యాంకర్ రవికి షాక్.. పటాస్‌కు శ్రీముఖి గుడ్‌బై.. వీడియో రిలీజ్

Recommended Video

Anchor Sreemukhi Emotional Video, Says Good Bye To Patas Show || Filmibeat Telugu

బుల్లితెర రియాలిటీ షోలలో పటాస్‌కు మంచి ప్రజాదరణ ఉంది. జబర్తస్త్ షో మాదిరిగానే అవసరమైనంత అడల్ట్ కంటెంట్‌తో యూత్‌ను ఈ షో పిచ్చెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో సక్సెస్ వెనుక యాంకర్లు రవి, శ్రీముఖి టాలెంట్ ప్రధానమైన కారణమని చెప్పవచ్చు. యాంకర్లుగా రవి, శ్రీముఖి కెమిస్ట్రీ బుల్లితెరకు మంచి రేటింగ్ తెచ్చిపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్్యంలో పటాస్ షో నుంచి తప్పుకొంటున్నట్టు శ్రీముఖి వీడియో రిలీజ్ చేయడం షాకింగ్‌గా మారింది. వీడియోలో శ్రీముఖి చెప్పిందేమిటంటే..

పటాస్ ఇంపార్టెంట్ షో

పటాస్ ఇంపార్టెంట్ షో

మీతో ఈ వీడియో ద్వారా ఓ ముఖ్యమైన విషయాన్ని పంచుకోవడానికి వచ్చాను. నా జీవితంలో, కెరీర్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ షో పటాస్. ఎంతో ప్రజాదరణ పొందిన ఈ షోలో నన్ను భాగం చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందుకు మల్లెమాల ప్రొడక్షన్, శ్యాంప్రసాద్ రెడ్డి, దీప్తి గారికి థ్యాంక్స్. వాళ్లు నన్ను ఈ కార్యక్రమంలో హోస్ట్‌గా అవకాశం ఇచ్చినందుకు మరీ మరీ థ్యాంక్స్ అని శ్రీముఖి అన్నారు.

పటాస్ సెట్స్‌కు వెళితే అదో ఎనర్జీ

పటాస్ సెట్స్‌కు వెళితే అదో ఎనర్జీ

ఎప్పుడూ పటాస్ కార్యక్రమం షూట్ చేసినా.. సెట్స్‌కు వెళ్లిన మాటల్లో చెప్పలేని ఎనర్జీ ఉంటుంది. స్టూడెంట్స్ అల్లరి నచ్చతుంది. ఐ లవ్ ది దట్ ఎనర్జీ. అలాంటి షో నుంచి నేను బ్రేక్ తీసుకొంటున్నాను. మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి అనుమతి తీసుకొని ఈ నిర్ణయం తీసుకొన్నాను అని శ్రీముఖి వెల్లడించింది.

ప్రేక్షకులకు, ఫ్యాన్స్‌కు సమాధానం చెప్పాలని

ప్రేక్షకులకు, ఫ్యాన్స్‌కు సమాధానం చెప్పాలని

పటాస్ షో ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది. నన్ను ఆదరించిన ప్రేక్షకులకు సమాధానం చెప్పుకోవాలనే బాధ్యతను తెలుసుకొని ఈ వీడియోను రిలీజ్ చేస్తున్నాను. నా ఫ్యాన్స్‌కు ఈ విషయం చెప్పాలనే ఉద్దేశంతో ఈ మెసేజ్ పాస్ చేయాలని డిసైడ్ అయ్యాను. పటాస్ నుంచి బ్రేక్ తీసుకొంటున్నాను అని శ్రీముఖి వెల్లడించింది.

యాంకర్ రవికి శ్రీముఖి షాక్

పటాస్ రియాలిటీ షో అత్యంత సుదీర్ఘంగా సాగుతున్నది. ఈ షోలో యాంకర్ రవి, శ్రీముఖి కెమిస్ట్రీ బుల్లితెర మీద అద్భుతంగా పండింది. ఈ జంట ప్రస్తుతం టాప్ రేంజ్‌లో కొనసాగుతున్నది. అలాంటి రవికి శ్రీముఖి తోడుగా లేకపోవడం గట్టి షాకే అనిచెప్పవచ్చు. శ్రీముఖి స్థానంలో ఎవరొస్తారో అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X