Brahmamudi మానస్ కాపురంలో నిప్పులు పోసిన శ్రీముఖి.. అసలు ఏం జరిగిందంటే?
బ్రహ్మముడి సీరియల్ ఎంతగా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై సీరియల్స్ చూసే ప్రతిఒక్కరికి ఈ సీరియల్ గురించి తెలుసు. అయితే ఈ సీరియల్ హీరో మానస్ నాగులపల్లి స్టార్ మా పరివార్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నాడు. ఆ ప్రోగ్రామ్ కు వ్యాఖ్యాతగా వ్యవహారిస్తున్న శ్రీముఖి.. మానస్ కాపురంలో నిప్పులు పోసింది. అసలు ఏం జరిగింది... శ్రీముఖి ఏం చేసిందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మానస్ నాగులపల్లి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన ఎన్నో సీరియల్స్ లో నటించిన మానస్.. బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టారు. బిగ్ బాస్ విజేత సన్ని ఫ్రెండుగా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ లో నిలిచిన మానస్.. బిగ్ బాస్ తర్వాత బ్రహ్మముడి సీరియల్ చేస్తున్నాడు.

బ్రహ్మముడి సీరియల్ ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్న మానస్... సినిమాల్లోనూ నటించాడు. గ్రీన్ సిగ్నల్, గ్యాంగ్స్ ఆఫ్ గబ్బర్ సింగ్, సోడా గోలి సోడా, ప్రేమికుడు తదితర తెలుగు సినిమాల్లోనూ మాసన్ నటించి మెప్పించాడు. ఇక ఆ మధ్య హిందీలో ప్యార్ కుల్హాద్ అని హిందీ సినిమాలోనూ ఆయన హీరోగా నటించి ప్రేక్షకులను అలరించాడు.
ఇక 'బ్రహ్మముడి'లో హీరోగా నటిస్తున్న మాసన్.. ఈ సీరియల్ కు మంచి ఆదరణ లభిస్తుంది. ఇక ఈ సీరియల్ టీమ్ అంతా స్టార్ మా పరివార్ కార్యక్రమానికి వచ్చారు. అయితే ఇటీవల మానస్ ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య వారి ఫోటోలు వైరల్ గా కూడా అయ్యాయి. త్వరలో ఓ ఇంటివాడు కానున్నారు మానస్.

అయితే ఈ నేపథ్యంలోనే మాసన్ స్టార్ మా పరివార్ లో పాల్గొన్నాడు. ఇక ప్రోగ్రామ్ లో యాంకర్ శ్రీముఖి.. మానస్ కు కాబోయే భార్యకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి... నేను మానస్ గర్ల్ ఫ్రెండు మాట్లాడుతున్న అని చెబుతుంది. దానితో ఆమె ఎన్నో గర్ల్ ఫ్రెండు అని అంటుంది. దానికి షాక్ అయి అంతా నవ్వుతారు. తర్వాత శ్రీముఖి.. ఏంటి మానస్ నడుము గిల్లుతున్నావు అంటుంది శ్రీముఖి... ఆ తర్వాత నా పేరు పక్కన నాలుగు హార్ట్స్ పెట్టాడు అని చెప్తుంది శ్రీముఖి.
ఇక ఇది విన్న వారంత నవ్వుతారు. దానికి మాసన్ కాబోయే భార్య నా చేతిలో రింగు పెట్టాడు అని చెప్తుంది. మళ్లీ అక్కడి వారంతా నవ్వుతారు. మొత్తానికి ఈ ప్రోగ్రామ్ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన నెటిజన్స్... మానస్ కాపురంలో నిప్పులు పోసిందని అంటున్నారు. ఇక ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం 11 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది.


Click it and Unblock the Notifications











