి రచ్చ: వాళ్లతో పాటు అతడు కూడా.. ఆ ఫొటోలు వదిలి షాకిచ్చిన యాంకర్
బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు తమ ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతున్నారు. చేతి నిండా షోలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్‌కు కూడా సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ శ్రీముఖి ఒకరు. చాలా ఏళ్లుగా టెలివిజన్ రంగంలో తన హవాను చేపిస్తోన్న ఈ భామ.. వరుస షోలు, సినిమాలతో సత్తా చాటుతోంది. ఇలాంటి సమయంలో తాజాగా ఆమె గోవా టూర్ వెళ్లింది. అక్కడ మరో యాంకర్.. తన క్లోజ్ ఫ్రెండ్‌తో కలిసి రచ్చ రచ్చ చేస్తోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

స్టార్ యాంకర్‌గా శ్రీముఖి.. ఆ షోతో హైలైట్
యాక్టర్‌గా సినీ రంగంలోకి ప్రవేశించిన తర్వాత 'అదుర్స్' అనే షోతో బుల్లితెరపైకి యాంకర్‌గానూ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్' సహా ఎన్నో షోలకు హోస్టుగా చేసింది. ఆమె కెరీర్‌లోనే 'పటాస్' షోను ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఈ షో వల్లే శ్రీముఖికి ఎనలేని క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు.

సినిమాల్లోనూ ఎంట్రీ... మంచి మంచి రోల్స్
బుల్లితెర యాంకర్‌గా శ్రీముఖి ఎన్నో షోలు చేయడం ద్వారా ఫుల్ ఫేమస్ అయింది. దీంతో టెలివిజన్‌లో ఆమె వన్ ఆఫ్ ది టాప్ యాంకర్‌గా నిలిచింది. అదే సమయంలో ఆమె చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా 'జులాయి', 'నేను శైలజ', 'జెంటిల్‌మన్', 'బాబు బాగా బిజీ' సహా ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు చేసింది. అలాగే, సినిమా ఈవెంట్లను హోస్ట్ చేసి సత్తా చాటింది.

టైటిల్ ఫేవరెట్‌గా ఎంట్రీ... రెండో స్థానంతోనే
రెండేళ్ల క్రితం ప్రసారం అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ -3కి శ్రీముఖి ఒక కంటెస్టెంట్‌గా వెళ్లింది. ఈ సీజన్ మొత్తానికి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఈ అమ్మడు.. చిన్నగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. దీంతో టైటిల్ సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఆమెను వెనక్కి నెడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలు సింగర్ రాహుల్ సిప్లీగంజ్‌కు జై కొట్టారు.

హీరోయిన్‌గానూ పరిచయం.. అంకుల్స్‌తో
యాంకర్‌గా, యాక్టర్‌గా మెప్పించిన యాంకర్ శ్రీముఖి.. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించి ఆకట్టుకుంది. చాలా గ్యాప్ తర్వాత మరోసారి 'క్రేజీ అంకుల్స్' అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. భరణి, సింగర్ మనో, రాజా రవీంద్ర ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమాను ఇ. సత్తిబాబు తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే విడుదల సినిమా ట్రైలర్‌కు విపరీతమైన స్పందన వచ్చింది.

ఆమెతో కలిసి శ్రీముఖి రచ్చ.. అతడు కూడా
కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉండే శ్రీముఖి.. అప్పుడప్పుడూ టూర్లు వెళుతూ చిల్ అవుతోంది. ఇప్పటికే ఎన్నోసార్లు తన స్నేహితులతో కలిసి పర్యటనలు చేసిన ఈ అమ్మడు.. తాజాగా గోవాకు వెళ్లింది. ఆమె వెంట మరో యాంకర్ విష్ణుప్రియ భీమనేని కూడా ఉంది. అంతేకాదు, ఆర్జే చైతూ కూడా ఈ ట్రిప్ వెళ్లాడు. అక్కడ చిల్ అవుతోన్న విషయాన్ని శ్రీముఖి స్వయంగా వెల్లడించింది.

ఆ ఫొటోలు వదిలి షాకిచ్చిన యాంకర్
గోవా ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను శ్రీముఖి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని గ్లామరస్ ఫొటోలను కూడా వదిలింది. బీచ్ రిసార్ట్‌లో బుల్లి గౌను వేసుకుని దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిందామె. అంతేకాదు, కొన్ని వీడియోలను కూడా వదిలింది. అలాగే, విష్ణుప్రియతో కలిసి పాట పాడుతూ చేసిన వీడియోను స్టోరీగా పెట్టుకుంది.


Click it and Unblock the Notifications











